Shakteyam-శాక్తేయం-Devi Stotras Mantras

Shakteyam (శాక్తేయం) is the spiritual tradition centered on the worship of Goddess Shakti, the Divine Mother, in her many forms such as Durga, Lakshmi, Saraswati, Kali, Lalitha Tripura Sundari, Rajarajeshwari, and others. The devotees and followers of this tradition are known as Shakteyas.
Over the centuries, Shakteyam gave rise to various schools of worship, including the Tantric tradition, which emphasized the divine feminine as the supreme cosmic power. Tantric practitioners developed unique methods of spiritual practice, meditation, mantra sadhana, yantra worship, and ritualistic worship aimed at attaining spiritual realization and divine grace.
Shakta literature places great importance on mantras, sacred sounds, and divine names, believing that their proper recitation can bestow spiritual growth, inner transformation, protection, wisdom, and blessings. This rich tradition has produced a vast collection of sacred texts dedicated to Goddess Shakti.
Among the most revered scriptures of the Shakta tradition are the Devi Bhagavatam, Devi Mahatmyam (Durga Saptashati) from the Markandeya Purana, Lalitha Sahasranamam, and Lalitha Trishati from the Brahmanda Purana. These texts continue to inspire millions of devotees through their profound spiritual teachings, hymns, stotras, and mantras dedicated to the Divine Mother.
Shakteyam (శాక్తేయం) represents the worship of Goddess Shakti, the Divine Mother of the Universe. Stotra Veda provides a rich collection of Devi Mantras, Stotras, Sahasranamams, Kavachams, and devotional literature in various languages for devotees seeking spiritual growth, protection, prosperity, and divine blessings.
Here are some mantras and slokas/ Stotras for worship goddess:
శ్లోకాలు:
పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు:
పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి రావడానికి తల్లిదండ్రులు రక్ష పెట్టి చెప్పవలసిన శ్లోకాలు
1.సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరీ !
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ !!
2.యన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే !
వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు మంగళం !!
3.యన్ మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా !
అమృతం ప్రార్ధయా నస్య తత్తే భవతు మంగళం !!
4.అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్ర దరస్యయత్ !
అదితిర్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం !!
5.త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోర్ అమిత తేజసః !
యదాసీన్ మంగళం రామ, తత్తే భవతు మంగళం !!
6.ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా దిశశ్చతే !
మంగళాని మహాబాహో దిశంతు తమ సర్వదా !!
స్త్రీలకు వైవహిక జీవన సౌఖ్యం:
1.హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం !
పురానారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్ !!
2.స్మరోపిత్వాం నత్వా రతి నయన లేహ్యే నవపుషా !
మునీనా మప్యంతః ప్రభ వతిహి మోహయ మహతాం !! రోజుకు 2000 చొప్పున 40 రోజులు
వివాహము జరుగుటకు:
వివాహము కావలసిన అమ్మాయి/అబ్బాయి లేదా వారి తరుపున ఎవరైనా ,ఎవరికి వివాహం కావలెనో సంకల్పం చెప్పుకొని క్రింది మంత్రమును జపించవలెను
రుక్మిణీ వల్లభ మంత్రం:
ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహా (రోజుకు 108 సార్లు)
పురుషులకు వివాహసిద్ధి:
విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలం కృతాం !
మమా భీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః !! 108 సార్లు
లేదా
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తాను సారిణీమ్ !
తారిణీం దుర్గ సంసారసాగరస్య కులోద్భవామ్ !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)
అమ్మాయిలకు వివాహసిద్ధి కొరకు:
కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ !
యోగ్య వరమే దేహి పతిం మే కురుతే నమః !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)
వివాహ సిద్ధి:
1.దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి !
వివాహం భాగ్య మారోగ్యం పుత్ర లాభం చ దేహిమే !! 1108 సార్లు
2.మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వ శ్రీః విశ్వ మంగళమ్ !!
3.షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ జగన్నీ రోగ శోభనమ్ !!
4.జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్ !!
5.పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా !
ఇష్ట కామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్ !! 21 సార్లు
మతిమరుపు సమస్యకు:
మతిమరుపు సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లే విద్యార్ధులు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.
