Nomulu Vratalu

Nomulu Vratalu Details www.stotraveda.com
Nomulu Vratalu

Nomulu Vratalu-Cultural Festivals In English,Telugu,Sanskrit/Devanagari

ఏమిటీ వ్రతాలు నోములు:

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా “ఇది నేను చేయవలెను, విడవరాదు” అనుకొనుట. దీనినే వ్రతము అని కూడా అంటారు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి. 

తెలుగు భాషా ప్రాంతాలలో స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.

నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది.

కొద్ది కాలం క్రితం వరకు కొన్ని శతాబ్దాలుగా స్త్రీలు విద్యా విత్తాలకు దూరమయ్యారు. మగ పిల్లలు గురుకులాల్లోనో, వీధి బడుల్లోనో చదువుకునే వారు. బాల్య వివాహాలు జరిగేవి.ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా ఉన్నాయి. త్రిలోక సంచారియైన నారదుడు చెప్పినవి కొన్ని ఉన్నాయి. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఆడ పిల్లలకి సత్ప్రవర్తన నేర్పటానికి వారి చేత నోములు, వ్రతాలు చేయించే వారు. పెళ్ళయిన వెంటనే చిన్నతనంలో చిట్టిబొట్టు( తిలక ధారణం యొక్క ప్రాశస్త్యాన్నితెలిపి, బొట్టు పెట్టుకోటం, పెట్టటం నేర్పటానికి), నిత్య శృంగారం (అలంకరించుకోటం, అలంకరించటాల్లో శిక్షణ) మొదలైన వ్రతాలతో ప్రారంభించి, పువ్వు తాంబూలం, పండు తాంబూలం అనే నోముతో సాటి వారికి భక్తి భావంతో ఇవ్వటం అనేది అలవాటు చేయటం జరిగేది. ఎక్కువ వ్రతాల ప్రయోజనం ఇదే.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట.

వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు తాంబూలాలు ముత్తైదువల కివ్వటం ఆచారంగా వస్తోంది. తాంబూలంలో ఉండే ఆకు, వక్క, సున్నం దానం చెయ్యటం వల్ల సూర్య, కుజ, చంద్ర దోషాలు పరిహారం అవుతాయి. నాన బెట్టిన పెసలు, శనగలు వాయినంలో ఇవ్వటం వల్ల బుధగ్రహ,గురు గ్రహ దోషాలు పరిహరింప బడుతాయి.

వ్రతాలు చాలా వరకు స్కాందపురాణాంతర్గతమైనవిగా కనపడతాయి. స్కందుడికి సంబంధించింది స్కాంద పురాణం. స్కందుడంటే కుమార స్వామి. జగన్మాత జగత్పితల ముద్దుల పట్టి అయిన కుమార స్వామి లోకంలోని జీవు లందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ జీవులందరి పక్షాన అందరికి తల్లి తండ్రులైన పార్వతి పరమేశ్వరుల వద్దకు వెళ్ళి, ఈతి బాధలతో సతమత మౌతున్న మానవులకు సంసార దుఃఖాన్ని పోగొట్ట గలిగిన దివ్యౌషధ మేదైనా తెలియ చేయ వలసిందని తల్లి పార్వతీ దేవిని ప్రార్థిస్తాడు. జగజ్జనని కుమారుడడిగిన దానిని భర్తకు నివేదిస్తుంది. కొన్ని వ్రతాలలో కుమారు డడగబోయే దానిని పార్వతీ దేవి అప్పటికే అడిగి ఉంటుంది. శివుడు భూలోక వాసులు పడుతున్న బాధలను పోగొట్టే వ్రతాన్ని పార్వతీదేవి సమక్షంలో కుమారస్వామికి ఉపదేశం చేస్తాడు. కుమారస్వామి అంటే జీవులందరి ప్రతినిధి. ఆయనకు ఉపదేశిస్తే భూలోకం లోని జనులందరికి ఉపదేశించినట్టే. కనుకనే వ్రతాలని మళ్ళీ మరెవరో ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. హాయిగా చేసెయ్యటమే!! కొడుకు చనవు కొద్దీ తల్లిని అడగటం ఆమె తండ్రికి చెప్పటం, ఆయన సమాధానం చెప్పటమో, అనుమతించటమో, ఆమోదించటమో సహజమే కదా!

