Sri Rama Pattabhisheka Sarga

Sri Rama Pattabhisheka Sarga | Sri Rama Pattabhishekam Sarga Lyrics |శ్రీరామ పట్టాభిషేక సర్గ | श्रीराम पट्टाभिषेक घट्टं

Sri Rama Pattabhisheka Sarga | Sri Rama Pattabhishekam Sarga Lyrics | stotraveda -stotra veda
Sri Rama Pattabhisheka Sarga | Sri Rama Pattabhishekam Sarga | శ్రీరామ పట్టాభిషేక సర్గ తాత్పర్య సహితంగా
॥ श्रीराम पट्‍टाभिषेक सर्गः (युद्धकाण्डम्) ॥

॥ śrīrama pattabhisēka sargaḥ (yuddhakandam) ॥
śirasyañjalimadhaya kaikēyyanandavardhanaḥ ।
babhasē bharatō jyēsthaṁ ramaṁ satyaparakramam ॥ 1 ॥

pūjita mamika mata dattaṁ rajyamidaṁ mama ।
taddadami punastubhyaṁ yatha tvamadada mama ॥ 2 ॥

dhuramēkakina nyastamr̥sabhēna balīyasa ।
kiśōravadguruṁ bharaṁ na vōdhumahamutsahē ॥ 3 ॥

varivēgēna mahata bhinnaḥ sēturiva ksaran ।
durbandhanamidaṁ manyē rajyacchidramasaṁvr̥tam ॥ 4 ॥

gatiṁ khara ivaśvasya haṁsasyēva ca vayasaḥ ।
nanvētumutsahē rama tava margamarindama ॥ 5 ॥

yatha carōpitō vr̥ksō jataścantarnivēśanē ।
mahaṁśca sudurarōhō mahaskandhaḥ praśakhavan ॥ 6 ॥

śīryēta puspitō bhūtva na phalani pradarśayan ।
tasya nanubhavēdarthaṁ yasya hētōḥ sa rōpyatē ॥ 7 ॥

ēsōpama mahabahō tvadarthaṁ vēttumarhasi ।
yadyasmanmanujēndra tvaṁ bhaktanbhr̥tyanna śadhi hi ॥ 8 ॥

jagadadyabhisiktaṁ tvamanupaśyatu sarvataḥ ।
pratapantamivadityaṁ madhyahnē dīptatējasam ॥ 9 ॥

tūryasaṅghatanirghōsaiḥ kañcīnūpuranisvanaiḥ ।
madhurairgītaśabdaiśca pratibudhyasva raghava ॥ 10 ॥

yavadavartatē cakraṁ yavatī ca vasundhara ।
tavattvamiha sarvasya svamitvamanuvartaya ॥ 11 ॥

bharatasya vacaḥ śrutva ramaḥ parapurañjayaḥ ।
tathēti pratijagraha nisasadasanē śubhē ॥ 12 ॥

tataḥ śatrughnavacanannipunaḥ śmaśruvardhakaḥ ।
sukhahastaḥ suśīghraśca raghavaṁ paryupasata ॥ 13 ॥

pūrvaṁ tu bharatē snatē laksmanē ca mahabalē ।
sugrīvē vanarēndrē ca raksasēndrē vibhīsanē ॥ 14 ॥

viśōdhitajataḥ snataścitramalyanulēpanaḥ ।
maharhavasanō ramastasthau tatra śriya jvalan ॥ 15 ॥

pratikarma ca ramasya karayamasa vīryavan ।
laksmanasya ca laksmīvaniksvakukulavardhanaḥ ॥ 16 ॥

pratikarma ca sītayaḥ sarva daśarathastriyaḥ ।
atmanaiva tada cakrurmanasvinyō manōharam ॥ 17 ॥

tatō vanarapatnīnaṁ sarvasamēva śōbhanam ।
cakara yatnatkausalya prahr̥sta putralalasa ॥ 18 ॥

tataḥ śatrughnavacanatsumantrō nama sarathiḥ ।
yōjayitva:’bhicakrama rathaṁ sarvaṅgaśōbhanam ॥ 19 ॥

arkamandalasaṅkaśaṁ divyaṁ dr̥stva rathōttamam ।
arurōha mahabahū ramaḥ satyaparakramaḥ ॥ 20 ॥

sugrīvō hanumaṁścaiva mahēndrasadr̥śadyutī ।
snatau divyanibhairvastrairjagmatuḥ śubhakundalau ॥ 21 ॥

varabharanasampanna yayustaḥ śubhakundalaḥ ।
sugrīvapatnyaḥ sīta ca drastuṁ nagaramutsukaḥ ॥ 22 ॥

ayōdhyayaṁ tu saciva rajñō daśarathasya yē ।
purōhitaṁ puraskr̥tya mantrayamasurarthavat ॥ 23 ॥

aśōkō vijayaścaiva sumantraścaiva saṅgataḥ ।
mantrayanramavr̥ddhyarthamr̥ddhyarthaṁ nagarasya ca ॥ 24 ॥

sarvamēvabhisēkarthaṁ jayarhasya mahatmanaḥ ।
kartumarhatha ramasya yadyanmaṅgalapūrvakam ॥ 25 ॥

iti tē mantrinaḥ sarvē sandiśya tu purōhitam ।
nagaranniryayustūrnaṁ ramadarśanabuddhayaḥ ॥ 26 ॥

hariyuktaṁ sahasraksō rathamindra ivanaghaḥ ।
prayayau rathamasthaya ramō nagaramuttamam ॥ 27 ॥

jagraha bharatō raśmīñśatrughnaśchatramadadē ।
laksmanō vyajanaṁ tasya mūrdhni samparyavījayat ॥ 28 ॥

śvētaṁ ca valavyajanaṁ jagraha purataḥ sthitaḥ ।
aparaṁ candrasaṅkaśaṁ raksasēndrō vibhīsanaḥ ॥ 29 ॥

r̥sisaṅghaistada:’:’kaśē dēvaiśca samarudganaiḥ ।
stūyamanasya ramasya śuśruvē madhuradhvaniḥ ॥ 30 ॥

tataḥ śatruñjayaṁ nama kuñjaraṁ parvatōpamam ।
arurōha mahatējaḥ sugrīvaḥ plavagarsabhaḥ ॥ 31 ॥

navanagasahasrani yayurasthaya vanaraḥ ।
manusaṁ vigrahaṁ kr̥tva sarvabharanabhūsitaḥ ॥ 32 ॥

śaṅkhaśabdapranadaiśca dundubhīnaṁ ca nissvanaiḥ ।
prayayau purusavyaghrastaṁ purīṁ harmyamalinīm ॥ 33 ॥

dadr̥śustē samayantaṁ raghavaṁ sapurassaram ।
virajamanaṁ vapusa rathēnatirathaṁ tada ॥ 34 ॥

tē vardhayitva kakutsthaṁ ramēna pratinanditaḥ ।
anujagmurmahatmanaṁ bhratr̥bhiḥ parivaritam ॥ 35 ॥

amatyairbrahmanaiścaiva tatha prakr̥tibhirvr̥taḥ ।
śriya virurucē ramō naksatrairiva candramaḥ ॥ 36 ॥

sa purōgamibhistūryaistalasvastikapanibhiḥ ।
pravyaharadbhirmuditairmaṅgalani yayau vr̥taḥ ॥ 37 ॥

aksataṁ jatarūpaṁ ca gavaḥ kanyastatha dvijaḥ ।
nara mōdakahastaśca ramasya puratō yayuḥ ॥ 38 ॥

sakhyaṁ ca ramaḥ sugrīvē prabhavaṁ canilatmajē ।
vanaranaṁ ca tatkarma raksasanaṁ ca tadbalam ।
vibhīsanasya samyōgamacacaksē ca mantrinam ॥ 39 ॥

śrutva tu vismayaṁ jagmurayōdhyapuravasinaḥ ॥ 40 ॥

dyutimanētadakhyaya ramō vanarasaṁvr̥taḥ ।
hr̥stapustajanakīrnamayōdhyaṁ pravivēśa ha ॥ 41 ॥

tatō hyabhyucchrayanpauraḥ patakastē gr̥hē gr̥hē ॥ 42 ॥

aiksvakadhyusitaṁ ramyamasasada piturgr̥ham ॥ 43 ॥

athabravīdrajasutō bharataṁ dharminaṁ varam ।
arthōpahitaya vaca madhuraṁ raghunandanaḥ ॥ 44 ॥

piturbhavanamasadya praviśya ca mahatmanaḥ ।
kausalyaṁ ca sumitraṁ ca kaikēyīmabhivadya ca ॥ 45 ॥

yacca madbhavanaṁ śrēsthaṁ saśōkavanikaṁ mahat ।
muktavaidūryasaṅkīrnaṁ sugrīvaya nivēdaya ॥ 46 ॥

tasya tadvacanaṁ śrutva bharataḥ satyavikramaḥ ।
panau gr̥hītva sugrīvaṁ pravivēśa tamalayam ॥ 47 ॥

tatastailapradīpaṁśca paryaṅkastaranani ca ।
gr̥hītva viviśuḥ ksipraṁ śatrughnēna pracōditaḥ ॥ 48 ॥

uvaca ca mahatējaḥ sugrīvaṁ raghavanujaḥ ।
abhisēkaya ramasya dūtanajñapaya prabhō ॥ 49 ॥

sauvarnanvanarēndranaṁ caturnaṁ caturō ghatan ।
dadau ksipraṁ sa sugrīvaḥ sarvaratnavibhūsitan ॥ 50 ॥

yatha pratyūsasamayē caturnaṁ sagarambhasam ।
pūrnairghataiḥ pratīksadhvaṁ tatha kuruta vanaraḥ ॥ 51 ॥