జ్ఞాపక శక్తి వృద్ధి కొరకు:
యా దేవీ సర్వ భూతేషు స్మృతి రూపేణ సంస్థితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.!! రోజూ 108 సార్లు
ఆనందప్రద సంపద:
1.సంపత్తిః సంపదాధారా సర్వ సంపత్ప్రదాయినీ!
నిత్యా నందమయీ నిత్యా సచ్చిదానంద విగ్రహా!!
2.దీనార్తి భీతం భవతాప పీడితం ధనైర్వి హీనంతవ పార్శ్వ మాగతం!
కృపానిధిత్వా న్మమలక్ష్మి సత్వరం ధన ప్రదానాద్ధన నాయకం కురు!! 21సార్లు3.మిళిత వివిధ ముక్తాం దివ్య మాణిక్య యుక్తాం!
జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి!! 21సార్లు
అబార్షన్ నివారణకు:
పుమంసమ్ పత్రం జాన్సితం పుమనను జయతమ్ భవతి !
పుత్రాణామ్ మాత జతనమ్ జామ్యశ్యం యాన్ !!
(చెంబులో నీటిని పెట్టుకొని ఈ మంత్రమును చదివి, ఆ నీటిని చల్లుకొని, మిగిలినవి త్రాగవలెను)
గర్భ రక్షా శ్లోకం:
హే శంకర శమర హర ప్రమదాధి నాధారి !
మన్నాధ సాంబ శశి సూడ!!
హరతిరి సూలిన్ శంభో సుఖ ప్రసవ కిరుద్భవమే దయాళో!
హే మాధవీ వనేశ పాలయమామ్ నమస్తే !!
సుఖ ప్రసవానికి:
అస్తి గోదావరీ తీరే జంభలా నామ దేవతా !
తస్సాః స్మరణ మాత్రేణ విశల్యా గర్భిణీ భవేత్
జంభలాయై నమః !! 1గం.
సత్సంతాన ప్రాప్తి:
1.దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే !
దేహిమే తనయం కృష్ణ త్వా మహం శరణం గతః !!
2.నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః !
పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భ రక్షాం కురుష్వనః !! 1108 సార్లు
పుత్ర సంతానము కొరకు:
(ఈ శ్లోకమును రోజూ 108 సార్లు పఠించవలెను. పాయసమును నైవేద్యముగా నివేదన చేసి పిల్లలకు పంచవలెను.)
కౌసల్యా జనయిత రామమ్, సర్వ లక్షణ సంయుతమ్,
విష్ణో అర్ధం , మహాబాగమ్ పుత్రమ్ ఇక్ష్వాకు వర్ధనమ్!!
ఆరోగ్యము, సౌభాగ్యము లభించుటకు:
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ !
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!
మహిళలలో సంతాన సాఫల్యం కొరకు:
(క్రింది 18 పురాణముల పేర్లను రోజూ ఒక్కసారి, కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు 108 సార్లు పఠించవలెను)
1. బ్రహ్మమ్, పద్మమ్, వైష్ణవ్యంచ, శైవమ్, భాగవతమ్ తథా,
భవిష్యమ్, నారదీయమ్ చ మార్కండేయ అధాపరమ్,
ఆగ్నేయమ్, బ్రహ్మవైవర్తమ్, లింగమ్, వరాహమేవచ,
స్కందంచ, వామనమ్, కూర్మమ్, మత్స్యమ్, గరుడమేవచ,
బ్రహ్మాండంచ పురాణాది పఠతామ్ పుత్రతా నిజ!!
పిల్లల యొక్క బుద్ధి ప్రచోదనానికి:
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తధా
వారాహి చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ
మహాలక్ష్మీ రస్తమీచ ద్విభుజా చోణ విగ్రహాః
భద్రం పక్ష్మలయాంతు బ్రాహ్మీ ముఖ్యాస్చ మాతరోస్మాకం !!
జ్ఞానానంద సిద్ధి:
సర్వజ్ఞానే సదానందే సర్వ రూపే నమో నమః!
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమోనమః!! 21 సార్లు
రచనా శక్తి:
1.అహం దేవో నచా న్యోస్మి బ్రహ్మై వాస్మిన శోకభాక్!