సాధారణంగా ఆడవారు చేసే పూజలు, వ్రతాలు నోములు చాలా వరకు అయిదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని మాత్రం పిల్లలు కావాలనో, ఉన్న పిల్లలు బాగుండాలనో, వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది. చిత్రమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకొనేది లేదు. ఇంక చిత్రం ఏమంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు, నోములు చేస్తారు గాని భార్య కోసం భర్త చేసే వ్రతం ఒక్కటి కూడా కనపడదు. దానికి తగిన కారణం ఉన్నదనుకోండి.

పదహారు ఫలాల నోము కథ మంచివి దానం చేస్తే వచ్చే ఫలితాన్ని, చచ్చువి పుచ్చువి దానం చేస్తే వచ్చే ఫలితాన్ని సోదాహరణంగా నిరూపిస్తుంది. ఈ కథ విన్న వారెవరూ పాడైన వస్తువులని దానం చేయటానికి సాహసించరు. తమ కున్న దానిని ఇతరులతో పంచుకోవటం, ఇతరులకు మంచివి మాత్రమే ఇవ్వాలని చెప్పటం, సాటి వారిలో తమ ఇష్ట దైవాన్ని చూడటం అలవాటు చెయ్యటం, సహనం, క్షమ మొదలైన గుణాలు పెంపొందించటం ఈ వ్రతాల లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ లక్షణాలున్న వారికి భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మి వ్రత కథ ఈ అంశాన్నే నిరుపిస్తుంది.

హితంగా మితంగా మాట్లాడుతూ, గయ్యాళి కాక, అత్తమామల సేవ చేస్తూ, పతివ్రత అయిన చారుమతి (మంచి బుద్ధి కలిగినది) ని వరలక్ష్మి అనుగ్రహించి, కలలో కనపడి వర లక్ష్మి వ్రతం చెయ్యమంటుంది. అప్పటికి చారుమతి వరలక్ష్మిని పూజించ లేదు. అయినా ఆ తల్లి అనుగ్రహించిందంటే చారుమతి సత్ప్రవర్తనయే కారణం అనటంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి వరలక్ష్మి అనుగ్రహం పోందలనుకునే వారు చారుమతి లాగా మంచి నడవడిక కలిగి ఉండాలనే సూచన ఉన్నదీ వ్రతంలో. ఏ వ్రతమైనా అంతే!

కొన్ని నోములు:

