Panchangam|Online Panchang

Panchangam | Telugu Panchangam | Online Panchang www.sotraveda.com
Panchangam| Telugu Panchangam| Online Panchang

Panchangam:

What is meant by panchang?
In simple terms, “Panchanga” means the Day, Nakshatra (Star), tithi, Yoga and Karana every day. It is a mirror of the sky. The document used as Panchangam has evolved over the last 5000 years.

What are the five angas in Panchang?
Panchanga literally means five angas or limbs. They are ‘vaara, thithi, nakshatra, yoga and Karana’. Panchanga literally means five angas or limbs. They are ‘vaara, thithi, nakshatra, yoga and Karana’

Panchangam literally means five angas or limbs. They are ‘vaara, thithi, nakshatra, yoga and Karana’.

Karana:
The Karana is half a tithi, i.e. when the longitudes of Sun and Moon are increased by 6 degrees.

Yoga:
The period of time during which the joint motion in longitude, or the sum of the motions, of the Sun and the Moon, is increased by 13 degrees and 20′ is called ‘yoga’ meaning literally ‘addition’.

Vaara:
Like in Europe, the weekdays are named after Sun, Moon and the major five planets. Thus Aadi, Soma, Mangala, Buddha, Guru, Shukra, and Shani.
The moment of new Moon or that point of time when the longitudes of Sun and Moon are equal is called Amavasya literally meaning that Sun and Moon are dwelling together.

Tithi:
A tithi is a time occupied by the moon in extending its distance from the Sun exactly by 12 degrees. It means at the exact point of time, when the Moon moving eastwards from the Sun, after Amavasya, leaves the Sub behind by 12 degrees, the first tithi, Pratipada, ends. And so with the rest, the complete synodic revolution of the Moon or one lunation occupying 30 Tithis for the 360 degrees. (The Tithi are: Prathami, Dwitiya, Tritiya, Chaturthi, Panchami, Shashti, Saptami, Ashtami, Navami, Dasami, Ekadasi, Dwaadasi, Triyodasi, Chaturdasi, Panchami/Amavasya, the 30th day).

Nanda (Ananda or Joyous) Tithi: Prathipada (1st), Shasti (6th) and Ekadashi (11th)
Bhadra (Arogya, Mangala or Healthy) Tithi: Dwitiya (2nd), Saptami (7th) and Dwadashi (12th)
Jaya (Victory) Tithi: Tuesday- Tritiya (3rd), Ashtami (8th ) and Trayodashi (13th)
Riktha (Loss or Nashta) Tithi: Saturday – Chaturthi (4th) Navami (9th) and Chaturdasi (14th)
Poorna (Sampoorna – Full or New Moon) Tithi: Thursday Panchami (5th), Dashami (10th) and Amavasya (New Moon) or Poornima

However, based on the speed of the Sun and Moon which vary in motion alter the tithi length, even those differences are calculated. Astronomically speaking when the distance between the two is the farthest i.e., 180 degrees, it is called Pournima.

Nakshatra:
The 27th part of the ecliptic is called a nakshatra. Thus each nakshatra occupies 13 degrees and 20′. The time the Moon or any other body requires to travel over this 27th part of the ecliptic is called a Nakshatra. The Moon travels daily one nakshatra and we have 27 nakshtras’ in all.

Today English Panchangam:

19-09-2022

Year : Shubhakrit
Vikrama Era : 2079
Saka Era : 1944
Ayana : Dakshinayana (South hemisphere)
Ritu : Varsha
Month : Bhadrapada
Paksha : Krishna Paksha
Days Since Kaliyuga : 1871378.2581597
Julian Day : 2459842.2581597
Hindu Panchang Sunrise : 06:11
Hindu Panchang Sunset : 18:17
Sun in : Kanya
Moon in : Mithuna
Hindu Panchang Moon Rise :
Hindu Panchang Moon Set : 14:23:46
Ayanamsa (Lahiri) : 24°10′15″