సచ్చిదానంద రూపోహం నిత్యముక్త స్వభావవాన్!!
2.బ్రహ్మానంద సదానంద పరోజ్ఞాన విధాయకః!
తారకా భక్త ఆనంద పూర్ణానందః సదాశివః!!
3.భైరవోహం సుధాఢ్యోహం తత్త్వ జ్ఞోహం కులస్త్రియః!
గురుప్రసాద వానస్మి శక్తి సాధక సేవకః!!
4.రతానందః కులానందః కుమారీ దాస ఏవ చ!
కుమారీ వణి కోహం చ తారా చరణ నాయకః!! 21 సార్లు
జ్యోతిష విద్యాప్రాప్తి:
1.అకారాది క్షకారాంత సర్వ విద్యాధి దేవతా
మంత్ర వాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రై కలోచనా !!
2.ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంధి భేదినీ
కాల చక్రాశ్రయోపేతా కాలచక్ర స్వరూపిణీ !!
3.జ్యోతిర్విద్యా మహామంత్రస్య పరమానంద ఋషిః పక్తిః ఛందః
జ్యోతిర్విద్యా దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః ఈం కీలకం
శ్రీం హ్రీం ఈం ఇతి అంగన్యాస కరన్యాసాః.
ధ్యానం: ఉద్య దాదిత్య రుచిరాం శీ తాంశు కృత శేఖరాం
పద్మాసనాం త్రినేత్రాం చ పాశాంకుశ వరాభయాం
అలంకృత చతుర్బాహుం మందస్మితల సన్ముఖీం
కుచ భార వినమ్రాంగ లతాం దేవీం హృది స్మరేత్
ప్రకృతిః పరమా శక్తిః చిన్మయీ జ్యోతిరాకృతిః
సత్యానందమయీ ధ్యేయా శక్తిః శ్రీ సమయేశ్వరీ!!
మంత్రం: శ్రీం హ్రీం ఈం నమః ఈం హ్రీం శ్రీం 108 సార్లు
ఉద్యోగప్రాప్తి:
సంతానం తల్లిదండ్రుల మాట వినటం,సత్సంతాన ప్రాప్తి,వృత్తిలో స్థిరపడడం:
శ్రీ దేవీహి అమృతోత్భూత, కమల, చంద్రశోభనా,
విష్ణుపత్ని, వైష్ణవీ చ వరారోహశ్చ సర్నగిని,
హరిప్రియ, దేవదేవి, మహాలక్ష్మిశ్చ సుందరీ!! (రోజూ 10 సార్లు, శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి 108 సార్లు)
శ్రీదేవీహి, అమృతోద్భూత, కమలా, చంద్రశోభనా,
పంచగవ్య శ్లోకం:
గవ్యం పవిత్రం చ, రసాయనం చ, పఠయం చ హృదయం బలబుద్ధిమ్ !
ఆయుః ప్రదం, రక్తవికర్హరి, త్రిదోషరిదోగ్వి సఫంస్యత్ !!
దృష్టిదోష-అభిచార నివారణ రేణుకా మాత:
1.రేణుకా రామ జననీ జమదగ్ని ప్రియా సతీ !
అభిచారో పశమనీ సర్వానంద విధాయినీ !! 108 సార్లు
2.బగళా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణీ
స్తంభిన్యా కర్షణీ చైవ తథో చ్చాటన కారిణీ !
భైరవీ భీమ నయనా మహేశ గృహిణీ శుభా
దశ నామాత్మకం స్తోత్రం పఠే ద్వా పాఠయే ద్యది
సభవే న్మంత్ర సిద్ధశ్చ దేవీ పుత్ర ఇవక్షితౌ
జిహ్వాగ్ర మాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడ యంతీం
గదాభి ఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్వి భుజాం నమామి !
