Deepa Shastra దీప శాస్త్రం
The importance of lighting a lamp is mentioned in the scriptures . According to the Rug Veda, the light of the gods resides in the lamp. This is the reason why, whether it is a pooja-lesson, a cultural festival or a festival, everything is started by lighting a lamp.
Follow these rules when lighting a lamp:
Where should the lamp face in pooja room?
Arrange your lamps in the south-east.Lighting lamps and candles in the pooja room has been an unquestioned tradition. According to pooja room vastu, this wards off negative energies. So, place your lamps in front of the idols in the south-east.
Why do we light a lamp during Puja?
Image result for When should we light lamp in pooja room.As per the pancharatra vidhi, there are 16 items which can be offered to the supreme lord. They are collectively termed as Shodashopchar Puja. Out of them, the lamp forms one of the important items of worship since the lamp represents illumination and enables the devotee to see the divine form of the lord easily.
What time should you light a lamp in the evening and Morning?
It is auspicious to light a lamp on the main door of the house in the evening. Worship God or light a lamp when you feel like it. Doing so can cause harm. So light the lamp only between 5 am and 10 am and between 5 pm and 7 pm.
విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందే వరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. ఈ నూనె దీపానికి వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దేవుని గది లో లేదా ఈశాన్య మూల ఉన్న చిన్న దేవుని పటాలు/ప్రతిమల దగ్గర ప్రతిరోజు ఎలా దీపారాధన చేయాలి అనే విషయంపై చాలామందికి అనేక సందేహాలు.. అయితే వాటికి శాస్త్రం, పండితులు చెప్పిన విధానాలు తెలుసుకుందాం.
ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. ఎన్ని దీపాలు పెట్టాలి అంటే ఒకే ప్రమిదలో మూడువత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. అవకాశం ఉంటే దేవుని రూపాలు/ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు. ప్రతి దాంటో మూడు వత్తులను కలపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలింగచవచ్చు.
దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరో సందేహం. దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి. బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.
దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.
ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.
నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కానీ ఇంట్లో స్థలం, నూనె, ఆర్థిక పరిస్థితులను చూసుకుని పెట్టాలి.
ఎన్ని వత్తులు వేయాలి అనేదానికి పెద్ద పట్టింపులు లేవు కానీ ఒక్కటి కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ అయితే మంచిదిని పెద్దల ఉవాచ.
మంత్రం ప్రకారం చూస్తే.. సాజ్యం త్రివర్తి సంయుక్తం… అని అంటే మూడు వత్తులను ఏకం చేసి ఒకటిగా వెలిగిస్తే మంచిది.
దీపారాధనకు ఆవునెయ్యితో శ్రేష్ఠం, అదీకాకపోతే నువ్వుల నూనె, ఇప్పనూనె, కొబ్బరినూనె, కుసుమనూనె, లేదా అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి. భక్తి, శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే.
మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించు కునుటకు మంచిది .
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి.
మట్టిపిడతల మాదిరి కదిలే బొమ్మలకు జ్ఞానాంశను అద్ది, ఉషస్సుతో పాటూ ఓజస్సునూ సమకూర్చిపెట్టిన ఆ సహస్ర కిరణాంశువు ఎక్కడని అన్వేషించని కాలమంటూ లేదు. అంతుచిక్కని ఆ వెలుగులకు కొరతంటూ లేదు. ఆ ఉజ్వల కాంతిపుంజాలకు మూలమెక్కడని తపించేవారికి పోతన చక్కని దారిచూపించాడు, భాగవతంలో! ‘‘లోకంబులు లోకేశులు/ లోకస్థులుదెగిన తుది నలోకంబగు పెం/ జీకటి కవ్వల నెవ్వడు/ నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్’’ అని అంటాడాయన. జనులూ మునులూ లోక నివహమూ ఇలా సమస్తమూ గతించిపోయాక, అలుముకున్న పెనుచీకటికి ఆవల ఎవడైతే.. అనునిత్యమూ వెలుగుతూ ఉంటాడో అతనే సేవించదగిన పరమాత్మ అన్నది పోతన ఉద్దేశం. లోకాలనేలే దేవుడు వేవెలుగుల సమూహం. ఆ వెలుగులోనే లోకాలన్నీ విలసిల్లుతున్నాయి. ఆ వెలుగు పటిష్టమైన ధమ్మాన్ని ఆశ్రయించుకుని ఉందని, ధర్మసాధన వైపు మొగ్గితేనే భగవత్ స్వరూపం అవగతమవుతుందని దైవ గ్రంథాలు చెబుతున్నాయి.