Kalas From To
Rahu Kalam: Rahukalam is an inauspicious time in any day to do anything important or to start anything new. If unavoidable offer a prayer to lord Ganesha and proceed. 7:41 9:12
Gulika Kalam: Gulika Kalam is an inauspicious time in any day to do anything important or to start anything new. If unavoidable offer a prayer to lord Ganesha and proceed. 13:44 15:15
Yamagandam: Yamagandam is an inauspicious time in any day to do anything important or to start anything new. If unavoidable offer a prayer to lord Ganesha and proceed. 10:43 12:14
Amrita Kalam: Amrita Kalam is a very auspicious time in any day to do anything important or to start anything new. 6:55 8:43
Durmuhurta: Durmuhurtam is an inauspicious time in any day to do anything important or to start anything new. If unavoidable offer a prayer to lord Ganesha and proceed. 12:38 13:26
Varjyam: Varjyam is an inauspicious time in any day to do anything important or to start anything new. If unavoidable offer a prayer to lord Ganesha and proceed.

Day (Vara) : Monday
Rulling Diety : Chandra
Day of creativity, original thinking and intuitive things. Good for buying new things like clothes, accessories and jewelry, marriage, intuitive decisions and actions, approval from ladies, make changes and things related to mother, water, milk. Don’t be rigid or tough, Avoid hair cutting and manicure.
Tithi : Krishna Navami Upto: 19:02:15 After That Krishna Dashami
Chandra kala of tithi : Chandrika
Tithi Lord : Serpent
Nitya devi of tithi : Kulasundari
Nitya devi mantra : Aim Hrim Shrim Aim Klim Sauh Kulasundari Nitya Shri Padukam Pujayami Tarpayami Namah (Check Here Powerful Tithi Nitya Devata Mantras)
Suitable for : The Serpent rules this 9th Tithi. It is a Rikta Tithi and not good for auspicious works. Suitable for killing enemies, acts of destruction, and violence. Inauspicious day for important businesses. Good for arguments, competition, physical exercising, shooting etc. marksmanship and work with tools.
Nakshatra : Ardra Upto: 18:10:26 After That Punarvasu

Day Time Horas Night Time Horas
Moon 6:11 Venus 18:17
Saturn 7:11 Mercury 19:16
Jupiter 8:12 Moon 20:16
Mars 9:12 Saturn 21:15
Sun 10:13 Jupiter 22:15
Venus 11:13 Mars 23:14
Mercury 12:14 Sun 24:14
Moon 13:14 Venus 25:14
Saturn 14:15 Mercury 26:13
Jupiter 15:15 Moon 27:13
Mars 16:16 Saturn 28:12
Sun 17:16 Jupiter 29:12

Today Telugu Panchangam:

రాష్ట్రీయ మితి భాద్రపదం 28, శాఖ సంవత్సరం 1944, భాద్రపదం క్రిష్ణ పక్షం, నవమి తిథి, సోమవారం విక్రమ సంవత్సరం 2079. సఫర్ 22, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 19 సెప్టెంబర్ 2022
సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తర ప్రదక్షిణ, శరద్ బుుతువు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు, నవమి తిథి ఉదయం 7:02 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 6:10 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రుడు ఈరోజు పగలు, రాత్రి మిధునరాశిలోనే సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 19 సెప్టెంబర్ 2022: ఉదయం 6:07 గంటలకు
సూర్యాస్తమయం సమయం 19 సెప్టెంబర్ 2022 : సాయంత్రం 6:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : రాత్రి 11:50 నుంచి రాత్రి 12:39 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:17 నుండి మధ్యాహ్నం 3:06 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:51 నుండి మరుసటి రోజు 12:39 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:09 నుండి సాయంత్రం 6:33 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 6:56 నుండి ఉదయం 8:44 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
యమగండం : ఉదయం 10:30 నుండి ఉదయం 12:30 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:28 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 3:55 గంటల వరకు

నేటి పరిహారం : సోమవారం రోజున ఉపవాసం ఉండి, శివలింగానికి జలాభిషేకం చేయాలి.

Download Ugadi Panchangam-Shubhakruth Nama Samvatsara free Pdf Below:

Ugadi Panchangam

Ugadi 2022-2023:

As per Hindu Panchang or Hindu Panchangam/Telugu Calendar Ugadi Means Yugdai marks the beginning of new year.

In 2022 Ugadi marks the Shubhakruth Nama samvatsaram.This panchangam gives you yearly panchagam and daily panachagam like thithi,vara,nakshtram,varjam,drmuhurtam,and all festival details with muhurat.

