Durga Devi Shodashopachara Pooja Vidhi

Durga Devi Shodashopachara Pooja Vidhi | Navratri Vrath Puja Vidhi
Durga Devi Shodashopachara Pooja Vidhi | Navratri Vrath Puja Vidhi

Durga Devi Shodashopachara Pooja Vidhi Navratri Vrath Puja Vidhi

Check Daily Pooja Procedure at Home/ Nitya Pooja Vidhi

దుర్గాదేవి/దేవి షోడశోపచార పూజవిధి మంత్రములతో తెలుగులో:

గురుమంత్రం: 

గురు బ్రహ్మ, గురు విష్ణుగురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గణేశ ప్రార్ధన:

శ్లో||శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః ,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

సంకల్పం:
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

శ్రీ దుర్గాదేవిపూజాం కరిష్యే శ్రీ సువర్ణ కవచ లక్ష్మి దుర్గాదేవ్యై నమః

ధ్యానం:
శ్లో || చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో || శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గాంచండీం నమామ్యహమ్
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆవాహయామి
(పుష్పము వేయవలెను).

ఆసనం:

తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్ యస్యాం హిరణ్యం

 విందేయంగామశ్వం పురుషానహమ్

శ్లో || సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)

పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం శ్రియం

దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం

శ్లో || సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ దుర్గాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:
కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃఇతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
శ్లో ||శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

ఆచమనం:
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
శ్లో || సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
మధుపర్కం గృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీదుర్గాదేవ్యైనమః ఆచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

మధుపర్కం:
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)
శ్లో || మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మఢఃఉపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి.పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)

పంచామృతస్నానం:
శ్లో || ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీ దుర్గాదేవ్యైనమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)

శ్లో || ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
శ్రీ దుర్గాదేవ్యైనమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)

శ్లో || ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
శ్రీ దుర్గాదేవ్యైనమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)

శ్లో || ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః,మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా,మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
శ్రీ దుర్గాదేవ్యైనమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)

శ్లో ||ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
శ్రీ దుర్గాదేవ్యైనమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)

ఫలోదకస్నానం:

శ్లో || యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)

శ్రీదుర్గాదేవ్యైనమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.

స్నానం:
ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ
శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః స్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)

వస్త్రం:
ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మికీర్తిమృద్ధిం దదాతుమే.
శ్లో || సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే గృహతే
శ్లో || తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.

గంధం:
గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
శ్లో || శ్రీఖంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః గంధం సమర్పయామి
(గంధం చల్లవలెను.)

ఆభరణములు:
శ్లో || కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

పుష్పసమర్పణం (పూలమాలలు):
మనసఃకామ మాకూతిం వాచస్పత్యమశీమహి
పశూనాగం రూపామన్నస్య య శ్శ్రీ శ్రయతాం యశః.
శ్లో || మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీ దుర్గాదేవ్యైనమః పుష్పాంజలిం సమర్పయామి.

పసుపు:
అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః ||
హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాకాళీ…….దుర్గాంబికాయై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.

కుంకుమ:
యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే ||
ఓం శ్రీ మహాకాళీ……దుర్గాంబికాయైనమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.

అథాంగపూజా:
దుర్గాయైనమః – పాదౌ పూజయామి
కాత్యాయన్యైనమః – గుల్ఫౌ పూజయామి
మంగళాయైనమః – జానునీ పూజయామి
కాంతాయై నమః – ఊరూ పూజయామి
భద్రకాళ్యై నమః – కటిం పూజయామి
కపాలిణ్యై నమః – నాభిం పూజయామి
శివాయై నమః – హృదయం పూజయామి
జ్ఞానాయై నమః – ఉదరం పూజయామి
వైరాగ్యై నమః – స్తనౌ పూజయామి
వైకుంఠ వాసిన్యై నమః – వక్షస్థలం పూజయామి
దాత్ర్యై నమః – హస్తౌ పూజయామి
స్వాహాయై నమః – కంఠం పూజయామి
స్వధాయై నమః – ముఖం పూజయామి
నారాయణ్యై నమః – నాశికాం పూజయామి
మహేశ్యై నమః – నేత్రం పూజయామి
సింహవాహనాయై నమః – లలాటం పూజయామి
రుద్రాణ్యై నమః – శ్రోత్యే పూజయామి
శ్రీ దుర్గాదేవ్య నమః – సర్వాణ్యంగాని పూజయామి
(తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను)