ēvamukta mahatmanō vanara varanōpamaḥ ।
utpēturgaganaṁ śīghraṁ garuda iva śīghragaḥ ॥ 52 ॥

jambavaṁśca hanūmaṁśca vēgadarśī ca vanaraḥ ।
r̥sabhaścaiva kalaśañjalapūrnanathanayan ॥ 53 ॥

nadīśatanaṁ pañcanaṁ jalaṁ kumbhēsu caharan ॥ 54 ॥

pūrvatsamudratkalaśaṁ jalapūrnamathanayat ।
susēnaḥ sattvasampannaḥ sarvaratnavibhūsitam ॥ 55 ॥

r̥sabhō daksinattūrnaṁ samudrajjalamaharat ।
raktacandanaśakhabhiḥ saṁvr̥taṁ kañcanaṁ ghatam ॥ 56 ॥

gavayaḥ paścimattōyamajahara maharnavat ।
ratnakumbhēna mahata śītaṁ marutavikramaḥ ॥ 57 ॥

uttaracca jalaṁ śīghraṁ garudanilavikramaḥ ।
ajahara sa dharmatma nalaḥ sarvagunanvitaḥ ॥ 58 ॥

tatastairvanaraśrēsthairanītaṁ prēksya tajjalam ।
abhisēkaya ramasya śatrughnaḥ sacivaiḥ saha ।
purōhitaya śrēsthaya suhr̥dbhyaśca nyavēdayat ॥ 59 ॥

tataḥ sa prayatō vr̥ddhō vasisthō brahmanaiḥ saha ।
ramaṁ ratnamayē pīthē sahasītaṁ nyavēśayat ॥ 60 ॥

vasisthō vamadēvaśca jabaliratha kaśyapaḥ ।
katyayanaḥ suyajñaśca gautamō vijayastatha ॥ 61 ॥

abhyasiñcannaravyaghraṁ prasannēna sugandhina ।
salilēna sahasraksaṁ vasavō vasavaṁ yatha ॥ 62 ॥

r̥tvigbhirbrahmanaiḥ pūrvaṁ kanyabhirmantribhistatha ।
yōdhaiścaivabhyasiñcaṁstē samprahr̥staḥ sanaigamaiḥ ॥ 63 ॥

sarvausadhirasairdivyairdaivatairnabhasi sthitaiḥ ।
caturbhirlōkapalaiśca sarvairdēvaiśca saṅgataiḥ ॥ 64 ॥

brahmana nirmitaṁ pūrvaṁ kirītaṁ ratnaśōbhitam ।
abhisiktaḥ pura yēna manustaṁ dīptatējasam ॥ 65 ॥

tasyanvavayē rajanaḥ kramadyēnabhisēcitaḥ ।
sabhayaṁ hēmakluptayaṁ śōbhitayaṁ mahajanaiḥ ।
ratnairnanavidhaiścaiva citritayaṁ suśōbhanaiḥ ॥ 66 ॥

nanaratnamayē pīthē kalpayitva yathavidhi ।
kirītēna tataḥ paścadvasisthēna mahatmana ।
r̥tvigbhirbhūsanaiścaiva samayōksyata raghavaḥ ॥ 67 ॥

chatraṁ tu tasya jagraha śatrughnaḥ panduraṁ śubham ।
śvētaṁ ca valavyajanaṁ sugrīvō vanarēśvaraḥ ।
aparaṁ candrasaṅkaśaṁ raksasēndrō vibhīsanaḥ ॥ 68 ॥

malaṁ jvalantīṁ vapusa kañcanīṁ śatapuskaram ।
raghavaya dadau vayurvasavēna pracōditaḥ ॥ 69 ॥

sarvaratnasamayuktaṁ maniratnavibhūsitam ।
muktaharaṁ narēndraya dadau śakrapracōditaḥ ॥ 70 ॥

prajagurdēvagandharva nanr̥tuścapsarōganaḥ ।
abhisēkē tadarhasya tada ramasya dhīmataḥ ॥ 71 ॥

bhūmiḥ sasyavatī caiva phalavantaśca padapaḥ ।
gandhavanti ca puspani babhūvū raghavōtsavē ॥ 72 ॥

sahasraśatamaśvanaṁ dhēnūnaṁ ca gavaṁ tatha ।
dadau śataṁ vr̥sanpūrvaṁ dvijēbhyō manujarsabhaḥ ॥ 73 ॥

triṁśatkōtīrhiranyasya brahmanēbhyō dadau punaḥ ।
nanabharanavastrani maharhani ca raghavaḥ ॥ 74 ॥

arkaraśmipratīkaśaṁ kañcanīṁ manivigraham ।
sugrīvaya srajaṁ divyaṁ prayacchanmanujarsabhaḥ ॥ 75 ॥

vaidūryamanicitrē ca vajraratnavibhūsitē ।
valiputraya dhr̥timanaṅgadayaṅgadē dadau ॥ 76 ॥

manipravarajustaṁ ca muktaharamanuttamam ।
sītayai pradadau ramaścandraraśmisamaprabham ॥ 77 ॥

arajē vasasī divyē śubhanyabharanani ca ।
avēksamana vaidēhī pradadau vayusūnavē ॥ 78 ॥

avamucyatmanaḥ kanthaddharaṁ janakanandinī ।
avaiksata harīnsarvanbhartaraṁ ca muhurmuhuḥ ॥ 79 ॥

tamiṅgitajñaḥ samprēksya babhasē janakatmajam ।
pradēhi subhagē haraṁ yasya tustasi bhamini ।
paurusaṁ vikramō buddhiryasminnētani sarvaśaḥ ॥ 80 ॥

dadau sa vayuputraya taṁ haramasitēksana ।
hanumaṁstēna harēna śuśubhē vanararsabhaḥ ।
candraṁśucayagaurēna śvētabhrēna yatha:’calaḥ ॥ 81 ॥

tatō dvividamaindabhyaṁ nīlaya ca parantapaḥ ।
sarvankamagunanvīksya pradadau vasudhadhipaḥ ॥ 82 ॥

sarvavanaravr̥ddhaśca yē canyē vanarēśvaraḥ ।
vasōbhirbhūsanaiścaiva yatharhaṁ pratipūjitaḥ ॥ 83 ॥

vibhīsanō:’tha sugrīvō hanuman jambavaṁstatha ।
sarvavanaramukhyaśca ramēnaklistakarmana ॥ 84 ॥

yatharhaṁ pūjitaḥ sarvaiḥ kamai ratnaiśca puskalaiḥ ।
prahr̥stamanasaḥ sarvē jagmurēva yathagatam ॥ 85 ॥

natva sarvē mahatmanaṁ tatastē plavagarsabhaḥ ।
visr̥staḥ parthivēndrēna kiskindhamabhyupagaman ॥ 86 ॥

sugrīvō vanaraśrēsthō dr̥stva ramabhisēcanam ।
pūjitaścaiva ramēna kiskindhaṁ praviśatpurīm ॥ 87 ॥

[* ramēna sarvakamaiśca yatharhaṁ pratipūjitaḥ – *]
vibhīsanō:’pi dharmatma saha tairnairr̥tarsabhaiḥ ।
labdhva kuladhanaṁ raja laṅkaṁ prayadvibhīsanaḥ ॥ 88 ॥

sa rajyamakhilaṁ śasannihatarirmahayaśaḥ ।
raghavaḥ paramōdaraḥ śaśasa paraya muda ॥ 89 ॥

uvaca laksmanaṁ ramō dharmajñaṁ dharmavatsalaḥ ॥ 90 ॥

atistha dharmajña maya sahēmaṁ
gaṁ pūrvarajadhyusitaṁ balēna ।
tulyaṁ maya tvaṁ pitr̥bhirdhr̥ta ya
taṁ yauvarajyē dhuramudvahasva ॥ 91 ॥

sarvatmana paryanunīyamanō
yada na saumitrirupaiti yōgam ।
niyujyamanō:’pi ca yauvarajyē
tatō:’bhyasiñcadbharataṁ mahatma ॥ 92 ॥

paundarīkaśvamēdhabhyaṁ vajapēyēna casakr̥t ।
anyaiśca vividhairyajñairayajatparthivarsabhaḥ ॥ 93 ॥

rajyaṁ daśasahasrani prapya varsani raghavaḥ ।
śataśvamēdhanajahrē sadaśvanbhūridaksinan ॥ 94 ॥

ajanulambabahuḥ sa mahaskandhaḥ pratapavan ।
laksmananucarō ramaḥ pr̥thivīmanvapalayat ॥ 95 ॥

raghavaścapi dharmatma prapya rajyamanuttamam ।
ījē bahuvidhairyajñaiḥ sasuhr̥jjñatibandhavaḥ ॥ 96 ॥

na paryadēvanvidhava na ca vyalakr̥taṁ bhayam ।
na vyadhijaṁ bhayaṁ va:’pi ramē rajyaṁ praśasati ॥ 97 ॥

nirdasyurabhavallōkō nanarthaḥ kaṁ-cidaspr̥śat ।
na ca sma vr̥ddha balanaṁ prētakaryani kurvatē ॥ 98 ॥

sarvaṁ muditamēvasītsarvō dharmaparō:’bhavat ।
ramamēvanupaśyantō nabhyahiṁsanparasparam ॥ 99 ॥

asanvarsasahasrani tatha putrasahasrinaḥ ।
niramaya viśōkaśca ramē rajyaṁ praśasati ॥ 100 ॥

ramō ramō rama iti prajanamabhavankathaḥ ।
ramabhūtaṁ jagadabhūdramē rajyaṁ praśasati ॥ 101 ॥

nityapuspa nityaphalastaravaḥ skandhavistr̥taḥ ।
kalē varsī ca parjanyaḥ sukhasparśaśca marutaḥ ॥ 102 ॥

brahmanaḥ ksatriya vaiśyaḥ śūdra lōbhavivarjitaḥ ।
svakarmasu pravartantē tustaḥ svairēva karmabhiḥ ॥ 103 ॥

asanpraja dharmarata ramē śasati nanr̥taḥ ।
sarvē laksanasampannaḥ sarvē dharmaparayanaḥ ॥ 104 ॥

daśa varsasahasrani daśa varsaśatani ca ।
bhratr̥bhiḥ sahitaḥ śrīmanramō rajyamakarayat ॥ 105 ॥

dhanyaṁ yaśasyamayusyaṁ rajñaṁ ca vijayavaham ।
adikavyamidaṁ tvarsaṁ pura valmīkina kr̥tam ।
yaḥ pathēcchr̥nuyallōkē naraḥ papadvimucyatē ॥ 106 ॥

putrakamastu putranvai dhanakamō dhanani ca ।
labhatē manujō lōkē śrutva ramabhisēcanam ॥ 107 ॥

mahīṁ vijayatē raja ripūṁścapyadhitisthati ।
raghavēna yatha mata sumitra laksmanēna ca ॥ 108 ॥

bharatēnēva kaikēyī jīvaputrastatha striyaḥ ।
bhavisyanti sadanandaḥ putrapautrasamanvitaḥ ॥ 109 ॥