What is Shukla and Krishna paksha?
The first fortnight between New Moon Day and Full Moon Day is called “Gaura Paksha” or Shukla Paksha ( litttle ‘white/bright/golden side’) the period of the brightening moon (waxing moon), and the second fortnight of the month is called “Vadhya Paksha” or Krishna Paksha (litttle ’dark/black side’), the period of the fading moon (waning moon).

Telugu Panchangam:

శుభ‌కృత నామ సంవ‌త్స‌ర‌ రాశిఫ‌లాలు

మేషం:

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 3 అవమానం: 6

చైత్రం: ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వైశాఖం: అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు రాణిస్తారు.
జ్యేష్ఠం: ఈ నెల ప్రథమార్ధం మిశ్రమంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో శుభఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
ఆషాఢం: ఈ నెల గ్రహస్థితి ఓ మోస్తరుగా ఉంది. వృథా ఆలోచనల కారణంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే, ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు.
శ్రావణం: రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ అవసరం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు, చీకాకులు ఉంటాయి. పొదుపుపై మనసు నిలుపుతారు. ఈ నెల ద్వితీయార్ధంలో మానసిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం.
భాద్రపదం: ఈ నెలలో ప్రధాన గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుంటారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది.
ఆశ్వయుజం: పనుల్లో శ్రమకు తగ్గ విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
కార్తికం: ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కార్య నిర్వహణలో ఏమరుపాటు తగదు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సంకల్పంతో ముందుకు వెళ్తారు.
మార్గశిరం: ప్రారంభించిన పనుల్లో మొదట్లో ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. సరైన మార్గనిర్దేశం లభిస్తుంది.
పుష్యం: ఇంటా బయటా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. నెలాఖరులో నిర్మాణాది పనులు చేపడతారు.
మాఘం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం. శుభకార్య నిర్వహణలో అయినవారి సహకారం లభిస్తుంది
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు.

Panchangam Tip:ఈ రాశివారికి గురువు ద్వాదశంలో, దశమంలో శని, జన్మస్థానంలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూలం. గురు, శని, రాహు, కేతు గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. శివుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.

వృషభం:

కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 6 అవమానం: 6

చైత్రం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వైశాఖం: అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
జ్యేష్ఠం: ముఖ్యమైన పనులు కుటుంబ పెద్దల సహకారంతో పూర్తవుతాయి. గృహ నిర్మాణ పనులు మొదలుపెడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. సహనంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
శ్రావణం: వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
భాద్రపదం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
ఆశ్వయుజం: పనులు వేగంగా పూర్తవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విహారయాత్రలు చేపడతారు. శుభకార్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణ పనులు మొదలుపెడతారు.
కార్తికం: ఈ నెల ప్రథమార్ధంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ద్వితీయార్ధంలో కొన్ని ఆటంకాలున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.
మార్గశిరం: వివాదాలకు దూరంగా ఉంటూ పనులు నెరవేరుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థాన చలన సూచన.
పుష్యం: ఉద్యోగంలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిచేసే చోట అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ముందుకు రావచ్చు. జాగ్రత్త వహించండి.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి బాగుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. సాహితీవేత్తలకు గుర్తింపు లభిస్తుంది.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో శ్రద్ధ కనబరుస్తారు. మంచి ఫలితాలను పొందుతారు.

Panchangam Tip:ఈ రాశి వారికి ఏకాదశంలో గురువు, ఆరింట కేతువు శుభఫలితాలు ఇస్తారు. పదో స్థానంలో శని, పన్నెండో స్థానంలో రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. శని, రాహువు ప్రీత్యర్థం ఆ రెండు గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయడం, శివారాధన, అమ్మవారి సేవ చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

మిథునం:

మృగశిర 3,4 ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 2 అవమానం: 2

చైత్రం: ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మాసాంతంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పదోన్నతి, స్థాన చలన సూచన.
వైశాఖం: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. స్నేహితులతో వాదనకు దిగకండి.
జ్యేష్ఠం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పాతబాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మాసాంతంలో పుంజుకుంటారు.
ఆషాఢం: ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భూ లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణాది పనులు చేపడతారు. కొత్త వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: ప్రయాణాల మూలంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
భాద్రపదం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశ్వయుజం: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ పనులలో నిమగ్నమై ఉంటారు.
కార్తికం: ఈ నెలలో ప్రథమార్ధం కంటే మాసాంతంలో కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
మార్గశిరం: కుటుంబ పెద్దలతో సఖ్యత నెలకొంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మాసాంతంలో ఆత్మీయులతో, కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఇబ్బందులు ఉండవచ్చు.
పుష్యం: ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. బాధ్యతలు నిర్వర్తించడంలో శ్రమ అధికం అవుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
మాఘం: ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచన.
ఫాల్గుణం: సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ప్రణాళిక బద్ధంగా పనులు నెరవేరుస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విజయం. వివాదాలకు దూరంగా ఉండండి.

Panchangam Tip:ఈ రాశి వారికి రాహువు ఏడాదంతా అనుకూలంగా ఉన్నాడు. గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అష్టమ శని, పంచమంలో కేతువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. శని, కేతువు ప్రీత్యర్థమై ఆ గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివరాధన, సుబ్రహ్మణ్యస్వామి సేవ చేసుకోవడం మంచిది.

కర్కాటకం:

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 5 అవమానం: 2

చైత్రం: ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్పం బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి.
జ్యేష్ఠం: పనులు మొదట్లో మందకొడిగా సాగినా, సకాలంలో పూర్తవుతాయి. పట్టువిడుపులతో ప్రయోజనం పొందుతారు. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. భూములు, వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నెలాఖరులో అభీష్ట సిద్ధి.
శ్రావణం: ఈ నెలలోనూ అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.
భాద్రపదం: మొదలుపెట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు.
ఆశ్వయుజం: ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉండదు. మాసాంతంలో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి.
మార్గశిరం: ఉద్యోగులకు అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో ఉత్సాహంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూలం.
పుష్యం: ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
మాఘం: అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది.
ఫాల్గుణం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యస్థలంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

Panchangam Tip:ఈ రాశివారికి భాగ్య గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. సప్తమ, అష్టమ స్థానాల్లో శని, దశమంలో రాహువు, చతుర్థ కేతువు వల్ల సమస్యలు కలుగుతాయి. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థమై జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ, నరసింహస్వామి సేవతో మేలు కలుగుతుంది.

సింహం:

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 1 అవమానం: 5

చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. అయితే రాహువు, శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
వైశాఖం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి-చెడు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
జ్యేష్ఠం: ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అప్పుల బాధ తప్పుతుంది. బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు.కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. బదిలీ అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
భాద్రపదం: అన్ని విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు.
ఆశ్వయుజం: వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. రాజకీయనాయకులకు మంచి సమయం.
కార్తికం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది.
మార్గశిరం: తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. తోటివారి విమర్శలతో ఇబ్బంది పడతారు. రాబడి బాగుంటుంది.
పుష్యం: విద్యార్థులకు అనుకూల సమయం. ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు ఎదురుకావొచ్చు.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి
ఫాల్గుణం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బయట సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ, చేసే పనిమీద మనసుపెట్టండి. ఆత్మీయులు, మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.

Panchangam Tip: ఈ రాశి వారికి అష్టమ గురువు, సప్తమ శని వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యంలో రాహు సంచారం ప్రతికూలం. గురు, శని, రాహు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దత్తోపాసన, దుర్గాదేవి పూజ వల్ల శుభాలు కలుగుతాయి.

కన్య:

ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 4 అవమానం: 5

చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
వైశాఖం: ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి సాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: ఆత్మీయులు, మిత్రుల సహకారం లభిస్తుంది. అయితే కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. శ్రద్ధతో పనులు చేయాలి. ఉద్యోగులకు తోటివారితో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు.
ఆషాఢం: వ్యాపారులు కొత్త లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది.
శ్రావణం: వివాదాలకు దూరంగా ఉండండి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
భాద్రపదం: పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
ఆశ్వయుజం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. పూర్వం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
కార్తికం: అనవసరమైన ప్రయాణాల వలన అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించి, ఫలితాలను పొందుతారు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరిననూ, జాగ్రత్త అవసరం.
మార్గశిరం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిభారం పెరగడంతో అకాల భోజనం చేయాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సూచన. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. వివాహాది శుభ కార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు చేపడతారు.
పుష్యం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పనులు కలిసి వస్తాయి. వాహన, భూ లావాదేవీలు అనుకూలం. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంయమనంతో పనులు సాధిస్తారు.
మాఘం: నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పనిచేసే చోట ఆదరణ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు
ఫాల్గుణం: గతంలో నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల మూలంగా అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

Panchangam Tip:ఈ రాశివారికి సప్తమ గురువు శుభాలిస్తాడు. ఐదింట శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువు ప్రతికూల ఫలితాలిస్తారు. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థమై జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ, నరసింహ సేవ వల్ల మేలు జరుగుతుంది.