ధూపం:
కర్దమేన ప్రజా భూతా సంభవ కర్దమ శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్
శ్లో ||వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః ధూపమాఘ్రాపయామి.

దీపం:
అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహనిచ
దేవీం మాత్రం శ్రియం వాసయమేకులే.
శ్లో || సాజ్యమేకార్తిసంయుక్తంవహ్నినాయోజితంప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం
భక్తాదీపం ప్రయచ్చామి దేవ్యైచ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః దీపం దర్శయామి

నైవేద్యం:
ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్
చంద్రాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో ||అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా- ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం
సూర్యాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో || పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ దుర్గాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి

నీరాజనం:
తాం మ అవహజాతవేదో లక్ష్మీమనపగామినీం య స్యాంహిరణ్యం
ప్రభూతంగావోదాస్యోశ్యాన్ విధేయం పురుషానహమ్

శ్లో || నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీ దుర్గాదేవ్యైనమః కర్పూర నీరాజనం సమర్పయామి
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

మంత్రపుష్పమ్:

జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః |
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః ||
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి దీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
ఓం తద్భ్రహ్మా | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | ఓం తత్సత్యం | ఓం తత్సర్వం |
ఓం తత్సురోర్నమః | అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | త్వయజ్ఞస్త్వం |
వషట్కారస్త్వం మింద్రస్త్వగం | రుద్రస్త్వం | విష్ణుస్త్వం | బ్రహ్మత్వం |
ప్రజాపతిః | త్వంతదాప అపోజ్యోతి రసోమృతం బ్రహ | భూర్భువస్సువరోం
ఓం శ్రీ మహాకాళీ….దుర్గాంబికాయై నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పధ్బ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
శ్రీ దుర్గాదేవ్యైనమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

ప్రదక్షిణ:

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో ||యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీ దుర్గాదేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

ప్రార్ధనం:
శ్లో || సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే

శ్రీ దుర్గాదేవ్యైనమః ప్రార్దనాం సమర్పయామి

సర్వోపచారాలు:
చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీ దుర్గాదేవ్యైనమః సర్వోపచారాన్ సమర్పయామి

క్షమా ప్రార్థన:
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీ దుర్గాదేవ్యైనమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం

(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)

అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ ||(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)

Durga Devi Shodashopachara Pooja Vidhi in English :

Dhyanamu and Avahanam:

Sarvamangala Mangalye Shive Sarvartha Sadhike।

Sharanye Tryambake Gauri Narayani Namoastu Te॥

Brahmarupe Sadanande Paramananda Svarupini।

Druta Siddhiprade Devi Narayani Namoastu Te॥

Sharanagatadinartaparitranaparayane।

Sarvasyarttihare Devi Narayani Namoastu Te॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Avahanam Samarpayami॥

Asana:

Aneka Ratnasamyuktam Nanamanigananvitam।

Kartasvaramayam Divyamasanam Pratigrihyatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Asanam Samarpayami॥

Arghya Samarpan:

Gandhapushpakshatairyuktamarghyam Sampaditam Maya।

Grihana Tvam Mahadevi Prasanna Bhava Sarvada॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Arghyam Samarpayami॥

Achamana Samarpan: 

Achamyatam Tvaya Devi Bhakti Me Hyachalam Kuru।

Ipsitam Me Varam Dehi Paratra Cha Param Gatim॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Achamaniyam Jalam Samarpayami॥

Snana:

Payodadhi Ghritam Kshiram Sitaya Cha Samanvitam।

Panchamritamanenadya Kuru Snanam Dayanidhe॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Snaniyam Jalam Samarpayami॥

Vastra:

Vastram Cha Soma Daivatyam Lajjayastu Nivaranam।

Maya Niveditam Bhaktya Grihana Parameshwari॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Vastram Samarpayami॥

Abhushana Samarpan:

Offer jewelery to Durga Devi.While offering jewelery chant below mantra

Hara Kankana Keyura Mekhala Kundaladibhih।

Ratnadhyam Kundalopetam Bhushanam Pratigrihyatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Abhushanam Samarpayami॥

Chandan Samarpan:

Paramananda Saubhagyam Paripurnam Digantare।

Grihana Paramam Gandham Kripaya Parameshwari॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Chandanam Samarpayami॥

Kumkuman Samarpan:

Kumkumam Kantidam Divyam Kamini Kama Sambhavam।

Kumkumenarchite Devi Prasida Parameshwari॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Kumkumam Samarpayami॥

Sugandhita Dravya:

Offer perfume to Durga Devi.While offering perfume chant below mantra

Chandanagaru Karpuraih Samyutam Kunkumam Tatha।

Kasturyadi Sugandhashcha Sarvangeshu Vilepanam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Sugandhitadravyam Samarpayami॥

Haridra Samarpan:

Offer turmeric to Durga Devi.While offering turmeric chant below mantra

Haridraranjite Devi Sukha Saubhagyadayini।

Tasmattvam Pujayamyatra Sukhashantim Prayaccha Me॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Haridrachurnam Samarpayami॥

Akshata Samarpan:

Ranjitah Kankumaudyena Na Akshatashchatishobhanah।

Mamaisha Devi Danena Prasanna Bhava Shobhane॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Akshatan Samarpayami॥

Pushpanjali:

Mandara Parijatadi Patali Ketakani Cha।

Jati Champaka Pushpani Grihanemani Shobhane॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Pushpanjalim Samarpayami॥

Bilvapatra:

Amritodbhava Shrivriksho Mahadevi! Priyah Sada।

Bilvapatram Prayacchami Pavitram Te Sureshwari॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Bilvapatrani Samarpayami॥

Dhoop Samarpan:

Dashanga Guggula Dhupam Chandanagaru Samyutam।

Samarpitam Maya Bhaktya Mahadevi! Pratigrihyatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Dhupamaghrapayami॥

Deep Samarpan:

Ghritavarttisamayuktam Mahatejo Mahojjvalam।

Dipam Dasyami Deveshi! Suprita Bhava Sarvada॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Deepam Darshayami॥

Naivedya:

Annam Chaturvidham Svadu Rasaih Shadbhih Samanvitam।

Naivedya Grihyatam Devi! Bhakti Me Hyachala Kuru॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Naivedyam Nivedayami॥

Rituphala:

Drakshakharjura Kadaliphala Samrakapitthakam।

Narikelekshujambadi Phalani Pratigrihyatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Rituphalani Samarpayami॥

Achamana:

Offer water to Durga Devi.While offering water chant below mantra

Kamarivallabhe Devi Karvachamanamambike।

Nirantaramaham Vande Charanau Tava Chandike॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Achamaniyam Jalam Samarpayami॥

Narikela Samarpan:

Narikelam Cha Narangim Kalingamanjiram Tva।

Urvaruka Cha Deveshi Phalanyetani Gahyatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Narikelam Samarpayami॥

Tambula:

Elalavangam Kasturi Karpuraih Pushpavasitam।

Vitikam Mukhavasartha Samarpayami Sureshwari॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Tambulam Samarpayami॥

Dakshina:

Puja Phala Samriddhayartha Tavagre Svarnamishwari।

Sthapitam Tena Me Prita Purnan Kuru Manoratham॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Dakshinam Samarpayami॥

Pustak Puja and Kanya Pujan:

After Dakshina offering, now worship books which are used during Durga Puja while chanting following Mantra.