అంగరాగాల కథ

అక్షయబొండాల కథ

అట్ల తద్దె కథ

అన్నము ముట్టని ఆదివారముల నోము

అమావాస్య సోమవారపు కథ

ఆపద లేని ఆది వారపు కథ

ఉండ్రాళ్ళ తద్దె కథ

ఉదయ కుంకుమ నోము

ఉప్పుగౌరీ నోము కథ

కందగౌరీ నోము కథ

కడుపుకదలనిగౌరీ నోము కథ

కన్నెతులసమ్మ కథ

కరళ్ళగౌరీ నోము కథ

కల్యాణగౌరీ నోము కథ

కాటుకగౌరీ నోము కథ

కార్తీక చలిమళ్ళ కథ

కుంకుమ నోము గౌరీ కథ

కుందేటి అమావాస్య కథ

కృత్తిక దీపాల కథ

కేదారేశ్వర వ్రతం

కైలాసగౌరీ నోము కథ

క్షీరాబ్ధిశయన వ్రతం

గంధతాంబూలము కథ

గడాపలగౌరీ నోము కథ

గణేశుని నోము కథ

గాజులగౌరీ నోము కథ

గుడిసె నోము కథ

గుమ్మడిగౌరీ నోము కథ

గూనదీపాలు బానదీపాలు కథ

గౌరీ వ్రతం

గ్రహణగౌరీ నోము కథ

గ్రామకుంకుమ కథ

చద్దికూటి మంగళవారపు కథ

చిక్కుళ్ళగౌరీ నోము కథ

చిత్రగుప్తుని కథ

చిలుకు ముగ్గుల కథ-1

చిలుకు ముగ్గుల కథ-2

తరగనాది వారముల నోము

తవుడుగౌరీ నోము కథ

త్రినాధ ఆదివారపు నోము కథ

దంపతుల తాంబూలము నోము

దీపదానము నోము కథ

ధైర్యగౌరీ నోము కథ

ధైర్యలక్ష్మీ వ్రత కథ

నందికేశ్వర వ్రత కథ

నవగ్రహ దీపాల కథ

నిత్యదానము కథ-1

నిత్యదానము కథ-2

నిత్యవిభూతి కథ

నిత్యశృంగారము కథ

నెల సంక్రమణ దీపాల కథ

పండుతాంబూలము కథ

పదమూడు పువ్వుల కథ

పదహారు కుడుముల నోము

పదారు ఫలముల నోము

పసుపు నోము గౌరీ కథ

పువ్వు తాంబూలము నోము

పూర్ణాది వారముల నోము

పెండ్లి గుమ్మడి నోము

పెద్ద సంక్రమణ దీపాల కథ

పెరుగుమీద పేరినెయ్యి కథ

పోలాల అమావాస్య కథ

పోలి స్వర్గమునకు వెళ్ళు నోము

ఫలశృతి

బారవత్తుల మూరవత్తుల కథ

బాలాది వారముల నోము

బొమ్మలనోము కథ

మారేడుదళ వ్రత కథ

ముని కార్తీకవ్రతము కథ

మూగనోము కథ

మూసివాయనాల కథ

మొగ్గదోసిళ్ళ కథ

లక్ష పసుపు నోము

లక్ష వత్తుల నోము

విష్ణుకమలాల కథ

శాకదానము కథ

శివదేవుని సోమవారపు నోము కథ

సూర్యచంద్రుల కథ

సూర్యపద్మము కథ

కొన్ని వ్రతములు:

శ్రీ సత్యనారాయణ వ్రతము

శ్రీ మంగళగౌరీ వ్రతము

శ్రీ వినాయకచతుర్థీ వ్రతము

శ్రీ కేదారేశ్వర వ్రతము

శ్రీ కార్తీకసోమవార వ్రతము

శ్రీ స్కందషష్టీ వ్రతము

శ్రీ సావిత్రీగౌరీ వ్రతము

శ్రీ శివరాత్రి వ్రతము

శ్రీ నందికేశ్వర వ్రతము

శ్రీ కులాచారావన వ్రతము

శ్రీ ఏకపత్నీ వ్రతము

Here you will find Some types of Vrathalu and Nomulu Complete procedures. Check below:

Polala Amavasya Vratham-Kanda Plant vratham-కందగౌరీ నోము కథ

Varalakshmi Vratham Pooja Vidhanam Sravana Masam At Home-వరలక్ష్మీ వ్రతం

Pournami Vratham Pournami Pooja Vidhi Mantra for Purnima Vrat Chanting

Manidweeparnana Vratham

Srinivasa Vidya శ్రీనివాస విద్య (Thousands years back Vidyaranyaswami Sravan Mas special vrath)

kshipra ganapathi Pooja

Varahi Gupta Navaratri Pooja(Ashada Navaratri Vrath)

Putraprati Vrat (for birth of Male Baby)

Sravana Sukravaram Vratham-Lakshmi Shodashopachara Puja and Stuti by Indra Brahma Vaivarta Purana

Sravana Somavaram Vratham-శివదేవుని సోమవారపు నోము కథ Lord Shiva Shodashopachara pooja-16 steps lord shiva puja in English-Monday Pooja Vidhi

Amavasya Vratha Puja-Vidhi-How to do Anavasya pooja

Sashti Vratam Puja Vidhi-శ్రీ స్కందషష్టీ వ్రతము