Lakshmi Shodashopachara Puja and Stuti by Indra Brahma Vaivarta Purana
Lakshmi Shodashopachara Puja By Indra:
Asanam:
Meaning:
Bhagavati Maha Lakshmi! May I offer in your service an invaluable and distinguished seat made of Choicest Jewels specially designed and crafted by Vishwakarma, the Celestial Designer!
Paadyam:
Shuddham Gangodakamidam Sarva Vanditameepsitam,
Paapedhma vahni rupam cha gruhyataam Kamalaalay
Arghyam:
garbhastitam shuddham gruhnataam Padma vaasini
Deha Soundrya beejam cha gruhnataam Shri Harey Priye!
Dhoop :
Chandan:
Deepam:
Jagacchasthuh swarupam cha dhwaanta pradhwansa kaaranam,
Pradeepam shuddha rupam cha gruhyataam Parameswari
Naivedya:
Anna:
Kheer:
niveditam LakshmiSwaastikam pratiguhnataam
Phala:
Dughdha:
Gud / Jaggery:
Mrishtaanna:
Pishtak:
Eik/ Sugar cane:
Gruhyataam chedam vyajanam shweta chaamaram
Taamboola:
Jala:
Achamaneeya:
Indra ‘Stuti’ to Devi Lakshmi with Meaning:
Om Namah Kamala vaasinyai Naraayanyai Namo Namah,
Krishnapriyayai Suraaryai Padmaayai cha Namo Namah
Padmaasanaayai Padmasanaayai Padminyai Vaishnavyai cha Namo Namah
Sarasampatsarwarupaayai Sarva daatryai Namo Namah,
Sukhadaayai Moksadaayai Siddhidaayai Namo Namah/
Krishna vakshahsthaalaayai cha Krishneyshaayai Namo Namah/
Krishna shobha swarupayai ratna padmey cha shobhaney,
Samapattadhishthaatru Devyai Maha Devyai Namo Namah/
Shasyaadhishthaatru Devyai Shasyaayai cha Namo Namah,
Namo Buddhiswarupayai Buddhidaayai Namo Namah/
Vaikunthey yaa Mahaalakshmeeryaa Lakshmeeh ksheerasaagarey,
Swarga Lakshmeerindra gehey Rajyalakshmeernupaalaye/
Grihalakshmischa grihaanaam gehey cha Griha Devataa,
Surabhih saa gavaam Maataa Dakshinaa Yajnakaaminee/
Aditirdeva mataa twam Kamalaa Kamalaalaye,
Swaahaa twam cha Havirdaaney Kaavya daavey Swadhaa smrutaa/
Twam hi Vishnuswarupaa cha Sarvadhaaraa Vasundharaa,
Shuddha Satwa Swarupaa Twam Naraayanaparaayanaa/
Krodha himsaa varjitaa cha Varadaa cha Shubhaananaa,
Paramaarthapradaa twam cha Haridaasyapradaa Paraa/
Yayaa vinaa Jagatsarwam Bhasmee bhutamasaarakam,
Jeevanmritam cha Vishvam cha Shavastulyam yayaa vinaa/
Sarveshaam cha Paraa twam hi Sarva bandhavarupini,
Yayaa vinaa na Sambhaashyo Baandharvair baandhavah sadaa/
Twayaa heeno Bandhu heeno twayaa yuktah sabaandhavah,
Dharmaartha kaama mokshaanaam twam cha Kaarana rupinee/
Yathaa Maataa stanandhaanaam shishuunaam Shaishavey sadaa,
Tathaa twam sarvadaa Maataa Sarveshaam Sarvarupatah/
Maatru heenah stanaandhascha sa chejjeevati Daivatah,
Twayaa heeno janah kopina Jeevatyeva nischitam/
Suprasanna Swarupaa twam maam prasanna Bhavaambikey,
Vairigrastam cha ishyam dehi mahyaam Sanaatani/
Vayam yaavat twayaa heenaa bandhu heenascha Bhikshukaah,
Sarava sampad viheenaascha taava Deva Haripriye/
Raajyam dehi Shriyam dehi Balam dehi Sureswari,
Keertim dehi Dhanam dehi Yasho Mahyaamcha dehi vai/
Kaamamdehi Matim dehi Bhogaan dehi Haripriye,
Jnaanam dehi Dharmam cha Sarva Soubhaagyameepsitam/
abhaavamcha Prataapamcha Sarvaadhikaaraevacha,
Jayam Paraakramam Yuddhey Paramaishwarya meyvacha/
Meaning:
(Essence of Brahma Vaivarta Purana)
Lakshmi Shodashopachara Puja in Telugu:
లక్ష్మీదేవి పూజా విధానం:
దీపములుకు మట్టితోచేసిన ప్రమిదలు
దీపారధనకు ఆవు నెయ్యి లేదా నువ్వులనునె
నూలువత్తులు (దీపారధనకొరకు)
పువ్వులు (తామర పుష్పములు)
కుంకుమ
పసుపు
అగరువత్తులు
సాంబ్రాణి
గంధపు లేహ్యము
పసుపు గణపతి పూజ:
శ్లో .శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో .అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్/
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ /
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే /
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే /
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము:
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం:
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ మహా లక్ష్మి దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.) తదంగత్వేన కలశారాధనం కరిష్యే
శ్లో . కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
శ్లో . గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
(నీళ్ళు చల్లవలెను)ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.