దీపం.. వెలుగులు చిందే భౌతిక రూపం. దీని వెలుగులోనే సకలం ఉన్నదున్నట్టు కనిపిస్తుంది. అంధకార బంధురమైన జగతికి వెలుగులు పంచే సూర్యచంద్రులూ, నక్షత్ర సమూహాలూ, ఖగోళ కాంతిరేణువులూ జీవశక్తికి ఆలంబనగా నిలుస్తున్నాయి. ఈ అనంత విశ్వం అనేక దీపాల సమూహం కాబట్టే అచంచలమైన వెలుగు వెనుక ఒక పరమార్థం ఉందని, ప్రమిద లాంటి ఈ భూఖండాన్ని వత్తిచ్చి వెలిగించే ఒకానొక తేజోమంతుడు ఉండే ఉంటాడని సనాతన ధర్మం చెబుతోంది.
ప్రమిదలో చమురున్నంత వరకూ దీపం వెలుగుతుంది. అకుశలాల గాలి సోకినప్పుడు అల్లల్లాడిపోతుంది. వాంఛాశక్తి ప్రబలినప్పుడు చప్పున ఆరిపోతుంది. ఆధ్యాత్మికంగా దృఢత్వాన్ని పొందాలనుకునే వాళ్లు ప్రమిదను దేహంగా, వత్తిని తపోశక్తిగా, చమురును శక్తియుక్తులుగా భావిస్తారు. దాంతో దీపారాధనలోని మార్మికత అవగతమవ్వడమే కాక దీపం పరమార్థం ఎరుకలోకి వస్తుంది. దుఃఖంలో నిండిన మనసు సరిగా ఆలోచించలేదు. దిగులు తొలగి క్షాళన కలిగినప్పుడే మనసు తేటతేరుతుంది. మసకవెలుతురులో వస్తువు గుణస్వభావాలను పూర్తిగా దర్శించడం వీలుపడదు. కాబట్టి దార్శనిక దృష్టి శక్తిమంతంగా ఉండాలి.
నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టి దీపం అవసరమేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సారాల క్రితం సంగతిని ఊహించుకోండి, ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేరు. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాల వలన మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. ఒకటి, అప్పుడు విద్యుద్దీపాలు లేవు. రెండు, ఇళ్ళు కలప, తాటాకు వంటి సేంద్రీయ పదార్ధాలతో నిర్మించుకునేవారు. అందువలన వారు పెద్ద పెద్ద కిటికీలను పెట్టుకోలేక పోయేవారు. సాధారణంగా, పురాతన కాలంలో ఇళ్ళలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండటం మీరు చూసారా? అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు, సాధారణంగా అదే పూజా స్ధలంగా ఉండేది.కానీ, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అది కూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితం అవుతున్నది.
సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు ఉన్న చాలా సమస్యల వలన మనము విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాము. కానీ మీలో దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మీరు ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండక పోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మీరు దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించారా? ఇది ఎందుకంటే మీరు దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
ఎక్కడ ఇలాంటి శక్తి వలయం ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా చలిమంట చుట్టూ కూర్చున్నారా? మీరు కనుక కూర్చుని ఉంటే, ఆ సమయంలో చెప్పుకునే కథల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారా? పాతకాలంలోనే, కథలు చెప్పే వాళ్ళు, దీన్ని అర్ధం చేసుకున్నారు. చలి మంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకు పోతాయి. వాటిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం.
కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్య పరంగానే కాకుండా, శక్తి పరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెల వినియోగం ముఖ్యం. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఒక అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని స్వంత శక్తి క్షేత్రం ఉంటుంది.
అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాము. నిజానికి, మీ జీవితమే అగ్ని అని చాలా భాషలలో ప్రస్తావిస్తారు. మీలోని అగ్నే మీరు జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక ఒక అగ్ని గోళం, అవునా, కాదా? మీరు ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్ మీద వంట చేసినా, మీ కారులోని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ని స్టార్ట్ చేసినా అది అంతా కూడా అగ్నే. అవునా, కాదా? ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాము. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మీరు అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అది మీ అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.