బ్రహ్మణీ పాతుమాం పూర్వే దక్షిణే వైష్ణవీ తథా
పశ్చిమే పాతు వారాహీ ఉత్తరేతు మహేశ్వరీ
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీస్తు నైరృతే
వాయువ్యాం పాతు చాముండా ఇంద్రాణీ పాతు ఈశనే
జలే పాతు మహామాయా పృథివ్యాం సర్వ మంగళా
ఆకాశే పాతు వరదా సర్వత్ర భువనేశ్వరీ !! 108 సార్లు
3.ప్రాచ్యాం పాతు మహామాయా చాగ్నేయ్యాం పాతు కాళికా
దక్షిణే దక్షకన్యా చ నైరృత్యాం శివసుందరీ
పశ్చిమే పార్వతీ పాతు వారాహీ వాయుకోణగా
కుబేర మాతా కౌబేర్యా మీశాన్యా మీశ్వరీ సదా
ఊర్ధ్వం నారాయణీ పాతు హ్యంబికా థస్సదావతు !! 108 సార్లు
ఆనంద సిద్ధి (సర్వకామనా సిద్ధి):
1.గేహం నాకతి గర్వితః ప్రణతతి స్త్రీ సంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతిక్ష్మా వల్లభో దాసతి !
మృత్యుర్వైద్య తి దూషణం సుగుణ తిత్వత్పాద సంసేవ నాత్
త్వాం వందే భవభీతి భంజన కరీం గౌరీం గిరీశ ప్రియాం !! 21 సార్లు
2.ప్రసీద పరదేవతే మమహృది ప్రభూతం భయం
విదారయ దరిద్రతాం దళయ దేహి సర్వజ్ఞతాం !
విదేహి కరుణాన్వితే చరణ పద్మయుగ్మం స్వకం
విదారిత జరామృతి త్రిపుర సుందరి శ్రీశివే !! 21 సార్లు
3.సంగీతం సరసం విచిత్ర కవితామామ్నాయ వాక్య స్మృతి
వ్యాఖ్యానం హృదితా వకీన చరణ ద్వంద్వంచ సర్వజ్ఞతాం !
శ్రద్ధాకర్మణి శంభవేతి విపులం శ్రీ జృంభణం మందిరే
సౌందర్యం వపుషి ప్రదేషి జగతా మంబేశ్వరి శ్రీశివే !! 21 సార్లు
4.యామాత్రా త్ర పునీలతా తనుల సత్తంతు స్థితిస్పర్ధినీ
వాగ్బీజే ప్రధమే స్థితా తవ పరా తాం మన్మహేతే వయం !
శక్తిః కుండలినీతి విశ్వజనని వ్యాపార బంధోద్యమాం
జ్ఞాత్వేత్థం నపునః స్పృశంతి జననీ గర్భేర్భకత్వం నరాః !! 21 సార్లు
5.శబ్ద బ్రహ్మమయీ చరాచర మయీ జ్యోతిర్మయీ వాజ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్వం మయీ చిన్మయీ !
తత్వాతీత మయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాంపాతు మీనాంబికే !! 21 సార్లు
సుమంగళి ప్రతి రోజు పఠించవలసిన శ్లోకం:
ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్తక ధారిణీ,
వేదాంబికే, నమస్తుభ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే!!
(సుమంగళి స్త్రీలు రోజూ 3 సార్లు)లేదా
తన్మూలే సర్వ తీర్ధాణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం!!
(తులసిని పూజించి 12 సార్లు పఠించవలెను)
అశ్వమేధయాగం చేసిన ఫలం లభించుటకు:
బృంద, బృందావనీ, విశ్వపూజిత, విశ్వపావని,
పుష్పసార, నందనీ చ తులసి కృష్ణ జీవని!!
(తులసి చెట్టు ముందు రోజూ 3 సార్లు పఠించవలెను)
మనస్సుతో చేయబడిన పాపములు తొలగుటకు:
విభతీయ శివాసనే, శివేన శాకమ్ అవ్యయ
హిరణ్మయి అతి నిర్మలే నమామి తాం హిమద్రిజాం!!
(8 సార్లు రోజూ పొద్దున, సాయంత్రం చదవవలెను)

Pingback: Sri Lalitha Sahasranamam With Meaning in Telugu - StotraVeda.com
Pingback: Durga Navratri|Sharadiya Navratri - StotraVeda.com
Pingback: Stotras in english - StotraVeda.com
Pingback: Shravana Masam Festivals Dates - StotraVeda.com
Pingback: Paush Masam Festivals Dates in Calendar - StotraVeda.com
Pingback: Pournami Pooja Pournami Vrath and Mantra - StotraVeda.com