(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)
ప్రాణప్రతిష్ఠపన మంత్రము:
అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః /
సాంగాం సాయుధాం సపరివారాం శ్రీ మహాలక్ష్మీ పరదేవతాం ఆవాహితాః స్థాపితాః సుప్రితా సుప్రసన్నా వరదాభవతు.
(సమాప్తం.)
లక్ష్మీదేవి షోడశోపచార పూజవిధి:
ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
(స్త్రీలు స్వాహాకి బదులు గా నమః అని చెప్పవలెను)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
సంకల్పం:
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
శ్లో .కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.
కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో . గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా, పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)
(పుష్పము చేతపట్టుకొని)
పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాంలోకైక దీపాంకురాం
శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).
(పుష్పము తీసుకొని)క్షీరదార్ణవ సంభూతే శ్రీప్రదే కమలాలయే /
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే // శ్రీలక్ష్మీ దైవ్యై నమః నమస్కారమ్ సమర్పయామి.
(పుష్పము వేయవలెను.)
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షః స్థలాలయే /
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా //
శ్రీలక్ష్మీ దేవ్యై నమః ఆవాహయామి
(పుష్పము వేయవలెను).
తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహమ్
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం
శ్రియం దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃఇతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
శ్లో.సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
గృహణాచమనం దేవిమయాదత్తం శ్భప్రదే
శ్రీలక్ష్మీదేవ్యై నమః శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)
మఢఃఉపర్కం గృహాణత్వం దేవి నమోస్తుతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి. పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)
శ్లో.ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీలక్ష్మీదేవ్యై నమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)
శ్లో.ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
శ్రీలక్ష్మీదేవ్యై నమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)
శ్లో.ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
శ్రీలక్ష్మీదేవ్యై నమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)
శ్లో.ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః,మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా,మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
శ్రీలక్ష్మీదేవ్యై నమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)
శ్లో.ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
శ్రీలక్ష్మీదేవ్యై నమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)
ఫలోదకస్నానం:
శ్లో.యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)
శ్రీలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.
ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)
ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మికీర్తిమృద్ధిం దదాతుమే.
శ్లో.సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే గృహతే
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.
గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి
(గంధం చల్లవలెను.)
శ్లో.కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
(పుష్పములు, అక్షతలు సమర్పించవలెను)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ స్మర్పయామి
(అక్షితలు వేయవలేను.)
కర్దమేన ప్రజాభూతామయి సంభవకర్దము
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్ //
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీలక్ష్మీదేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి.
(పుష్పాములు వేయవలెను)
అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః //
హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.
యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.
అథాంగపూజా:
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయైఅ నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదనమాత్రే నమః స్తనౌ పుజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
తదుపరి ఇక్కడ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను
అపస్రజంతు స్నిగ్థాని చిక్లీతవసమేగృహే
నిచదేవీం మాత్రం శ్రియం వాసయ మేకులే //
శ్లో.వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ //
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం //
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి //
ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్
చంద్రాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో.అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మమావహ /
షడ్రసోపేతరుచిరం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే /
శ్రీలక్ష్మీదేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి /
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాందేవి శీతలం సుమనోహరమ్ /
శ్రీలక్ష్మీధేవ్యై నమః పానీయం సమర్పయామి /
తాంమ అవహజాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ /
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ //
శ్లో.పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
సమ్రాజంచ విరాజం చాభి శ్రీర్యాచనో గృహే
లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాసగం సృజామసి /
శ్లో.నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీలక్ష్మీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి /
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః /
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః /
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
‘లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం” ఇత్యాది పఠింపవలెను.
ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో.యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
శ్లో.సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ప్రార్దనాం సమర్పయామి
చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీలక్ష్మీదేవ్యై నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)
అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ /
(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)
శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి:
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై / వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై /శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై / లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై / దిత్యై నమః
ఓం దీప్తాయై / వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై / కమలాయై నమః
ఓం కాంతాయై / కామాక్ష్యై నమః
ఓం క్రోధసముద్భవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై / అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై / అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమలాదరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగందిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై / శివాయై నమః
ఓం శివకర్యై / సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాగ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం హరిణ్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై / మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్యై / దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
పంచామృతము కొరకు కావాలసినవి :
ఆవుపాలు
ఆవుపెరుగు
తేనె
చేరుకుగడరసము లేదా పంచదార
నెయ్యి
నైవేద్యం తయారు చేయు విధానం:
గోదుమరవ్వ – ఒకకప్పు
పాలు – 4కప్పులు
నెయ్యి – అరకప్పు
పంచదార – రెండున్నర కప్పులు
యాలుకల పొడి
జీడిపప్పులు
కిస్ మిస్
తయారు చేయు విధానం:
మొదట గోదుమరవ్వను తీసుకొని దానిని పాత్రలో వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.తరువాత అదే పాత్రలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి జీడుఇపప్పును కిస్ మిస్ ను వేయించి పక్కన పెట్టుకోవాలి.పాలను కూడా వేడి చేసుకోవాలి.తరువాత దానిలో గోదుమరవ్వ పోసి తక్కువ మంట ఉంచి బాగా ఉడకపెట్టాలి.ఉడికినతరువాత దానిలో పంచదార కలపాలి.బాగా కలియబెట్టాలి.దానిలో నెయ్యి,జీడిపప్పు,కిస్ మిస్ మరియు యాలుకల పొడి వేయాలి.కొంచెంసేపు మూత ఉంచి తక్కువ మంటపై వేడిచేయాలి.