Namo Devyai Mahadevyai Shivayai Satatam Namah।

Namah Prakrityai Bhadrayai Niyatah Pranatah Smatam॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Pustaka Pujayami॥

Deep Puja:

After worshiping books, perform lightening and worshiping of Deep Deva during Durga Puja while chanting following Mantra.

Shubham Bhavatu Kalyanamarogyam Pushtivardhanam।

Atmatattva Prabodhaya Dipajyotirnamoastu Te॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Deepam Pujayami॥

Kanya Pujan:

Kanya Puja is also significant during Durga Puja. Hence after Durga Puja, girls are invited for the sumptuous meal and offered gifts. While offering Dakshina to girls, following Mantra should be chanted.

Sarvasvarupe! Sarveshe Sarvashakti Svarupini।

Pujam Grihana Kaumari! Jaganmatarnamoastu Te॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Kanya Pujayami॥

Pradakshina:

Pradakshinam Trayam Devi Prayatnena Prakalpitam।

Pashyadya Pavane Devi Ambikayai Namoastu Te॥

Om Bhurbhuvah Svah Durgadevyai Namah

Pradakshinam Samarpayami॥

Kshamapan:

Aparadha Shatam Devi Matkritam Cha Dine Dine।

Kshamyatam Pavane Devi-Devesha Namoastu Te॥

Navratri Vrath Puja Vidhi-నవరాత్ర పూజా విధి:

పూజాస్థలం:

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

దేవి విగ్రహ ప్రతిష్ట:

అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.

ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.

‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం!

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’

దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన ఆరోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలకమౌతాయి.

కలశముప్రతిష్ట:

శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందురోజునాటికే పూజాసామగ్రి, పూజాద్రవ్యాలు, హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొని, పీఠముపై ఎర్రని వస్త్రము పఱచి, బియ్యము పోసి, దానిపై సువర్ణ, రజిత, లేదా తామ్రా కలశమును ఉంచి, కలశమునకు దారములు చుట్టి, కలశములో పరిశుద్ద నదీజలములను నింపి, అందు లవంగములు, యాలకులు, జాజికాయ, పచ్చకర్పూరము మొదలగు సువర్ణద్రవ్యాలు వేసి, నవరత్నాలు, పంచలోహాలను వేసి, పసుపు, కుంకుమ, రక్తచందన, చందనాదులను వేసి, మామిడి, మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగుళ్ళను ఉంచి, పరిమళ పుష్పాదులను వేసి, దానిపై పీచు తీయని, ముచ్చిక కలిగిన టెంకాయనుంచి, దానిపై ఎల్టని చీర, రవిక వేసి, కలశమును చందన, కుంకుమ, పుష్పాదులతో అలంకరించాలీ.

పూజా విధానం:

పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!

యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసి , రక్షాబంధన పూజ చేసి , రక్షాబంధనాన్ని ధరించి, కలశస్థాపన పైన చెప్పినవిధంగా చేసి, ప్రాణప్రతిష్ట కళాన్యాసములు చేసి , షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా, సహస్ర నామములతో, త్రిశతీ నామములతో, అష్ణోత్తర శతనామములతో, దేవీఖడ్గమాలా నామములతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్తచందనాక్షతలు, శ్రీచందనాక్షతలు, బిల్వదళములు, తులసీదళములు, పరిమళ పుష్పాదులతో అర్చన చేసి , నవకాయ పిండివంటలతో రకరకాలైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు, నివేదన చేసి , మంగళహారతిచ్చి అమ్మవారిని ఈవిధంగా ప్రార్జించాలి.

తల్లీ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని, నన్ను ఆశీర్వదించు తల్లీ! అని ప్రార్థించాలి. హస్తా నక్షత్రముతో కూడుకొన్న పాడ్యమినాడు మాత్రమే కలశస్థాపన చేయాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గరనుండి బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, స్నాన సంధ్యాదులు ముగించుకొని, త్రికాలార్చనగానీ, షట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూ, ఉదయంనుండీ, సాయంత్రంవరకూ ఉపవాసముండి, సాయంకాల అర్చన ముగించుకొని, అమ్మవారికి మహానివేదన ධීවූරඩ්, నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి.

