Hanuman Stotras

Hanuman Stotras Mantras  

Hanuman Stotras Mantras visit www.stotraveda.com
Hanuman Stotras Mantras

Here Stotra Veda Providing Collection of Hanuman Stotras and Mantras. Check and chant daily for good results.

श्री हनुमान स्तोत्र – मंत्र शक्ति

Hanumath Badabanala Stotram Very Powerful Mantra

Hanuman Chalisa Mantra

Brahma Virachita Sundara Hanuman Mantra 

Yantrodharaka Hanuman Stotram

Hanuman Ashtottara Sata Namavali

Vichitra Veera Hanuman Mala Mantra and Stotra

Asadhya Sadhaka Mantra

శ్లోకాలు:

రోగహర హనుమన్మంత్రం:
సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ !
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ !!

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయస్వామి శ్లోకాలు:
హనుమంతుడు కార్యసాధకుడు.భక్తితో హనుమంతుని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1.విద్యాప్రాప్తికి: పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
2.ఉద్యోగప్రాప్తికి: హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్ధం శివరూపా నమోస్తుతే!!
3.కార్యసాధనకు: అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయ ప్రభో!!
4.గ్రహదోష నివారణకు: మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
5.ఆరోగ్యమునకు: ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
6.సంతానప్రాప్తికి: పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
7.వ్యాపారాభివృద్ధికి: సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
8.వివాహప్రాప్తికి: యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!!


ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి శక్తి కొలది ప్రదక్షిణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

హనుమ స్తోత్రం:
1.మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి !!
2.బుద్ధిర్బలం య శోధైర్యం నిర్భయత్వ మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్ !!
3.జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!
4.దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః !
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః !!

సత్ కార్యసిద్ధికి:
ఆంజనేయ మహాబాహో హరి రాజ హరి ప్రియ !
త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు !! 108 సార్లు

శత్రుంజయ మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు నివారక !
శత్రున్ సంహార మాం రక్ష శ్రియందాపయ మేప్రభో !!

దుస్స్వప్న పరిహారం (నిద్రించే ముందు):

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం !
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి !! 21 సార్లు
లేదా
శివో, మహేశ్వరశ్చైవ, రుద్రో, విష్ణు, పితామహ,
సంసారవైద్య, సర్వేశ, పరమాత్మ సదాశివ !! 3 సార్లు

మనోజవం మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |

వాతాత్మజం వానరయూథ ముఖ్యం

శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||

భావము:

మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిం|

భాస్పవారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం||

భావము:

దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీ రాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కారము.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|

అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

భావము:

ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.

అంజనానందం వీరం

జానకీ శోక నాశనం|

కపీషమక్ష హంతారం

వందే లంకాభయంకరం||

భావము:

అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.

ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం

యః శోకవహ్నిం జనకాత్మజాయా

ఆదాయ తేనైవ దదాహ లంకాం

నమామి త్వం ప్రాంజలీరాంజనేయం

భావము:

ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసం|

రామాయణం మహామాలారత్నం

వందే అనిలాత్మజం||

భావము:

గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము.

అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం

దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|

సకలగుణ నిధానం వానరాణాం అధీశం

రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||

భావము:

ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.

ఆంజనేయమతిపాటలాలనం

కాంచనాద్రి కమనీయ విగ్రహం|

పారిజాత తరుమూల వాసినం

భావయామి పవమాన నందనం||

భావము:

అంజనాదేవి కుమారుడు, దుష్టులను సం హరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారాలు.

ఆమూషీకృత మార్తాండం;

గోష్పతీ కృత సాగరం|

తృణీకృత దశగ్రీవం

ఆంజనేయం నమామ్యహం||

భావము:

సూర్య భగవాణుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోనివాడైన ఆంజనేయుడికి నమస్కారము.