Tulasi Mahatyam

Tulasi Mahatyam visit www.stotraveda.com
Tulasi Mahatyam

Tulasi Mahatyam in English:

Tulasi Mahatyam From Patalakanda of Padma Purana:

Tulasi Mahatyam: – Lord Siva said: “My dear Narad Muni, kindly listen now I will relate to you the wonderful glories of Tulasi Devi. One who hears Tulasi Devi’s glories will have all his sinful reactions, stored from many births, destroyed and very quickly attain the lotus-feet of Sri Sri Radha-Krsna.
The leaves, flowers, roots, bark, branches, trunk and the shade of Tulasi Devi are all spiritual. One, whose dead body is burnt in a fire, which has Tulasi wood as fuel, will attain the spiritual world, even if he is the most sinful of sinful persons, and the person who lights up that fire, will be freed from all sinful reactions. One who at the time of death takes the name of Lord Krsna and is touching the wood of Tulasi Devi will attain the spiritual world.

When the dead body is being burnt, even if one small piece of Tulasi wood is put in the fire, then that person will attain the spiritual world; by the touch of Tulasi all other wood is purified. When the messengers of Lord Vishnu see a fire which has Tulasi wood burning in it they immediately come and take that person whose body has been burnt to the spiritual world. The messengers of Yamaraj will not come to that place when Tulasi wood is burning. That person’s body which has been burnt by Tulasi wood goes to the spiritual world and on his way all the demigods shower flowers on him.

When Lord Vishnu and Lord Siva see that person on his way to the spiritual world, they become very happy and bless him and Lord Krsna comes before him and taking his hand, He takes him to His own abode. One, who happens to go to a place where Tulasi wood has been burnt will become purified of all sinful reactions. That Brahmin, who is performing a fire sacrifice and places amongst the other wood Tulasi wood, will get the result of one agnihotra yajna (fire sacrifice) for each grain offered in that fire.

One who offers Lord Krsna incense made of Tulasi wood will get the same result of one hundred fire sacrifices and of giving one hundred cows in charity. One who cooks an offering for Lord Krsna on a fire which has Tulasi wood in it, will attain the same benefit as one who gives in charity a hill of grains as large as Mount Meru for each grain of such an offering to Lord Krsna. One who lights up a lamp to be offered to Lord Krsna with a piece of Tulasi wood will attain the same benefit as one who offers ten million lamps to Lord Krsna.

There is no one more dear to Lord Krsna than that person. One who applies the paste of Tulasi wood to the body of the Deity of Lord Krsna with devotion will always live close to Lord Krsna. That person who puts the mud from the base of Tulasi Devi on his body and worships the Deity of Lord Krsna, gets the results of one hundred days worship each day. One who offers a Tulasi Manjari to Lord Krsna gets the benefit of offering all the varieties of flowers after which he goes to the abode of Lord Krsna. One who sees or comes near a house or garden where the Tulasi plant is present gets rid of all his previous sinful reactions including that of killing a Brahmin.

Lord Krsna happily resides in that house, town, or forest, where Tulasi Devi is present. That house where Tulasi Devi is present never falls on bad times and due to Tulasi Devi’s presence that place becomes more pure than all the Holy places. One who plants a Tulasi tree near the temple of Lord Krsna’s abode… Wherever the smell of Tulasi Devi is taken by the wind it purifies everyone who comes in contact with it. In that house where the mud from the Tulasi Devi is kept, all the demigods along with Lord Krsna will always reside. Wherever the shade of Tulasi Devi falls is purified and is the best place for offering fire sacrifices.

Note: One must only use Tulasi wood which has been attained after Tulasi Devi has dried up, one must never take Tulasi wood from a tree which has not dried up.