śrutva ramayanamidaṁ dīrghamayuśca vindati ।
ramasya vijayaṁ caiva sarvamaklistakarmanaḥ ॥ 110 ॥

śr̥nōti ya idaṁ kavyamarsaṁ valmīkina kr̥tam ।
śraddadhanō jitakrōdhō durganyatitaratyasau ॥ 111 ॥

samagamaṁ pravasantē labhatē capi bandhavaiḥ ।
prarthitaṁśca varansarvanprapnuyadiha raghavat ॥ 112 ॥

śravanēna suraḥ sarvē prīyantē saṁ-praśr̥nvatam ।
vinayakaśca śamyanti gr̥hē tisthanti yasya vai ॥ 113 ॥

vijayēti mahīṁ raja pravasī svastimanvrajēt ।
striyō rajasvalaḥ śrutva putran sūyuranuttaman ॥ 114 ॥

pūjayaṁśca pathaṁścēmamitihasaṁ puratanam ।
sarvapapatpramucyēta dīrghamayuravapnuyat ॥ 115 ॥

pranamya śirasa nityaṁ śrōtavyaṁ ksatriyairdvijat ।
aiśvaryaṁ putralabhaśca bhavisyati na saṁśayaḥ ॥ 116 ॥

ramayanamidaṁ kr̥tsnaṁ śr̥nvataḥ pathataḥ sada ।
prīyatē satataṁ ramaḥ sa hi visnuḥ sanatanaḥ ॥ 117 ॥

adidēvō mahabahurharirnarayanaḥ prabhuḥ ।
saksadramō raghuśrēsthaḥ śēsō laksmana ucyatē ॥ 118 ॥

kutumbavr̥ddhiṁ dhanadhanyavr̥ddhiṁ
striyaśca mukhyaḥ sukhamuttamaṁ ca ।
śr̥tva śubhaṁ kavyamidaṁ maharthaṁ
prapnōti sarvaṁ bhuvi carthasiddhim ॥ 119 ॥

ayusyamarōgyakaraṁ yaśasyaṁ
saubhratr̥kaṁ buddhikaraṁ sukhaṁ ca ।
śrōtavyamētanniyamēna sadbhi-
-rakhyanamōjaskaramr̥ddhikamaiḥ ॥ 120 ॥

ēvamētatpuravr̥ttamakhyanaṁ bhadramastu vaḥ ।
pravyaharata visrabdhaṁ balaṁ visnōḥ pravardhatam ॥ 121 ॥

dēvaśca sarvē tusyanti grahanacchravanattatha ।
ramayanasya śravanattusyanti pitarastatha ॥ 122 ॥

bhaktya ramasya yē cēmaṁ saṁhitamr̥sina kr̥tam ।
lēkhayantīha ca narastēsaṁ vasastrivistapē ॥ 123 ॥

ityarsē śrīmadramayanē valmīkīyē adikavyē caturviṁśatisahasrikayaṁ saṁhitayaṁ yuddhakandē śrīramapat-tabhisēkō nama ēkatriṁśaduttaraśatatamaḥ sargaḥ ॥ 124 ॥

శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః ।
బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్ ॥ ౧ ॥

అర్థము: శిరస్సుపైన తన చేతులతో అంజలి ఘటించి, కైకేయీ ఆనంద వర్ధనుడైన భరతుడు, తన పెద్ద అన్నగారు, సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను.

పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ ।
తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ ॥ ౨ ॥

అర్థము: “పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇస్తున్నాను.”

ధురమేకాకినా న్యస్తామృషభేణ బలీయసా ।
కిశోరవద్గురుం భారం న వోఢుమహముత్సహే ॥ ౩ ॥

అర్థము: బలమైన ఎద్దువలె మోయదగిన ఈ బరువును (రాజ్యభారము) లేగదూడ వలె ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను.

వారివేగేన మహతా భిన్నః సేతురివ క్షరన్ ।
దుర్బంధనమిదం మన్యే రాజ్యచ్ఛిద్రమసంవృతమ్ ॥ ౪ ॥

అర్థము: నదీవేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలె, ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది.

గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేవ చ వాయసః ।
నాన్వేతుముత్సహే రామ తవ మార్గమరిందమ ॥ ౫ ॥

అర్థము: గుర్రములయొక్క గతిని ఒక గాడిద, హంసలయొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా, నేను మీ మార్గమును అందుకొనలేక పోవుచున్నాను, ఓ శత్రునాశకా !

యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే ।
మహాంశ్చ సుదురారోహో మహాస్కంధః ప్రశాఖవాన్ ॥ ౬ ॥

అర్థము: యెటులైతే ఇంటి పెరటిలో నాటి, పెంచబడిన వృక్షము పెద్దదై, భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడక..

శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ ।
తస్య నానుభవేదర్థం యస్య హేతోః స రోప్యతే ॥ ౭ ॥

అర్థము: పుష్పములు కలిగన తరువాత, ఫలములు కలుగక ఎండిపోవునో, అటువంటి చెట్టు, నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు …

ఏషోపమా మహాబాహో త్వదర్థం వేత్తుమర్హసి ।
యద్యస్మాన్మనుజేంద్ర త్వం భక్తాన్భృత్యాన్న శాధి హి ॥ ౮ ॥

అర్థము: .ఈ ఉపమానము, (గొప్ప భుజములు కల) ఓ మహాబాహో ! మీ దాసులగు మమ్ములను రాజువలె పరిపాలింపని మీకు అర్థము కాగలదు.

జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః ।
ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసమ్ ॥ ౯ ॥

అర్థము: జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే, అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను.

తూర్యసంఘాతనిర్ఘోషైః కాంచీనూపురనిస్వనైః ।
మధురైర్గీతశబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ ॥ ౧౦ ॥

అర్థము: సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుము.

యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా ।
తావత్త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ ॥ ౧౧ ॥

అర్థము: “ఎప్పటివరకు జ్యోతిశ్చక్రము (ఖగోళము) ఉండునో, ఎప్పటివరకు వసుంధర (భూమి) ఉండునో, అప్పటివరకు ఈ లోకమున మీ స్వామిత్వమును (పరిపాలనను) మేము అనుసరించెదము.”

భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః ।
తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే ॥ ౧౨ ॥

అర్థము: భరతుని వచనములు విన్న పరపురంజయుడైన (పరుల పురమును జయించిన) రాముడు, అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను.

తతః శత్రుఘ్నవచనాన్నిపుణాః శ్మశ్రువర్ధకాః ।
సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత ॥ ౧౩ ॥

అర్థము: తరువాత, శత్రుఘ్నుని సూచనమేరకు, నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు, రాఘవుని వద్దకు వచ్చిరి.

పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే ।
సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే ॥ ౧౪ ॥

అర్థము: ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు, స్నానము చేసెను.

విశోధితజటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః ।
మహార్హవసనో రామస్తస్థౌ తత్ర శ్రియా జ్వలన్ ॥ ౧౫ ॥

అర్థము: చిక్కులువిడదీయబడిన జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను.

ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ ।
లక్ష్మణస్య చ లక్ష్మీవానిక్ష్వాకుకులవర్ధనః ॥ ౧౬ ॥

అర్థము: రామునియొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశ వర్ధనుడు (శతృఘ్నుడు) లక్ష్మణునికి కూడా చేయసాగెను.

ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః ।
ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరమ్ ॥ ౧౭ ॥

అర్థము: సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు (దశరథ భార్యలు) తమకు తాము చేసుకొనినట్లు మనోహరముగా చేసిరి.

తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనమ్ ।
చకార యత్నాత్కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా ॥ ౧౮ ॥

అర్థము: తరువాత వానరపత్నులందరకును, పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌసల్య ఉత్సాముగా అలంకారము చేసెను.

తతః శత్రుఘ్నవచనాత్సుమంత్రో నామ సారథిః ।
యోజయిత్వాఽభిచక్రామ రథం సర్వాంగశోభనమ్ ॥ ౧౯ ॥

అర్థము: తరువాత, శత్రుఘ్నుని ఆదేశముమేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను.

అర్కమండలసంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమమ్ ।
ఆరురోహ మహాబాహూ రామః సత్యపరాక్రమః ॥ ౨౦ ॥

అర్థము: సూర్యమండలము వంటి శోభకలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు, సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను.

సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్రసదృశద్యుతీ ।
స్నాతౌ దివ్యనిభైర్వస్త్రైర్జగ్మతుః శుభకుండలౌ ॥ ౨౧ ॥

అర్థము: సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి.

