Shodashopachara Guru Pooja Guru Pournima Puja Thursday Pooja
గురువులు ఎన్ని రకములు?
ఆధ్యాత్మిక గురువులు, వారి వారి లక్షణాలను హిందూ సంప్రదాయం ఇలా నిర్వచించింది .
సూచక గురువులు : ప్రకృతిలో లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు . భక్తీ జ్ఞాన వైరాగ్య భొదలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిని భక్తులను తయారు చేస్తారు వీరు…
వేద గురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరింపజేస్తారు వీరు. .
నిషిద్ద గురువులు : సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను భోదిస్తారు వీరు.
కామ్యక గురువులు : ధర్మ దాతలుగా సప్త సాధనాలు భోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన భక్తులను తయారు చేస్తారు.
భోధక గురువులు: వేదాంత గ్రంధ పరిచయం కలిగిస్తారు . భోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని చెప్తున్నారు. వారు..
నాద గురువులు: వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .
చాయానిది గురువులు: చాయానిది అనే ఒక పక్షి వుందట . దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు .
పరమ గురువులు: వీరు పరుసవేదిలా శిష్యుని తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు
చందన గురువులు: చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు వీరు.
క్రౌంచక గురువులు: దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగా గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట . అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చెయగలడు.
వాచక గురువులు: సాంఖ్య ఉపదేశాలు భోధించి, పరమాత్మ సత్యమని, దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.
కారణ గురువులు: ఆసనాలు, ప్రాఞాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం భోదించి అద్వైత స్థితి ని కలిగిస్తారు.
సద్గురువులు: తెలుసుకోగల్గితే గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు.
నిజ గురువులు: పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నాలుగు వైపులకు నడిపించే శక్తి ఒకా గురువుకే వుంది. .. అటువంటి గురువును పూజించడం మన సంప్రదాయం . ప్రతి సంవత్సరం హిందువులు ఆషాడ పౌర్ణమి నాడు వేద వ్యాసుని జయంతిని గురు పౌర్ణమి పేరుతొ జరుపుకుంటారు ” …బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ట మహా ముని, ఆతని కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరునికి, మత్స్యగంధి సత్యవతి ద్వారా విశ్వ తేజస్సుతో జన్మించిన వాడే వ్యాసుడు. తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఏక రాశిగా వున్న వేదాన్ని ఋక్, యజు, సామ, అధర్వణ అనే నాలుగు భాగాలుగా సులభ గ్రాహ్యం చేసినందుకు ఆతడు వేద వ్యాసుడు అయ్యాడు.నావ యందు (ద్వైపాయనం ) జన్మించాడు కాబట్టి మరియు నలుపు రంగులో వున్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరుగాంచాడు. పద్దెనిమిది పురాణాలను, పద్దెనిమిది ఉప పురాణాలను, విజ్ఞాన సర్వస్వం ఐన మహాభారతాన్ని, బ్రహ్మ సూత్రాలను, ఆధ్యాత్మ రామాయణమును రచించి, కలియుగ మానవాళికి కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాలను ఉపదేశించాడు.
ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాస మహర్షి భోదించాడు.
గురుపూర్ణిమను ఎలా జరుపుకోవాలి?
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
తాను జీవితమంతా గురు సేవ చేసిన సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా పాటించాలని షిర్డీ లో బాబా తన భక్తులకు ఆదేశించాడు. గురువును పూజించడానికి వ్యాసుని జయంతి అయిన వ్యాస పౌర్ణమి (వ్యాస జయంతి) ని మించిన రోజు లేదని భావించి, ఆ రోజును గురు పౌర్ణమిగా నిర్ణయించి పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు. ధుని దగ్గర వుండే స్తంభాన్ని గురువుగా భావించి పూజిస్తానంటే తనకు ఎట్టి అభ్యంతరం లేదని, తనను పరమాత్మగా భావించవద్దని బాబా ఆదేశం. బాబా ఆదేశం ప్రకారం మొదటి సారిగా గురుపూజ చేసిన వ్యక్తి చంద్రాబాయి బోర్కర్.
గురుమంత్రములు:
అవిద్యా హృదయగ్రంధి బంధమోక్షో భావేద్యతః
తమేవ గురు రిత్యాహు ర్గురుశబ్దార్ధ వేదినః
భావం : ఏ మహానుభావునిచే అవిద్యాహృదయగ్రంధి బంధమోక్షము గలుగునో వారే గురువని గురుశబ్దార్ధం.
శ్లో|| గుశబ్దస్త్వంధకారః స్యాత్ రు శబ్దస్తన్నిరోధకః
అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే
భావం: గు అను శబ్దమునాకు అర్ధం అంధకారము, రు అను శబ్దముకు అర్ధం దానిని నాశము చేయు తేజస్సు. అనగా అజ్ఞానాంధకారమైన చీకటిని నాశముజేసి స్వయంప్రకాశమగు పరబ్రహ్మమును కరతలామలకమువలె జేయువారే గురువని గురుశబ్దార్ధము.