Eight names of Tulasi Devi(Asta-Naam-Stava):

Vrindavani, vrinda, visvapujita, pushpasara,
Nandina, krsna-jivani, visva-pavani, tulasi

Vrindavani: one who first manifested in Vrindavan.
Vrinda: The goddess of all plants and trees (even if one Tulasi plant is present in a forest it can be called Vrindavan.).
Visvapujita: one whom the whole universe worships.
Pushpasara: the top most of all flowers, without whom Krishna does not like to look upon other flowers.
Nandini: seeing whom gives unlimited bliss to the devotees.
Krishna-jivani: The life of Krishna.
Visva-pavani: one who purifies the three worlds.
Tulasi: one who has no comparison.

Anyone while worshipping Tulasi Devi chants these eight names will get the same result as one who performs the Asvamed Yagna and one who on the full moon day of Karttik (Tulasi Devi’s appearance day) worships her with this mantra will break free from the bonds of this miserable world of birth and death, and very quickly attains Goloka Vrindavan. On the full moon day of Karttik Lord Krishna Himself worships Tulasi Devi with this mantra.. One who remembers this mantra will very quickly attain devotion to Lord Krishna’s lotus feet.

Sri Tulasi Stava of Sristikanda of Padma Purana

The Brahmin said : “Srila Vyasadeva, we have heard from you the glories of Tulasi Devi’s leaves and flowers. Now we would like to hear from you the Tulasi Stava (prayer)” Srila Vyasadeva replied: “Previously a disciple of Shatanand Muni had approached him with folded hands and inquired about the Tulasi Stava”.

Disciple: “Oh top most of all devotees of Lord Krsna, kindly relate that Tulasi Stava, which you had heard from the mouth of Lord Brahma.” Shatanand replied : “Just by taking the name of Tulasi Devi one pleases Lord Krsna and destroys all sinful reactions”. One who just sees Tulasi Devi gets the benefit of giving millions of cows in charity and when that person offers worship and prayers to Tulasi Devi then that person becomes worthy of worship in this Kali-yuga. In the Kali-yuga that person who plants a Tulasi tree for the pleasure of Lord Krsna even if the messengers of Yamaraj are angry with him, what can they do to him, he need not fear even death personified.

Tulasi amrita janmasi sada twam keshava priya
Keshavartham chinomi twam varada bhava sobhane
Twadang sambhavai aniyam
Pujayami yatha hatim
Tatha kuru pavitrangi
Kalou mata vinashini

One who chants this mantra while picking Tulasi leaves and then offers them to Lord Krsna’s lotus feet, the results of that offering is increased millions of times.

Now listen carefully to the Tulasi Stava:

munayah sidha-gandharvah
Patale nagarat svayam
Prabhavam tava deveshi
Gayanti sura-sattama

na te prabhavam jananti
devatah keshavadrite
gunanam patimananutu
kalpakotisha-tairapi

krsna-anandat samudbhnutu
kshiroda – mathanodyame
uttamange pura yena
tulasi-vishnu na dhrita

prapyaitani tvaya devi
vishno-rangani sarvashah
pavitrata tvaya prapta
tulasim tvam namamyaham

tvadanga-sambhavaih patrai
puja-yami yatha harim
tatha kurushva me vighna
yato yami para gatim

ropita gomati-tire
svayam-krsnena palita
jagaddhitaya tulasi
gopinam hita-hetave

vrindavane vicharata
sevita vishnuna svayam
gokulasya vivriddhyath
kamsasya nidhanaya cha

vashishtha vachanat purvam
ramen sarayu-tate
rakshasanam vadharthaya
ropit-tvam jagat-priye
ropita-tapaso vridhyai
tulasi-tvam namamyaham

viyoge raghavendra-sya
dhyatva tvam janak atmaja
ashokavana-madhye tu
priyena saha-sangata

shankarartha pura devi
parvatya tvam himalaye
ropita sevita siddhyai
tulasi-tvam namamyaham

dharmaranye gayayam cha
sevita pitribhih svayam
sevita tulasi punya
atmano hita-michhata

ropita ramachandren
sevita lakshmanena cha
sitaya palita bhaktya
tulasi-dandake vane

trailokya-vyapini ganga
yatha-shastre-shu giyate
tathaiva tulasi devi
drisyate sacharachare