వరాభరణసంపన్నా యయుస్తాః శుభకుండలాః ।
సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః ॥ ౨౨ ॥

అర్థము: గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీతా, నగరము చూచుటకు ఉత్సాహముగా యుండిరి.

అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య యే ।
పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్థవత్ ॥ ౨౩ ॥

అర్థము: అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు, పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి.

అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః ।
మంత్రయన్రామవృద్ధ్యర్థమృద్ధ్యర్థం నగరస్య చ ॥ ౨౪ ॥

అర్థము: అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి, రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి.

సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః ।
కర్తుమర్హథ రామస్య యద్యన్మంగళపూర్వకమ్ ॥ ౨౫ ॥

అర్థము: “మహాత్ముడైన రాముని పట్టభిషేకము కొరకు విజయసూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి.”

ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్య తు పురోహితమ్ ।
నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శనబుద్ధయః ॥ ౨౬ ॥

అర్థము: అని ఆ మంత్రులకు, అందరు పురోహితులకు తగు సూచనలు చేసి, శ్రీరామ దర్శనముకొరకు నగరము నుండి బయలుదేరిరి.

హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానఘః ।
ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమమ్ ॥ ౨౭ ॥

అర్థము: పచ్చటి గుర్రములకు కట్టబడియున్న ఉత్తమైన రథమునందు, వేయికనుల వానివలె (ఇంద్రుడు) కళంకరహితుడగు రాముడు స్వారీ చేయసాగెను.

జగ్రాహ భరతో రశ్మీఞ్శత్రుఘ్నశ్ఛత్రమాదదే ।
లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవీజయత్ ॥ ౨౮ ॥

అర్థము: భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును (గొడుగు) పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును (విసినకర్ర) పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను.

శ్వేతం చ వాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః ।
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః ॥ ౨౯ ॥

అర్థము: తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) ముందువైపున, చంద్రప్రభ కలిగిన రాక్షసరాజగు విభీషణుడు పట్టుకొనెను.

ఋషిసంఘైస్తదాఽఽకాశే దేవైశ్చ సమరుద్గణైః ।
స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః ॥ ౩౦ ॥

అర్థము: అప్పుడు ఆకాశమునందు ఋషిసమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి.

తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమమ్ ।
ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః ॥ ౩౧ ॥

అర్థము: అప్పుడు, శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుడు, వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను.

నవనాగసహస్రాణి యయురాస్థాయ వానరాః ।
మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః ॥ ౩౨ ॥

అర్థము: తొమ్మిది వేల ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్యరూపమున సర్వాభరణములతో అగుపించిరి.

శంఖశబ్దప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్స్వనైః ।
ప్రయయౌ పురుషవ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీమ్ ॥ ౩౩ ॥
అర్థము: శంఖము యొక్క శబ్దము మరియు దుందుభీ (ఢంకా) యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా, పురుషవ్యాఘ్రము (పురుషులలో పులివంటివాడు) భవనముల మాలలు కలిగిన (అయోధ్య) పురమునందు వెడలసాగెను.

దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరమ్ ।
విరాజమానం వపుషా రథేనాతిరథం తదా ॥ ౩౪ ॥

అర్థము: ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో, అతిరథుని (గొప్ప యోధుని) వలె కనిపించెను.

తే వర్ధయిత్వా కాకుత్స్థం రామేణ ప్రతినందితాః ।
అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ ॥ ౩౫ ॥

అర్థము: తనకు జేజేలు పలుకు వారిని కాకుత్స్థుడు (రాముడు) తిరిగి పలకరింపగా, వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి.

అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః ।
శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చంద్రమాః ॥ ౩౬ ॥

అర్థము: మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడగు రాముడు, నక్షత్రముల మధ్య చంద్రునివలె శోభించెను.

స పురోగామిభిస్తూర్యైస్తాలస్వస్తికపాణిభిః ।
ప్రవ్యాహరద్భిర్ముదితైర్మంగళాని యయౌ వృతః ॥ ౩౭ ॥

అర్థము: ముందువైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్యపరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము, మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను.

అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తథా ద్విజాః ।
నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః ॥ ౩౮ ॥

అర్థము: బంగారువర్ణము గల అక్షతలతో (బియ్యపుగింజలు), గోవులతో, కన్యలతో, ద్విజులతో (బ్రాహ్మణులు) వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపిపదార్థములు పట్టుకుని రాముని ముందువైపు వెళ్ళసాగారు.

సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే ।
వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలమ్ ।
విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణామ్ ॥ ౩౯ ॥

అర్థము: రాముడు, సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని (హనుమంతుని) బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణుతో జరిగిన సమావేశమును, మంత్రులకు వర్ణించసాగెను.

శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః ॥ ౪౦ ॥

అర్థము: ఇది వినిన అయోధ్యా పురవాసులు విస్మయము (ఆశ్చర్యము) చెందిరి.

ద్యుతిమానేతదాఖ్యాయ రామో వానరసంవృతః ।
హృష్టపుష్టజనాకీర్ణామయోధ్యాం ప్రవివేశ హ ॥ ౪౧ ॥

అర్థము: ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ, వానరములతో కలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను.

తతో హ్యభ్యుచ్ఛ్రయన్పౌరాః పతాకాస్తే గృహే గృహే ॥ ౪౨ ॥

అర్థము: తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి.

ఐక్ష్వాకాధ్యుషితం రమ్యమాససాద పితుర్గృహమ్ ॥ ౪౩ ॥

అర్థము: రమ్యము, ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రిగృహమునకు (రాముడు) చేరెను.

అథాబ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరమ్ ।
అర్థోపహితయా వాచా మధురం రఘునందనః ॥ ౪౪ ॥

అర్థము: తరువాత ఆ రాజపుత్రుడగు రఘునందనుడు (రాముడు), ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలకసాగెను.

పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః ।
కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ ॥ ౪౫ ॥

అర్థము: పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు, కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయీ లకు నమస్కరించెను. (తరువాత ఇటుల చెప్పసాగెను).

యచ్చ మద్భవనం శ్రేష్ఠం సాశోకవనికం మహత్ ।
ముక్తావైడూర్యసంకీర్ణం సుగ్రీవాయ నివేదయ ॥ ౪౬ ॥

అర్థము: “(భరతా!) నా ఈ భవనము శ్రేష్ఠమైనది, అశోకవనములతో కూడియున్నది, ముత్యములు మరియు వైడూర్యములతో పొదగబడియున్నది. దీనిని సుగ్రీవునకు ఇవ్వుము” అనెను.

తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః ।
పాణౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయమ్ ॥ ౪౭ ॥

అర్థము: ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకువచ్చెను.

తతస్తైలప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ ।
గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః ॥ ౪౮ ॥

అర్థము: అప్పుడు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు (సహాయకులు) గృహములోకి వచ్చిరి.

ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః ।
అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో ॥ ౪౯ ॥

అర్థము: మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడు (భరతుడు) సుగ్రీవునితో “రాముని అభిషేకముకొరకు దూతలను పురమాయింపుము” అని అడిగెను.

సౌవర్ణాన్వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ ।
దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్నవిభూషితాన్ ॥ ౫౦ ॥

అర్థము: సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. (తరువాత ఇట్లు పలికెను.)

యథా ప్రత్యూషసమయే చతుర్ణాం సాగరాంభసామ్ ।
పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః ॥ ౫౧ ॥

అర్థము: “రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి, నా ఆజ్ఞకోసము వేచియుండండి” అని పలికెను.

ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః ।
ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః ॥ ౫౨ ॥

అర్థము: మహాత్ముడగు వానరశ్రేష్ఠుడు ఇటుల చెప్పగనే, వారు గరుడునివలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి.

జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరః ।
ఋషభశ్చైవ కలశాఞ్జలపూర్ణానథానయన్ ॥ ౫౩ ॥

అర్థము: అటు తరువాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శీ మరియు ఋషభుడు అను వానరులు, నీరునింపబడిన కలశములతో వచ్చిరి.

నదీశతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ ॥ ౫౪ ॥

అర్థము: అయిదువందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి.

పూర్వాత్సముద్రాత్కలశం జలపూర్ణమథానయత్ ।
సుషేణః సత్త్వసంపన్నః సర్వరత్నవిభూషితమ్ ॥ ౫౫ ॥

అర్థము: తూర్పుసముద్రము యొక్క నీటిచే నింపబడిన, రత్నమయమైన కలశమును సత్త్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను.

ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమాహరత్ ।
రక్తచందనశాఖాభిః సంవృతం కాంచనం ఘటమ్ ॥ ౫౬ ॥

అర్థము: ఋషభుడు త్వరగా దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను.

గవయః పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ ।
రత్నకుంభేన మహతా శీతం మారుతవిక్రమః ॥ ౫౭ ॥

అర్థము: గవయుడు పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము (కలశము) లో వాయువేగముగ తెచ్చెను.

ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిలవిక్రమః ।
ఆజహార స ధర్మాత్మా నలః సర్వగుణాన్వితః ॥ ౫౮ ॥

అర్థము: ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా, గరుడ మరియు వాయువిక్రమము గల ధర్మాత్ముడు, సర్వగుణసంపన్నుడు అయిన నలుడు తెచ్చెను.

తతస్తైర్వానరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలమ్ ।
అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ ।
పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయత్ ॥ ౫౯ ॥

అర్థము: అలా వానరశ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుడు తన మంత్రులతో కలసి, పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను.