శ్లో|| గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతే
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః
భావం: గుకార మంధకారం(అజ్ఞానం) రుకారం తేజస్సు(జ్ఞానం). అజ్ఞానమను తమస్సును మ్రింగువారే గురువు. వారే బ్రహ్మం.సంశయం లేదు.
శ్లో|| గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః
గుణరూప విహీనత్వా ద్గురురిత్యభిధీయతే
భావం:గుకారం గుణాతీతం,రూపాతీతం రుకారం.నామరూపగుణ రహిత అవస్థ(స్థితి)యగు బ్రహ్మమును తెలుపువారే గురువు.
ఇప్పుడు అటువంటి గురువు కృప అందరికీ దొరకాలని కోరుకుంటూ ఆ గురువుకు నమస్కారము చేయండి.
శ్లో|| గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
భావం: గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను.
శ్లో|| అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః
భావం: అజ్ఞానమనే గ్రుడ్డితనమునకు జ్ఞానమనే కాటుక దిద్ది, ఆత్మను చూపించు గురువుకు నమస్కరిస్తున్నాను.
శ్లో|| అనేక జన్మ సంప్రాప్త కర్మేందన విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః
శ్లో|| వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’
భావం: సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం
శ్లో|| వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
భావం: వశిష్ట మహర్షికి మునిమనువడు, శక్తికి మనువడు, పరాశర మహర్షికి పుత్రుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడు తపోనిదియైన మహర్షికి నమస్కారం.
శ్లో|| అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః
భావం: బహు జన్మల నుండి సంప్రాప్తించిన పాప పుణ్యములు జ్ఞానమను అగ్ని చేత దహింపజేయునట్టి గురువునకు నమస్కరిస్తున్నాను .
గురుపూజవిధి మంత్రములతో తెలుగులో:
ప్రసన్న వదన్ాం ధ్యాయేత్ – సరవ విఘ్ననప శాంతయే
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
పూరకాం కాంభ్కాం చైవ రేచకాం తదన్ాంతరాం
ప్రాణాయామ మిదాం ప్రోకతాం సరవ దేవ న్మసకృతా
సంకల్పము:
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సకల లోక కల్యాణర్థం, వేదసాంప్రదాయాభివృర్థం , అసమన్ దేశే గోవధ నిషేధ్యర్థం, గో సాంరక్షణార్థం ,సర్వదేవతా స్వరూప గురుపాదుకాఉద్దేశ్యం షోడశోపచార పూజాం కరిష్యే
కురు ఘాంటారవాం తత్ర దేవతాహ్వాన లాoచనమ్ ||
కలశపూజ
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య.
వక్రతుాండ మహ్యక్య కోటిసూరా సమప్రభ
నిరివఘనాం కర్భమే దేవ సరవ క్రేాష్ సరవదధ్యానం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ ।
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర
గురుపాదుకాభ్యామ్ నమః ధ్యాయామి
వందేగురుపదద్వంద్వం వాఙ్మనసగోచరం
నమామీ సద్గురుమ్ శాంతం ప్రత్యక్ష గురురూపిణం
పాద్యం/అర్ఘ్యం:
పాద్యం త్వ ప్రతి గృహ్ణష్వ గురు దేవ నమోస్తుతే
గురుపాదుకాభ్యామ్ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి
కసుమాక్షత సంమిశ్రమ్ ప్రసన్నాబు పరిప్లుతం
గురుపాదుకాభ్యామ్ నమః ఆచమనీయాం సమర్పయామి
స్నానం:
గంగాది సర్వ తీర్థభ్య:, తోయమేతత్స నిర్మలం
స్నానం స్వీకురు దేవేశ మయా దత్తామ్ సురేశ్వర
స్నానాంతరం ఆచమనీయాం సమర్పయామి
వ్యోమవత్ వ్యాప్త దేహాయ, నిర్గుణయ గుణాత్మనే
వస్త్రయుగ్మం మయా దత్తమ్ గృహణ మహతాం వర
వస్త్రయుగ్మం ధారణ అనంతరం ఆచమనీయాం సమర్పయామి
వేదమంత్రై సమాయుక్తం బ్రహ్మవిష్ణుశివత్మికం
ఉపవీతాం ప్రయఛ్చచమి గృహణ సురనాయక
గురుపాదుకాభ్యామ్ నమః యజ్ఞాపవీతాం సమర్పయామి
దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితమ్