చేయకూడని పనులు:

ఉల్లి, వెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మరొనంగా ఉండాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి. ప్రతినిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించుకొని ఆరాధించాలి. అమ్మవారియొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి, అష్టభుజాలతో, అష్టవిధ ఆయుధాలను ధరించి, సౌమ్యమూర్తియై, అభయప్రదానం సౌమ్యస్వరూపిణిగా గానీ, చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని, సింహాసనం మీద కూర్చొని, చతుర్భుజాలలో అభయ, వరద, పాశ, అంకుశములను ధరించి, సౌమ్యమూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి. ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీసప్తశతీ, దేవీభాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి.

సువాసినీపూజ, కుమారీపూజ, శ్రీచక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉండాలి. గీత, వాద్య, నృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామసంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. వందలు, వేల దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీవిద్య, చండీ, దశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి.

చేయాల్సిన పనులు:

మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీ, లలితాపంచదశాక్షరీ, రాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీ, మహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్రచందనము, చందనము, పసుపు, కుంకుమ ధరించాలి. అమ్మకు ప్రియమైన ముత్యాల, పగడాల, రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగి, అమ్మను ఆరాధిసూండాలి. పరుషమైన మాటలు, అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. పండితులు, బ్రాహ్మణులు, భక్తులు విచ్చేసినయెడల శక్యానుసారము పూజించి, సత్కరించాలి. ఈవిధంగా శక్యానుసారము నవరాత్రవ్రతాన్ని ఆచరించాలి.

 నైవేద్యం:

పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి.నవకాయ పిండివంటలతో రకరకాలైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు, నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి.

పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.

అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి. దశమినాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి.

ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా జమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేస్తాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమిరోజు జమీవృక్షాన్ని పూజించడం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచడం ఆనవాయితీగా మారాయి.

ఆయుధ పూజ:

దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. అందుకే అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది.

మహిమాన్వితమైన దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో కావించే పూజావిధులే గాక దశమి విజయదశమిగానూ, దసరాగానూనూ పిలువబడుతూ పండగ ఉత్సాహం అంతటా వెల్లివిరుస్తుంది. అంతటా భక్త్యావేశమే కానవస్తుంది.

మహిషాసురమర్దిని

‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః

ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ద్యలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు.

దేవీమాత మణిద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది.

‘హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!’ అంటూ ప్రార్ధించారు.

‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరునార్ద్ర్హ వీక్షణాలతో వాళ్ళకు ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సంహవాహనరూఢురాలై గగనతలాన నిలిచింది. దేవి దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి.

శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది. ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి. అగ్ని తేజంతో, వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి.

ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది.

సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహ వాహినియై మహిషాసురుని మహిప్యతీపుర బాహ్యంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి, భూమి కంపించింది. కుల పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి.

దేవీమాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను, వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్య చకితుడిని చేసిందతడిని.

‘ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు.

బాష్కల దుర్ముఖులు, ఆపైన అసిలోమ బిడాలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు.

దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు.

అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా, నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు మూర్ఖప్రలాపాలు మాని’ అంటూ శంఖం పూరించింది దేవీమాత.

మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమనదనానికి పంపివేసినది దేవీమాత.

మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు.

వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని చరతం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.

నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడంవల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ తొమ్మిది రోజులలో అష్టమినాడు మహిషాసురుని వధించడమే గాక, శంభనిశంభులు, చందముండులు, రక్తభీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం కావించింది దేవీమాత. అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, యమదంష్ట్రికులైన (అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల) శరధ్వంత ఋతువుల్లో ప్రజలు అకాలమృత్యువు వాతపడకుండా వుండటానికి భూలోకంలో అనాదికాలం కృతయుగం నుండి నేటివరకు దేవీనవరాత్రోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.