తతః స ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ ।
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ ॥ ౬౦ ॥

అర్థము: అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠులవారు, తోటి బ్రాహ్మణులతో కలసి, రత్నమయ పీఠము పైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను.

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః ।
కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా ॥ ౬౧ ॥

అర్థము: వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు ..

అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా ।
సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ॥ ౬౨ ॥

అర్థము: నరవ్యాఘ్రమును (నరులలో పులివంటి రాముడికి) సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో, అష్టవసువులు సహస్రాక్షునికి (ఇంద్రునికి) చేసినట్లు, అభిషేకము చేసిరి.

ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా ।
యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః ॥ ౬౩ ॥

అర్థము: ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో, తరువాత కన్యలతో, మంత్రులతో, యోధులతో, ఆనందముగా యున్న పట్టణవాసులతో అభిషేకము చేయించితిరి.

సర్వౌషధిరసైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితైః ।
చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః ॥ ౬౪ ॥

అర్థము: సర్వ ఔషధరసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి.

బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్ ।
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్ ॥ ౬౫ ॥

అర్థము: బ్రహ్మచే (సృష్టికి) పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. దీనితో చాలా కాలము క్రితము మను కు పట్టాభిషేకము చేయుటవలన తేజస్సుచే దీప్తమైనది.

తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః ।
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః ।
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః ॥ ౬౬ ॥

అర్థము: ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు (పరంపరకు) దీనిచే పట్టాభిషేకము చేయబడినది. (ఇప్పుడు) సభయందు బంగారువర్ణపు శోభతో, మహాధనవంతమగునది, వివిధరత్నములచేత చిత్రముగా మంచిశోభను కలిగియున్నది.

నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి ।
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా ।
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః ॥ ౬౭ ॥

అర్థము: నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వసిష్ఠులవారు (తన) తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి.

ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభమ్ ।
శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః ।
అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః ॥ ౬౮ ॥

అర్థము: శుభకరమైన ధవళ ఛత్రమును (గొడుగు) శత్రుఘ్నుడు పట్టుకొనెను. తెలుపు రంగు వాలవ్యజనమును (చామరమును) వానరేశ్వరుడగు సుగ్రీవుడు పట్టుకొనెను. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుడు గొనెను.

మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్ ।
రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః ॥ ౬౯ ॥

అర్థము: నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుడు, వాసవుని (ఇంద్రుని) ప్రోత్సాహముతో ఇచ్చెను.

సర్వరత్నసమాయుక్తం మణిరత్నవిభూషితమ్ ।
ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్రప్రచోదితః ॥ ౭౦ ॥

అర్థము: సర్వరత్నములతో పొదగబడి, మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యములహారమును, ఆ రాజునకు, శక్రుని (ఇంద్రుని) ఆదేశము మేర (వాయుదేవుడు) ఇచ్చినాడు.

ప్రజగుర్దేవగంధర్వా ననృతుశ్చాప్సరోగణాః ।
అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః ॥ ౭౧ ॥

అర్థము: లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను.

భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః ।
గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే ॥ ౭౨ ॥

అర్థము: భూమి సస్యశ్యామలముగా, ఫలములుతో చెట్లు, మంచి సువాసనలతో పుష్పములు, రాఘవ ఉత్సవములో నిండినవి.

సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా ।
దదౌ శతం వృషాన్పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః ॥ ౭౩ ॥

అర్థము: నూరు సహస్రములగా అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు (రాముడు) ఇచ్చెను.

త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః ।
నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవః ॥ ౭౪ ॥

అర్థము: మూడువందలకోట్ల బంగారునాణెములు, నానావిధములైన, విలువైన, ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను.

అర్కరశ్మిప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహామ్ ।
సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజర్షభః ॥ ౭౫ ॥

అర్థము: సూర్యరశ్మివంటి ప్రభతో, బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు (రాముడు) ఇచ్చెను.

వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్నవిభూషితే ।
వాలిపుత్రాయ ధృతిమానంగదాయాంగదే దదౌ ॥ ౭౬ ॥

అర్థము: వైడూర్యమణితో చిత్రితమై, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును (కేయూరమును) వాలిపుత్రుడు, ధృతిమంతుడు అయిన అంగదునకు (రాముడు) ఇచ్చెను.

మణిప్రవరజుష్టం చ ముక్తాహారమనుత్తమమ్ ।
సీతాయై ప్రదదౌ రామశ్చంద్రరశ్మిసమప్రభమ్ ॥ ౭౭ ॥

అర్థము: శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో యున్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను.

అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ ।
అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే ॥ ౭౮ ॥

అర్థము: శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము యైన ఆభరణములను వైదేహీ వాయుసూనునకు (హనుమంతుడు) ఇవ్వజూచెను.

అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందినీ ।
అవైక్షత హరీన్సర్వాన్భర్తారం చ ముహుర్ముహుః ॥ ౭౯ ॥

అర్థము: జనకనందిని (సీత) తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల మరల చూడసాగిరి.

తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్ ।
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని ।
పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సర్వశః ॥ ౮౦ ॥

అర్థము: ఇంగితజ్ఞానము కల రాముడు, జనకాత్మజయగు సీతను చూచి ఇట్లనెను. “ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము.”

దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా ।
హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః ।
చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాఽచలః ॥ ౮౧ ॥

అర్థము: ఆ హారమును అసితేక్షణా (నల్లటి కనులు కలిగిన సీత) వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా, చంద్రకాంతులతో, తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలె అగుపించెను.

తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరన్తపః ।
సర్వాన్కామగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః ॥ ౮౨ ॥

అర్థము: శత్రువులను హింసించునట్టి ద్వివిదునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు (రాముడు) బహుమతులు ఇచ్చెను.

సర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరాః ।
వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః ॥ ౮౩ ॥

అర్థము: సర్వవానరవృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి.

విభీషణోఽథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా ।
సర్వవానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణా ॥ ౮౪ ॥

అర్థము: విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముడికోసం విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని..

యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః ।
ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతమ్ ॥ ౮౫ ॥

అర్థము: వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా, వారు సంతోషమనస్కులై తిరిగి వెడలిరి.

నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః ।
విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ ॥ ౮౬ ॥

అర్థము: వందనము చేయుచూ ఆ మహాత్ములగు వానరోత్తములు, పార్థివేంద్రునచే (రామునిచే) వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలిరి.

సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్ ।
పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీమ్ ॥ ౮౭ ॥

అర్థము: వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి, రామునిచే సత్కరింపబడి కిష్కింధకు వెడలెను.

[* రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజితః – *]
విభీషణోఽపి ధర్మాత్మా సహ తైర్నైరృతర్షభైః ।
లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః ॥ ౮౮ ॥

అర్థము: ధర్మాత్ముడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభీషణుడు, తన కులధనము (రాక్షస రాజ్యము మరియు పరివారము) తీసుకుని లంకకు మరలెను.

స రాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయశాః ।
రాఘవః పరమోదారః శశాస పరయా ముదా ॥ ౮౯ ॥

అర్థము: అఖిల రాజ్యములు శాసించగల, శత్రువులను సంహరించిన, మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో, పరమ ఆనందముతో ..

ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః ॥ ౯౦ ॥

అర్థము: ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను.

ఆతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం
గాం పూర్వరాజాధ్యుషితాం బలేన ।
తుల్యం మయా త్వం పితృభిర్ధృతా యా
తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ ॥ ౯౧ ॥

అర్థము: “ధర్మజ్ఞా (ధర్మము తెలిసినవాడా), నాతో పాటు ఈ భూమిని (రాజ్యమును) పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు, నేను మన పితరుల నుంచి పొందినట్లు, నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకొనుము.

సర్వాత్మనా పర్యనునీయమానో
యదా న సౌమిత్రిరుపైతి యోగమ్ ।
నియుజ్యమానోఽపి చ యౌవరాజ్యే
తతోఽభ్యషించద్భరతం మహాత్మా ॥ ౯౨ ॥

అర్థము: అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి (లక్ష్మణుడు) అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును మహాత్ముడు (రాముడు) భరతునకు చేసెను.

పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ ।
అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్పార్థివర్షభః ॥ ౯౩ ॥

అర్థము: పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు (రాముడు) ఆచరించెను.

రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః ।
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్భూరిదక్షిణాన్ ॥ ౯౪ ॥

అర్థము: రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధయజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతలకోసము సమర్పించెను.

ఆజానులంబబాహుః స మహాస్కంధః ప్రతాపవాన్ ।
లక్ష్మణానుచరో రామః పృథివీమన్వపాలయత్ ॥ ౯౫ ॥

అర్థము: జానువులవరకు ఉన్న పొడవైన మహా భుజములతో, ప్రతాపవంతుడై, లక్ష్మణుని తోడుగా, రాముడు పృథివిని పాలించెను.

రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్ ।
ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృజ్జ్ఞాతిబాంధవః ॥ ౯౬ ॥

అర్థము: ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు, తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలసి చేసెను.

న పర్యదేవన్విధవా న చ వ్యాలకృతం భయమ్ ।
న వ్యాధిజం భయం వాఽపి రామే రాజ్యం ప్రశాసతి ॥ ౯౭ ॥

అర్థము: వైధవ్య విషాదము, కౄరమృగముల భయము, వ్యాధి భయములు లేక రామ రాజ్యము కీర్తింపబడెను.

నిర్దస్యురభవల్లోకో నానర్థః కం‍చిదస్పృశత్ ।
న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే ॥ ౯౮ ॥

అర్థము: చోరత్వము లోకమునందు లేదు. జనుల యందు వ్యర్థభావము లేకుండె. వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయకుండిరి.