rishyamuke cha vasata
kapirajen sevita
tulasi balinashaya
tarasangam-hetave

pranamya tulasi-devi
sagarot tkramanam kritam
krit-karayah prahusthascha
hanuman punaragataha

tulasi grahanam kritva
vimukto yati patakaih
athava munishardula
brahma-hatyam-vyapohati

tulasi patra-galitam
yastoyam-sirasa vahet
ganga-snanam avapnoti
dasha-dhenu phala-pradam

prasid devi deveshi
prasid hari vallabhe
kshirod-mathanod bhute
tulasi tvam namamyaham

dvadasyam jagare ratrou
yah pathet tulasi stavam
dvatrim-shadaperadhans cha
kshamate tasya keshavah

Benefits of Chanting Tulasi Stava:

One who worships Tulasi Devi on Dwadasi (the 12 day) and chants this Tulasi Stava destroys all 32 kinds of sinful reactions. Lord Krsna becomes very happy with that person. In that house, where this Tulasi Stava is present misfortune never visits, not even by accident, and the Goddess of Fortune will happily reside there. One who recites this Tulasi Stava will attain devotion to Lord Krsna and his mind will not wonder away from the lotus-feet of Lord Krsna. That person who keeps awake on the Deadasi night after worshipping Tulasi Devi with this Stava will attain the benefit of visiting all the Holy places and his mind will never contemplate enjoying separately from Lord Krsna. Not only this but that fortunate devotee will never be separated from the association of the Vaishnavas (devotees of Lord Krsna.)

Tulasi Mahatyam in Telugu:

తులసి మహత్యం

బిల్వము శివునకెట్లు ప్రియమో అట్లే విష్ణువునకు తులసి ప్రియమైనదిగా నెన్నబడినది. హిందువుల ప్రతి ఇంటిలోను గృహదేవతగా తులసి మొక్క ఆరాధింపబడుచున్నది. అట్టితులసి మహిమ యపారము.

వేద పురాణ శాస్త్రములన్నియు దీని మహిమను వెనోళ్ల చాటుచున్నవి. తులసి దర్శనమున అన్ని పాపములు నశించును. అర్చనాదులచే సకల కోర్కెలీడేరును. ఇది భూలోకపు కల్పతరువు.

హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు, యువరాణి. జలంధర్ ను ఆమె పెళ్ళాడుతుంది. శివుని మూడోకన్ను లోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్ కి అపారశక్తి ఉన్నది. జలంధర్ ఎంతో భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు.

తులసి – స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి పూజ ఎలా చేయాలి? తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి.

దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్య తీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ!
నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి!
నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్
అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి.

తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి..

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టు నుండి దళాలను మంగళ , శుక్ర , ఆది వారములలో, ద్వాదశి , అమావాస్య , పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు .

ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు.

సాలగ్రామమున్నవారు అన్ని తిథి,వారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. “స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి” తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది..

శ్లోకం:

తులసి స్పర్శనం స్నానం
తులసి స్పర్శనం తపః |
తులసి స్పర్శనం మంత్రః
తులసి స్పర్శనం వ్రతమ్ ||
ప్రదక్షిణం కృతం యేన
తులసి మునిసత్తమ |
కృత ప్రదక్షిణ స్తేన
విష్ణుస్సాక్షాన్నసంశయః ||

తులసి పత్రములో అగ్రమున బ్రహ్మ, నడుమ కేశవుడు, కాండమున శివుడు, శాఖలలో అష్టదిక్పాలకులుందురు. లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, శచీదేవుల వాసస్థానమే తులసీ పత్రము. తులసి సత్త్వగుణము యొక్క స్వరూపము.

పత్రమునందు ,కాష్ఠమునందు, గంధమునందు, తుదకు దాని పాది(మూలము)లోని మట్టిలో కూడ సత్త్వగుణము నిండియుండును. తులసి సంపర్కముచేత మనకు సత్త్వగుణము లభించును. తులసి వాసన మనలోని తమోగుణమును పోద్రోలును.