సకుంకుమమ్ పీతగంధం లలాటే ధారయానఘ
మాల్యాధీని సుసాంధీని మాలత్యాదీవి వై ప్రభో
మాయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం
గురుపాదుకాభ్యామ్ నమః పుష్పాణి సమర్పయామి
అంగ పూజ:
1.దివ్యపాదాయ నమః – పాదౌ పూజయామి
2.మహాబలాయ నమః – జాంఘే పూజయామి
3. బ్రహ్మవిధ్వరాయ నమః – జానునీ పూజయామి
4.సిద్ధాసనాయ నమః- ఊరూన్ పూజయామి
5. జితేంద్రియాయ నమః- గుహాాం పూజయామి
6. సర్వధారాయ నమః – కటిమ్ పూజయామి
10. శివశక్తి స్వరూపాయ నమః- స్తనౌ పూజయామి
11. విశ్వఉద్దారకాయ నమః – బాహూన్ పూజయామి
12. వరదాభయహస్తయ నమః – హస్తత పూజయామి
13. గాంభీరకంఠాయ నమః – కంఠం పూజయామి
14. స్మితవదనాయ నమః- ముఖాం పూజయామి
15. మధురసల్లపాయ నమః – జిహ్వమ్ పూజయామి
17. శ్రుతిరహస్యభోదకాయ నమః – కర్ణణ పూజయామి
గురుపాదుకాభ్యామ్ నమః – నానావిధ పత్ర పష్ప పూజామ్ సమర్పయామి
వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానా నాగందైః సుసంయుతః
షా,బ పూ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
అజ్ఞాన నాశనం దేవ గృహాణ శ్రీమనోహర
గురుపాదుకాభ్యామ్ నమః దీపం దర్శయామి
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిర్మే హ్యచలాంకురు
ఫలంని చ సుపక్వని స్వీకురు జ్ఞాన్దాయక
గురుపాదుకాభ్యామ్ నమః నైవేద్యం సమర్పయామి
సత్యం త్వర్తేన పరిషించామి (పగలు) / ఋతంత్వా సత్యేన పరిషించామి (రాత్రి)
ఉత్తరా పోశనమ్ సమర్పయామి , హస్తౌ పక్షాళయామి సమర్పయామి
పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
గురుపాదుకాభ్యామ్ నమః తాాంబూలాం సమర్పయామి
నీరాజనం గృహ్యణేదాం పంచవర్తి సమన్వితమ్
తేజ్ఞర్వశి మయా దతతాం గృహ్యప తవాం సురేశ్వర
మాంగళా శసన్పరైర్ మదాచరా పురోగమః
సర్వశచ పూర్థవర్వచర్థాః సతకృతాయాసుత మాంగళమ్
గురుపాదుకాభ్యామ్ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
నీర్వజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.
యదాంఘ్రికమలదవాందవాం దవాందవతాపనివారకాం
తారకాం భ్వసాంధోశచ తాం గుర్భాం ప్రపమామాహాం
తవమేవ మాతా చ పితా తవమేవ, తవమేవ బాంధుశచ సఖా తవమేవ
తవమేవ విదాా ద్రవిపాం తవమేవ, తవమేవ సరవాం మమ దేవ దేవ
ఆతమ ప్రదక్షిప న్మస్కర్వన్ సమర్పయామిక్షమాపణ ప్రార్థనా:
ఛత్ర చామర గీత నృత్యం ఆందోళికాం అశ్వారోహణ గజారోహణా
How to perform Guru Purnima?how to do guru pooja at home-how to do guru pooja on Thursday
When you perform this guru pooja:
दाहिने भाग पर – ॐ ऐं ह्रीं श्रीं भद्रकाल्यै नमः
बाएं भाग पर – ॐ ऐं ह्रीं श्रीं भैरवाय नमः
उर्ध्व भाग पर – ॐ ऐं ह्रीं श्रीं लम्बोदराय नम:
गुरु पूजन विधि:
पवित्रीकरण: आसन पर बैठकर बाएं हाथ में जल लेकर दाएं हाथ की अंगुलियों से स्वयं पर छिड़कें
आचमन – मंत्रों को पढ़ आचमनी से तीन बार जल पिएं
सूर्य पूजन – कुमकुम और पुष्प से सूर्य पूजन करें
अब आह्वान करें।
स्थापन: गुरुदेव को अपने षट्चक्रों में स्थापित करें
दीप, नीराजन : ताम्रपात्र में जल, कुंकुम, अक्षत अवं पुष्प लेकर यंत्रों पर समर्पित करें –
पंचलक्ष्मी:
पंचकोष
पंचकल्पलता
पंचकामदुघा
पंचरत्न विद्या
‘ॐ निं निखिलेश्वरायै ब्रह्म ब्रह्माण्ड वै नमः’ इस मंत्र का मूंगा माला से १०१ माला जप करें |
अब प्रार्थना करें।
ॐ सहनावतु सह नौ भुनत्तु सहवीर्यं करवावहै,तेजस्विनां धीतमस्तु मा विद्विषावहै |
ॐ ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणा हुतं |
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना |
ॐ शान्तिः | शान्तिः || शान्तिः |||