సర్వం ముదితమేవాసీత్సర్వో ధర్మపరోఽభవత్ ।
రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్పరస్పరమ్ ॥ ౯౯ ॥

అర్థము: అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించుకొనక యుండిరి.

ఆసన్వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః ।
నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి ॥ ౧౦౦ ॥

అర్థము: వేల వర్షముల (ఆయుర్దాయము) తో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకములేక రామునిచే రాజ్యము పాలింపబడెను.

రామో రామో రామ ఇతి ప్రజానామభవన్కథాః ।
రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి ॥ ౧౦౧ ॥

అర్థము: రామ, రామ, రామ అని రాముని గురించి, రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను.

నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్కంధవిస్తృతాః ।
కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః ॥ ౧౦౨ ॥

అర్థము: నిత్యము పుష్పములు, ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము (గాలి) సుఖస్పర్శతో వీచెను.

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభవివర్జితాః ।
స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ॥ ౧౦౩ ॥

అర్థము: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక, తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి.

ఆసన్ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః ।
సర్వే లక్షణసంపన్నాః సర్వే ధర్మపరాయణాః ॥ ౧౦౪ ॥

అర్థము: ప్రజలు ధర్మపరులై, అనృతములు (కఠినమైన మాటలు) అనక రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి.

దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ।
భ్రాతృభిః సహితః శ్రీమాన్రామో రాజ్యమకారయత్ ॥ ౧౦౫ ॥

అర్థము: పదివేల పదివందల వర్షములు, తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను.

ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్ ।
ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతమ్ ।
యః పఠేచ్ఛృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే ॥ ౧౦౬ ॥

పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ ।
లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనమ్ ॥ ౧౦౭ ॥

మహీం విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి ।
రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ ॥ ౧౦౮ ॥

భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః ।
భవిష్యంతి సదానందాః పుత్రపౌత్రసమన్వితాః ॥ ౧౦౯ ॥

శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విన్దతి ।
రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః ॥ ౧౧౦ ॥

శృణోతి య ఇదం కావ్యమార్షం వాల్మీకినా కృతమ్ ।
శ్రద్దధానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ ॥ ౧౧౧ ॥

సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ।
ప్రార్థితాంశ్చ వరాన్సర్వాన్ప్రాప్నుయాదిహ రాఘవాత్ ॥ ౧౧౨ ॥

శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సం‍ప్రశృణ్వతామ్ ।
వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై ॥ ౧౧౩ ॥

విజయేతి మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్వ్రజేత్ ।
స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ ॥ ౧౧౪ ॥

పూజయంశ్చ పఠంశ్చేమమితిహాసం పురాతనమ్ ।
సర్వపాపాత్ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ॥ ౧౧౫ ॥

ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ।
ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః ॥ ౧౧౬ ॥

రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ।
ప్రీయతే సతతం రామః స హి విష్ణుః సనాతనః ॥ ౧౧౭ ॥

ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః ।
సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే ॥ ౧౧౮ ॥

కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం
స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ ।
శృత్వా శుభం కావ్యమిదం మహార్థం
ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిమ్ ॥ ౧౧౯ ॥

ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ ।
శ్రోతవ్యమేతన్నియమేన సద్భి-
-రాఖ్యానమోజస్కరమృద్ధికామైః ॥ ౧౨౦ ॥

ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ।
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతామ్ ॥ ౧౨౧ ॥

దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాచ్ఛ్రవణాత్తథా ।
రామాయణస్య శ్రవణాత్తుష్యంతి పితరస్తథా ॥ ౧౨౨ ॥

భక్త్యా రామస్య యే చేమాం సంహితామృషిణా కృతామ్ ।
లేఖయంతీహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే ॥ ౧౨౩ ॥

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే చతుర్వింశతిసహస్రికాయాం సంహితాయాం యుద్ధకాండే శ్రీరామపట్టాభిషేకో నామ ఏకత్రింశదుత్తరశతతమః సర్గః ॥ ౧౨౪ ॥

शिरस्यञ्जलिमाधाय कैकेय्यानन्दवर्धनः ।
बभाषे भरतो ज्येष्ठं रामं सत्यपराक्रमम् ॥ १ ॥

पूजिता मामिका माता दत्तं राज्यमिदं मम ।
तद्ददामि पुनस्तुभ्यं यथा त्वमददा मम ॥ २ ॥

धुरमेकाकिना न्यस्तामृषभेण बलीयसा ।
किशोरवद्गुरुं भारं न वोढुमहमुत्सहे ॥ ३ ॥

वारिवेगेन महता भिन्नः सेतुरिव क्षरन् ।
दुर्बन्धनमिदं मन्ये राज्यच्छिद्रमसंवृतम् ॥ ४ ॥

गतिं खर इवाश्वस्य हंसस्येव च वायसः ।
नान्वेतुमुत्सहे राम तव मार्गमरिन्दम ॥ ५ ॥

यथा चारोपितो वृक्षो जातश्चान्तर्निवेशने ।
महांश्च सुदुरारोहो महास्कन्धः प्रशाखवान् ॥ ६ ॥

शीर्येत पुष्पितो भूत्वा न फलानि प्रदर्शयन् ।
तस्य नानुभवेदर्थं यस्य हेतोः स रोप्यते ॥ ७ ॥

एषोपमा महाबाहो त्वदर्थं वेत्तुमर्हसि ।
यद्यस्मान्मनुजेन्द्र त्वं भक्तान्भृत्यान्न शाधि हि ॥ ८ ॥

जगदद्याभिषिक्तं त्वामनुपश्यतु सर्वतः ।
प्रतपन्तमिवादित्यं मध्याह्ने दीप्ततेजसम् ॥ ९ ॥

तूर्यसङ्घातनिर्घोषैः काञ्चीनूपुरनिस्वनैः ।
मधुरैर्गीतशब्दैश्च प्रतिबुध्यस्व राघव ॥ १० ॥

यावदावर्तते चक्रं यावती च वसुन्धरा ।
तावत्त्वमिह सर्वस्य स्वामित्वमनुवर्तय ॥ ११ ॥

भरतस्य वचः श्रुत्वा रामः परपुरञ्जयः ।
तथेति प्रतिजग्राह निषसादासने शुभे ॥ १२ ॥

ततः शत्रुघ्नवचनान्निपुणाः श्मश्रुवर्धकाः ।
सुखहस्ताः सुशीघ्राश्च राघवं पर्युपासत ॥ १३ ॥

पूर्वं तु भरते स्नाते लक्ष्मणे च महाबले ।
सुग्रीवे वानरेन्द्रे च राक्षसेन्द्रे विभीषणे ॥ १४ ॥

विशोधितजटः स्नातश्चित्रमाल्यानुलेपनः ।
महार्हवसनो रामस्तस्थौ तत्र श्रिया ज्वलन् ॥ १५ ॥

प्रतिकर्म च रामस्य कारयामास वीर्यवान् ।
लक्ष्मणस्य च लक्ष्मीवानिक्ष्वाकुकुलवर्धनः ॥ १६ ॥

प्रतिकर्म च सीतायाः सर्वा दशरथस्त्रियः ।
आत्मनैव तदा चक्रुर्मनस्विन्यो मनोहरम् ॥ १७ ॥

ततो वानरपत्नीनां सर्वासामेव शोभनम् ।
चकार यत्नात्कौसल्या प्रहृष्टा पुत्रलालसा ॥ १८ ॥

ततः शत्रुघ्नवचनात्सुमन्त्रो नाम सारथिः ।
योजयित्वाऽभिचक्राम रथं सर्वाङ्गशोभनम् ॥ १९ ॥

अर्कमण्डलसङ्काशं दिव्यं दृष्ट्वा रथोत्तमम् ।
आरुरोह महाबाहू रामः सत्यपराक्रमः ॥ २० ॥

सुग्रीवो हनुमांश्चैव महेन्द्रसदृशद्युती ।
स्नातौ दिव्यनिभैर्वस्त्रैर्जग्मतुः शुभकुण्डलौ ॥ २१ ॥

वराभरणसम्पन्ना ययुस्ताः शुभकुण्डलाः ।
सुग्रीवपत्न्यः सीता च द्रष्टुं नगरमुत्सुकाः ॥ २२ ॥

अयोध्यायां तु सचिवा राज्ञो दशरथस्य ये ।
पुरोहितं पुरस्कृत्य मन्त्रयामासुरर्थवत् ॥ २३ ॥

अशोको विजयश्चैव सुमन्त्रश्चैव सङ्गताः ।
मन्त्रयन्रामवृद्ध्यर्थमृद्ध्यर्थं नगरस्य च ॥ २४ ॥

सर्वमेवाभिषेकार्थं जयार्हस्य महात्मनः ।
कर्तुमर्हथ रामस्य यद्यन्मङ्गलपूर्वकम् ॥ २५ ॥

इति ते मन्त्रिणः सर्वे सन्दिश्य तु पुरोहितम् ।
नगरान्निर्ययुस्तूर्णं रामदर्शनबुद्धयः ॥ २६ ॥

हरियुक्तं सहस्राक्षो रथमिन्द्र इवानघः ।
प्रययौ रथमास्थाय रामो नगरमुत्तमम् ॥ २७ ॥

जग्राह भरतो रश्मीञ्शत्रुघ्नश्छत्रमाददे ।
लक्ष्मणो व्यजनं तस्य मूर्ध्नि सम्पर्यवीजयत् ॥ २८ ॥

श्वेतं च वालव्यजनं जग्राह पुरतः स्थितः ।
अपरं चन्द्रसङ्काशं राक्षसेन्द्रो विभीषणः ॥ २९ ॥