తుల:

చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 7 అవమానం: 1

చైత్రం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల మనశ్శాంతి లోపించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సలహాలను పాటిస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు.
జ్యేష్ఠం: రావలసిన డబ్బు వస్తుంది. బాకీలు తీర్చి ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూమి కొనుగోలు కలిసి వస్తుంది.
ఆషాఢం: అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణతోపాటు ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం.
శ్రావణం: విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. ఉద్యోగులకు పనిచేసే చోట పరపతి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలపడం మంచిది.
భాద్రపదం: ఈ నెల అన్ని విషయాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. అశ్రద్ధ మూలంగా నష్టాలు ఎదురుకావచ్చు. మనశ్శాంతి కరువవుతుంది. ఓపికతో ముందుకు వెళ్లడం అవసరం. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, మనస్పర్ధలు తలెత్తవచ్చు.
శ్వయుజం: వ్యాపారులకు భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తారు.
కార్తికం: ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలలో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భూలావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.
మార్గశిరం: ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. మిత్రులతో పనులు నెరవేరుతాయి. బాధ్యతలు శ్రద్ధతో పూర్తిచేస్తారు.
పుష్యం: విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆలోచించి పనిచేయడం మంచిది.
మాఘం: మాట పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం వస్తుంది.

Panchangam Tip:ఈ రాశి వారికి ఆరింట గురువు, అర్ధాష్టమ శని, సప్తమ రాహువు, లగ్న కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నాలుగు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయస్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోండి.

వృశ్చికం:

విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 3 అవమానం: 1

చైత్రం: పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు.
వైశాఖం: అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రుణ భారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూల సమయం.
జ్యేష్ఠం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
ఆషాఢం: పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసలుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు.
భాద్రపదం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం మూలంగా మనశ్శాంతి లోపించవచ్చు. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.
ఆశ్వయుజం:ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలను పొందుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి.
కార్తికం: ఆదాయం పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. రుణబాధల నుంచి విముక్తులు అవుతారు.
మార్గశిరం: సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి.
పుష్యం: ఈ మాసంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.
ఫాల్గుణం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విదేశీ ప్రయాణాలకు, పై చదువులకు అనుకూలం. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.

Panchangam Tip: ఈ రాశివారికి ఐదింట గురువు యోగిస్తాడు, ఆరింట రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు. అర్ధాష్టమ శని, పన్నెండింట రాహువు వల్ల చికాకులు ఉంటాయి. శని, రాహువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. రుద్రాభిషేకం చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు:

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 6 అవమానం: 1

చైత్రం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
వైశాఖం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
జ్యేష్ఠం: ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించాలి.
ఆషాఢం: రాబడి పెరుగుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు.
శ్రావణం: కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో మనశ్శాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కళాకారులకు ఈ నెల అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
భాద్రపదం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అయితే కొత్త పరిచయస్థులతో జాగ్రత్త అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
ఆశ్వయుజం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
కార్తికం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మార్గశిరం: దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
పుష్యం: ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి.
మాఘం: బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీయాన యోగం.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన చర్చల మూలంగా మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు.

Panchangam Tip:ఈ రాశివారికి చతుర్థంలో గురువు, రెండింట శని, ఐదింట రాహువు సంచారం ప్రతికూలం. పదకొండో స్థానంలో కేతువు అనుకూలిస్తాడు. గురువు, శని, రాహువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించాలి. పరమేశ్వరుడు, దత్తాత్రేయస్వామి, దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది.