ऋषिसङ्घैस्तदाऽऽकाशे देवैश्च समरुद्गणैः ।
स्तूयमानस्य रामस्य शुश्रुवे मधुरध्वनिः ॥ ३० ॥

ततः शत्रुञ्जयं नाम कुञ्जरं पर्वतोपमम् ।
आरुरोह महातेजाः सुग्रीवः प्लवगर्षभः ॥ ३१ ॥

नवनागसहस्राणि ययुरास्थाय वानराः ।
मानुषं विग्रहं कृत्वा सर्वाभरणभूषिताः ॥ ३२ ॥

शङ्खशब्दप्रणादैश्च दुन्दुभीनां च निस्स्वनैः ।
प्रययौ पुरुषव्याघ्रस्तां पुरीं हर्म्यमालिनीम् ॥ ३३ ॥

ददृशुस्ते समायान्तं राघवं सपुरस्सरम् ।
विराजमानं वपुषा रथेनातिरथं तदा ॥ ३४ ॥

ते वर्धयित्वा काकुत्स्थं रामेण प्रतिनन्दिताः ।
अनुजग्मुर्महात्मानं भ्रातृभिः परिवारितम् ॥ ३५ ॥

अमात्यैर्ब्राह्मणैश्चैव तथा प्रकृतिभिर्वृतः ।
श्रिया विरुरुचे रामो नक्षत्रैरिव चन्द्रमाः ॥ ३६ ॥

स पुरोगामिभिस्तूर्यैस्तालस्वस्तिकपाणिभिः ।
प्रव्याहरद्भिर्मुदितैर्मङ्गलानि ययौ वृतः ॥ ३७ ॥

अक्षतं जातरूपं च गावः कन्यास्तथा द्विजाः ।
नरा मोदकहस्ताश्च रामस्य पुरतो ययुः ॥ ३८ ॥

सख्यं च रामः सुग्रीवे प्रभावं चानिलात्मजे ।
वानराणां च तत्कर्म राक्षसानां च तद्बलम् ।
विभीषणस्य सम्योगमाचचक्षे च मन्त्रिणाम् ॥ ३९ ॥

श्रुत्वा तु विस्मयं जग्मुरयोध्यापुरवासिनः ॥ ४० ॥

द्युतिमानेतदाख्याय रामो वानरसंवृतः ।
हृष्टपुष्टजनाकीर्णामयोध्यां प्रविवेश ह ॥ ४१ ॥

ततो ह्यभ्युच्छ्रयन्पौराः पताकास्ते गृहे गृहे ॥ ४२ ॥

ऐक्ष्वाकाध्युषितं रम्यमाससाद पितुर्गृहम् ॥ ४३ ॥

अथाब्रवीद्राजसुतो भरतं धर्मिणां वरम् ।
अर्थोपहितया वाचा मधुरं रघुनन्दनः ॥ ४४ ॥

पितुर्भवनमासाद्य प्रविश्य च महात्मनः ।
कौसल्यां च सुमित्रां च कैकेयीमभिवाद्य च ॥ ४५ ॥

यच्च मद्भवनं श्रेष्ठं साशोकवनिकं महत् ।
मुक्तावैडूर्यसङ्कीर्णं सुग्रीवाय निवेदय ॥ ४६ ॥

तस्य तद्वचनं श्रुत्वा भरतः सत्यविक्रमः ।
पाणौ गृहीत्वा सुग्रीवं प्रविवेश तमालयम् ॥ ४७ ॥

ततस्तैलप्रदीपांश्च पर्यङ्कास्तरणानि च ।
गृहीत्वा विविशुः क्षिप्रं शत्रुघ्नेन प्रचोदिताः ॥ ४८ ॥

उवाच च महातेजाः सुग्रीवं राघवानुजः ।
अभिषेकाय रामस्य दूतानाज्ञापय प्रभो ॥ ४९ ॥

सौवर्णान्वानरेन्द्राणां चतुर्णां चतुरो घटान् ।
ददौ क्षिप्रं स सुग्रीवः सर्वरत्नविभूषितान् ॥ ५० ॥

यथा प्रत्यूषसमये चतुर्णां सागराम्भसाम् ।
पूर्णैर्घटैः प्रतीक्षध्वं तथा कुरुत वानराः ॥ ५१ ॥

एवमुक्ता महात्मानो वानरा वारणोपमाः ।
उत्पेतुर्गगनं शीघ्रं गरुडा इव शीघ्रगाः ॥ ५२ ॥

जाम्बवांश्च हनूमांश्च वेगदर्शी च वानराः ।
ऋषभश्चैव कलशाञ्जलपूर्णानथानयन् ॥ ५३ ॥

नदीशतानां पञ्चानां जलं कुम्भेषु चाहरन् ॥ ५४ ॥

पूर्वात्समुद्रात्कलशं जलपूर्णमथानयत् ।
सुषेणः सत्त्वसम्पन्नः सर्वरत्नविभूषितम् ॥ ५५ ॥

ऋषभो दक्षिणात्तूर्णं समुद्राज्जलमाहरत् ।
रक्तचन्दनशाखाभिः संवृतं काञ्चनं घटम् ॥ ५६ ॥

गवयः पश्चिमात्तोयमाजहार महार्णवात् ।
रत्नकुम्भेन महता शीतं मारुतविक्रमः ॥ ५७ ॥

उत्तराच्च जलं शीघ्रं गरुडानिलविक्रमः ।
आजहार स धर्मात्मा नलः सर्वगुणान्वितः ॥ ५८ ॥

ततस्तैर्वानरश्रेष्ठैरानीतं प्रेक्ष्य तज्जलम् ।
अभिषेकाय रामस्य शत्रुघ्नः सचिवैः सह ।
पुरोहिताय श्रेष्ठाय सुहृद्भ्यश्च न्यवेदयत् ॥ ५९ ॥

ततः स प्रयतो वृद्धो वसिष्ठो ब्राह्मणैः सह ।
रामं रत्नमये पीठे सहसीतं न्यवेशयत् ॥ ६० ॥

वसिष्ठो वामदेवश्च जाबालिरथ काश्यपः ।
कात्यायनः सुयज्ञश्च गौतमो विजयस्तथा ॥ ६१ ॥

अभ्यषिञ्चन्नरव्याघ्रं प्रसन्नेन सुगन्धिना ।
सलिलेन सहस्राक्षं वसवो वासवं यथा ॥ ६२ ॥

ऋत्विग्भिर्ब्राह्मणैः पूर्वं कन्याभिर्मन्त्रिभिस्तथा ।
योधैश्चैवाभ्यषिञ्चंस्ते सम्प्रहृष्टाः सनैगमैः ॥ ६३ ॥

सर्वौषधिरसैर्दिव्यैर्दैवतैर्नभसि स्थितैः ।
चतुर्भिर्लोकपालैश्च सर्वैर्देवैश्च सङ्गतैः ॥ ६४ ॥

ब्रह्मणा निर्मितं पूर्वं किरीटं रत्नशोभितम् ।
अभिषिक्तः पुरा येन मनुस्तं दीप्ततेजसम् ॥ ६५ ॥

तस्यान्ववाये राजानः क्रमाद्येनाभिषेचिताः ।
सभायां हेमक्लुप्तायां शोभितायां महाजनैः ।
रत्नैर्नानाविधैश्चैव चित्रितायां सुशोभनैः ॥ ६६ ॥

नानारत्नमये पीठे कल्पयित्वा यथाविधि ।
किरीटेन ततः पश्चाद्वसिष्ठेन महात्मना ।
ऋत्विग्भिर्भूषणैश्चैव समयोक्ष्यत राघवः ॥ ६७ ॥

छत्रं तु तस्य जग्राह शत्रुघ्नः पाण्डुरं शुभम् ।
श्वेतं च वालव्यजनं सुग्रीवो वानरेश्वरः ।
अपरं चन्द्रसङ्काशं राक्षसेन्द्रो विभीषणः ॥ ६८ ॥

मालां ज्वलन्तीं वपुषा काञ्चनीं शतपुष्कराम् ।
राघवाय ददौ वायुर्वासवेन प्रचोदितः ॥ ६९ ॥

सर्वरत्नसमायुक्तं मणिरत्नविभूषितम् ।
मुक्ताहारं नरेन्द्राय ददौ शक्रप्रचोदितः ॥ ७० ॥

प्रजगुर्देवगन्धर्वा ननृतुश्चाप्सरोगणाः ।
अभिषेके तदर्हस्य तदा रामस्य धीमतः ॥ ७१ ॥

भूमिः सस्यवती चैव फलवन्तश्च पादपाः ।
गन्धवन्ति च पुष्पाणि बभूवू राघवोत्सवे ॥ ७२ ॥

सहस्रशतमश्वानां धेनूनां च गवां तथा ।
ददौ शतं वृषान्पूर्वं द्विजेभ्यो मनुजर्षभः ॥ ७३ ॥

त्रिंशत्कोटीर्हिरण्यस्य ब्राह्मणेभ्यो ददौ पुनः ।
नानाभरणवस्त्राणि महार्हाणि च राघवः ॥ ७४ ॥

अर्करश्मिप्रतीकाशां काञ्चनीं मणिविग्रहाम् ।
सुग्रीवाय स्रजं दिव्यां प्रायच्छन्मनुजर्षभः ॥ ७५ ॥

वैडूर्यमणिचित्रे च वज्ररत्नविभूषिते ।
वालिपुत्राय धृतिमानङ्गदायाङ्गदे ददौ ॥ ७६ ॥

मणिप्रवरजुष्टं च मुक्ताहारमनुत्तमम् ।
सीतायै प्रददौ रामश्चन्द्ररश्मिसमप्रभम् ॥ ७७ ॥

अरजे वाससी दिव्ये शुभान्याभरणानि च ।
अवेक्षमाणा वैदेही प्रददौ वायुसूनवे ॥ ७८ ॥

अवमुच्यात्मनः कण्ठाद्धारं जनकनन्दिनी ।
अवैक्षत हरीन्सर्वान्भर्तारं च मुहुर्मुहुः ॥ ७९ ॥

तामिङ्गितज्ञः सम्प्रेक्ष्य बभाषे जनकात्मजाम् ।
प्रदेहि सुभगे हारं यस्य तुष्टासि भामिनि ।
पौरुषं विक्रमो बुद्धिर्यस्मिन्नेतानि सर्वशः ॥ ८० ॥

ददौ सा वायुपुत्राय तं हारमसितेक्षणा ।
हनुमांस्तेन हारेण शुशुभे वानरर्षभः ।
चन्द्रांशुचयगौरेण श्वेताभ्रेण यथाऽचलः ॥ ८१ ॥

ततो द्विविदमैन्दाभ्यां नीलाय च परन्तपः ।
सर्वान्कामगुणान्वीक्ष्य प्रददौ वसुधाधिपः ॥ ८२ ॥

सर्ववानरवृद्धाश्च ये चान्ये वानरेश्वराः ।
वासोभिर्भूषणैश्चैव यथार्हं प्रतिपूजिताः ॥ ८३ ॥

विभीषणोऽथ सुग्रीवो हनुमान् जाम्बवांस्तथा ।
सर्ववानरमुख्याश्च रामेणाक्लिष्टकर्मणा ॥ ८४ ॥

यथार्हं पूजिताः सर्वैः कामै रत्नैश्च पुष्कलैः ।
प्रहृष्टमनसः सर्वे जग्मुरेव यथागतम् ॥ ८५ ॥

नत्वा सर्वे महात्मानं ततस्ते प्लवगर्षभाः ।
विसृष्टाः पार्थिवेन्द्रेण किष्किन्धामभ्युपागमन् ॥ ८६ ॥

सुग्रीवो वानरश्रेष्ठो दृष्ट्वा रामाभिषेचनम् ।
पूजितश्चैव रामेण किष्किन्धां प्राविशत्पुरीम् ॥ ८७ ॥

[* रामेण सर्वकामैश्च यथार्हं प्रतिपूजितः । *]
विभीषणोऽपि धर्मात्मा सह तैर्नैरृतर्षभैः ।
लब्ध्वा कुलधनं राजा लङ्कां प्रायाद्विभीषणः ॥ ८८ ॥

स राज्यमखिलं शासन्निहतारिर्महायशाः ।
राघवः परमोदारः शशास परया मुदा ॥ ८९ ॥

उवाच लक्ष्मणं रामो धर्मज्ञं धर्मवत्सलः ॥ ९० ॥

आतिष्ठ धर्मज्ञ मया सहेमां
गां पूर्वराजाध्युषितां बलेन ।
तुल्यं मया त्वं पितृभिर्धृता या
तां यौवराज्ये धुरमुद्वहस्व ॥ ९१ ॥

सर्वात्मना पर्यनुनीयमानो
यदा न सौमित्रिरुपैति योगम् ।
नियुज्यमानोऽपि च यौवराज्ये
ततोऽभ्यषिञ्चद्भरतं महात्मा ॥ ९२ ॥

पौण्डरीकाश्वमेधाभ्यां वाजपेयेन चासकृत् ।
अन्यैश्च विविधैर्यज्ञैरयजत्पार्थिवर्षभः ॥ ९३ ॥

राज्यं दशसहस्राणि प्राप्य वर्षाणि राघवः ।
शताश्वमेधानाजह्रे सदश्वान्भूरिदक्षिणान् ॥ ९४ ॥

आजानुलम्बबाहुः स महास्कन्धः प्रतापवान् ।
लक्ष्मणानुचरो रामः पृथिवीमन्वपालयत् ॥ ९५ ॥

राघवश्चापि धर्मात्मा प्राप्य राज्यमनुत्तमम् ।
ईजे बहुविधैर्यज्ञैः ससुहृज्ज्ञातिबान्धवः ॥ ९६ ॥

न पर्यदेवन्विधवा न च व्यालकृतं भयम् ।
न व्याधिजं भयं वाऽपि रामे राज्यं प्रशासति ॥ ९७ ॥

निर्दस्युरभवल्लोको नानर्थः कं‍चिदस्पृशत् ।
न च स्म वृद्धा बालानां प्रेतकार्याणि कुर्वते ॥ ९८ ॥

सर्वं मुदितमेवासीत्सर्वो धर्मपरोऽभवत् ।
राममेवानुपश्यन्तो नाभ्यहिंसन्परस्परम् ॥ ९९ ॥

आसन्वर्षसहस्राणि तथा पुत्रसहस्रिणः ।
निरामया विशोकाश्च रामे राज्यं प्रशासति ॥ १०० ॥

रामो रामो राम इति प्रजानामभवन्कथाः ।
रामभूतं जगदभूद्रामे राज्यं प्रशासति ॥ १०१ ॥

नित्यपुष्पा नित्यफलास्तरवः स्कन्धविस्तृताः ।
काले वर्षी च पर्जन्यः सुखस्पर्शश्च मारुतः ॥ १०२ ॥

ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा लोभविवर्जिताः ।
स्वकर्मसु प्रवर्तन्ते तुष्टाः स्वैरेव कर्मभिः ॥ १०३ ॥

आसन्प्रजा धर्मरता रामे शासति नानृताः ।
सर्वे लक्षणसम्पन्नाः सर्वे धर्मपरायणाः ॥ १०४ ॥

दश वर्षसहस्राणि दश वर्षशतानि च ।
भ्रातृभिः सहितः श्रीमान्रामो राज्यमकारयत् ॥ १०५ ॥

धन्यं यशस्यमायुष्यं राज्ञां च विजयावहम् ।
आदिकाव्यमिदं त्वार्षं पुरा वाल्मीकिना कृतम् ।
यः पठेच्छृणुयाल्लोके नरः पापाद्विमुच्यते ॥ १०६ ॥

पुत्रकामस्तु पुत्रान्वै धनकामो धनानि च ।
लभते मनुजो लोके श्रुत्वा रामाभिषेचनम् ॥ १०७ ॥

महीं विजयते राजा रिपूंश्चाप्यधितिष्ठति ।
राघवेण यथा माता सुमित्रा लक्ष्मणेन च ॥ १०८ ॥

भरतेनेव कैकेयी जीवपुत्रास्तथा स्त्रियः ।
भविष्यन्ति सदानन्दाः पुत्रपौत्रसमन्विताः ॥ १०९ ॥

श्रुत्वा रामायणमिदं दीर्घमायुश्च विन्दति ।
रामस्य विजयं चैव सर्वमक्लिष्टकर्मणः ॥ ११० ॥

शृणोति य इदं काव्यमार्षं वाल्मीकिना कृतम् ।
श्रद्दधानो जितक्रोधो दुर्गाण्यतितरत्यसौ ॥ १११ ॥

समागमं प्रवासान्ते लभते चापि बान्धवैः ।
प्रार्थितांश्च वरान्सर्वान्प्राप्नुयादिह राघवात् ॥ ११२ ॥

श्रवणेन सुराः सर्वे प्रीयन्ते सं‍प्रशृण्वताम् ।
विनायकाश्च शाम्यन्ति गृहे तिष्ठन्ति यस्य वै ॥ ११३ ॥

विजयेति महीं राजा प्रवासी स्वस्तिमान्व्रजेत् ।
स्त्रियो रजस्वलाः श्रुत्वा पुत्रान् सूयुरनुत्तमान् ॥ ११४ ॥

पूजयंश्च पठंश्चेममितिहासं पुरातनम् ।
सर्वपापात्प्रमुच्येत दीर्घमायुरवाप्नुयात् ॥ ११५ ॥

प्रणम्य शिरसा नित्यं श्रोतव्यं क्षत्रियैर्द्विजात् ।
ऐश्वर्यं पुत्रलाभश्च भविष्यति न संशयः ॥ ११६ ॥

रामायणमिदं कृत्स्नं शृण्वतः पठतः सदा ।
प्रीयते सततं रामः स हि विष्णुः सनातनः ॥ ११७ ॥

आदिदेवो महाबाहुर्हरिर्नारायणः प्रभुः ।
साक्षाद्रामो रघुश्रेष्ठः शेषो लक्ष्मण उच्यते ॥ ११८ ॥

कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं
स्त्रियश्च मुख्याः सुखमुत्तमं च ।
शृत्वा शुभं काव्यमिदं महार्थं
प्राप्नोति सर्वां भुवि चार्थसिद्धिम् ॥ ११९ ॥

आयुष्यमारोग्यकरं यशस्यं
सौभ्रातृकं बुद्धिकरं सुखं च ।
श्रोतव्यमेतन्नियमेन सद्भि-
-राख्यानमोजस्करमृद्धिकामैः ॥ १२० ॥

एवमेतत्पुरावृत्तमाख्यानं भद्रमस्तु वः ।
प्रव्याहरत विस्रब्धं बलं विष्णोः प्रवर्धताम् ॥ १२१ ॥

देवाश्च सर्वे तुष्यन्ति ग्रहणाच्छ्रवणात्तथा ।
रामायणस्य श्रवणात्तुष्यन्ति पितरस्तथा ॥ १२२ ॥

भक्त्या रामस्य ये चेमां संहितामृषिणा कृताम् ।
लेखयन्तीह च नरास्तेषां वासस्त्रिविष्टपे ॥ १२३ ॥

इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये आदिकाव्ये चतुर्विंशतिसहस्रिकायां संहितायां युद्धकाण्डे श्रीरामपट्‍टाभिषेको नाम एकत्रिंशदुत्तरशततमः सर्गः ॥ १२४ ॥