మకరం:

ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 2
రాజపూజ్యం: 2 అవమానం: 4

చైత్రం: ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు.
వైశాఖం: అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులు మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ, తర్వాత అనుకూలంగా పూర్తవుతాయి. బంధువులు, స్నేహితుల వలన కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనస్పర్ధలు రావచ్చు.
ఆషాఢం: కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో కీర్తి ప్రతిష్ఠలు, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
శ్రావణం: ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసర చర్చల వల్ల మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు.
భాద్రపదం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంతో పనులు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాల కారణంగా అలసట పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.
ఆశ్వయుజం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. సమయ పాలనతో సత్ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
కార్తికం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళతారు.
మార్గశిరం: కుటుంబంలో అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.
పుష్యం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో సత్కీర్తి పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి సాయపడతారు.
మాఘం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పట్టుదలతో ఫలితాలు సాధిస్తారు.
ఫాల్గుణం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల అలసట, అనారోగ్య సూచన. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.

Panchangam Tip:ఈ రాశివారికి మూడింట గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. ఏల్నాటి శని ప్రభావం ఉంది. అర్ధాష్టమ రాహువు, దశమంలో కేతువు సంచారం ప్రతికూలం. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. పరమేశ్వరుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం:

ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 2
రాజపూజ్యం: 5 అవమానం: 4

చైత్రం: శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.
వైశాఖం: పనులు పూర్తి చేయడంలో సంయమనం, నైపుణ్యం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
జ్యేష్ఠం: నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు రావచ్చు. సంపాదన స్థిరంగా ఉంటుంది.
ఆషాఢం: బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గర ఉండి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం.
శ్రావణం: సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే వివాదాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం.
భాద్రపదం: ఉద్యోగులు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులుచేస్తారు.
ఆశ్వయుజం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. మనశ్శాంతి కొరవడుతుంది. వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. మనస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు వెళతారు. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో సర్దుబాట్ల అవసరం ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు.
మార్గశిరం: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. శ్రమ ఎక్కువ అవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల ఆదరణ ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు.
పుష్యం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు
మాఘం: పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. చివరికి విజయవంతంగా పూర్తిచేస్తారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సంయమనంతో ఉండటం మంచిది. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అన్నీ చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.

Panchangam Tip:ఈ రాశి వారికి ద్వితీయ గురువు సత్ఫలితాలు ఇస్తాడు. మూడింట రాహువు యోగిస్తాడు. ఏల్నాటి శని ప్రభావం ఉంది. నవమ కేతువు వల్ల చికాకులు ఉంటాయి. శని, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. శివారాధన, సుబ్రహ్మణస్వామి సేవ చేసుకుంటే శుభాలు కలుగుతాయి

మీనం:

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 7

చైత్రం: ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి.
వైశాఖం: వివాదాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. మానసిక సంఘర్షణకు గురవుతారు. ఉద్యోగం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అవాంతరాలతో పూర్తవుతాయి.
జ్యేష్ఠం: రాబడి అస్థిరంగా ఉన్నప్పటికీ, ఏదో రకంగా డబ్బు సమకూరుతుంది. సహోద్యోగులు, అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
ఆషాఢం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
శ్రావణం: ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తిలో పనిభారం పెరిగిననూ, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంయమనంతో ఆలోచించండి.
భాద్రపదం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల చదువు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
ఆశ్వయుజం: సంయమనంతో ఉండటం అవసరం. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు.
కార్తికం: ప్రణాళికతో పనులను చేస్తారు. స్వశక్తితో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వాహనాలు, భూములు, ఆస్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం రావచ్చు.
మార్గశిరం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల సమయం. మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది.
పుష్యం: అనుకున్న పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాకతో ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
మాఘం: ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. పై చదువులకు అనుకూలం. ఉత్సాహంతో ఉంటారు.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు, శ్రమాధికం అయినప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు.

Tip:ఈ రాశివారికి శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. సంవత్సరం మధ్యలో ఏల్నాటి శని ప్రభావం కొన్ని నెలలు ఉంటుంది. జన్మ స్థానంలో గురువు, ద్వితీయంలో రాహువు, అష్టమ కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. గురువు, శని, రాహువు, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. పరమేశ్వరుడు, దుర్గ, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Free Calendar PDF also given above.