తులసి జన్మవృత్తాంతము మహిమనుగూర్చి దేవీభాగవతములో, పద్మపురాణములో స్కాందములో, అగస్త్య సంహితలో, బ్రహ్మ వైవర్తములో,గణేశఖండములో హరిభక్తవిలాస ధృతవిష్ణుయామళములో, ప్రహ్లాద సంహితలో, విష్ణుధర్తోత్తరములో,బృహన్నారదీయములో,గర్గ సంహితలో, స్మృతి సరోజములో, శ్రీమహాభాగవతములో, సాధనకృతాంజలిలో వివరింపబడినది. మఱియు రామరహస్యోపనిషత్తు, మత్స్య సూక్తము,షోడశపటలము మొదలగు
వానియందు తులసి మాహాత్మ్యమున్నది.

తులసి భౌతికశాస్త్ర విజ్ఞానం:

తులసితో నానాప్రకారముల చికిత్సలు చేసిన నిమ్మళించని రోగములు నివారింపబడునని విజ్ఞాన శాస్త్రములు, చికిత్సావిధానము తెలుపుచున్నది.తులసి పాదులోని మృత్తికను శరీరమునకు పూసుకొని ఆ మట్టినే నియతముగ కొంత కొంత తినుచువచ్చిన సమస్త వ్యాధులు నివారణమగును.డాక్టర్ నళినీనాథ్ యొక పత్రికలో నీ విషయమును తెలిపియున్నారు. ఒకానొకప్పుడొక పాశ్చాత్యోన్నతోద్యోగి ఇంటికి తాను పోయినపుడు అపుడచట తులసి మొక్కనుగాంచి ఆయనను ప్రశ్నించగా ఆయన చెప్పిన విషయములివి.

వైజ్ఞానిక భాషలో తులసి చెట్టులో నున్నంత విద్యుచ్ఛక్తి ఏ ఇతరములైన చెట్టులోను లేదు.తులసి చెట్టునకు నాలుగు వైపుల రెండు వందల గజముల వరకుగల వాయువు శుద్ధిగానుండును. మలేరియా, ప్లేగు,క్షయ మున్నగు రోగములను కలుగజేయు సూక్ష్మ జీవులను తులసి వాసన ధ్వంసముచేయును.తులసి యుండు చోట అంటుజాడ్యములు దరిజేరవు.తులసి గాలి పీల్చుచు,తులసి వనములో దినమున కొక పర్యాయము తిరుగువారిని
ఏ యంటురోగములునంటవు.

తులసి మాలను ధరించిన మానవ శరీరమునందు విద్యుచ్ఛక్తి స్థిరముగా నుండును. రోగ క్రిములు ప్రవేశింపవు.ఆరోగ్య జీవియై దీర్ఘకాలము ధర్మాచరణుడై బ్రతుకును. తులసి రసము సంధిరోగములను,సన్నిపాత జ్వరములను బాపును.తులసి రసముచే శరీరములోని రక్తము శుద్ధియగును.ఇది కుష్టురోగులకు ఉపకారియై తులసి ఆకులను తినుటచేత కుష్టు నివారణ యగును.

తులసి యున్నచోట దోమలు చేరవు. పిడుగు పడిన వానికి తక్షణమే తులసి యాకురసముతో మర్దించిన మైకమువీడి స్వస్థత కలుగును .తులసి తినుటచే దేహమునకు వర్ఛస్సు కలుగును.ఉబ్బసముపోవును. ఎక్కిళ్లు, శ్వాసకాస, విషదోషము, పార్శ్వశూలనిమ్మళించును. వాతకఫములు వాయును. తులసి వేరు వీర్యవర్థకము. చిత్తైకాగ్రతకు దోహదము కలిగించును. సాత్త్వికభావమలవడును.

ఇంద్రియములన్నియు శాంతి నొందును. పూర్వస్మృతి గల్గును. దీనివలన ఆనందమలవడును. తులసికావనములో నుంచిన శవము ఏనాటికిని చెడక చాలాకాలము వరకు నిలువయుండును. ఇది దీని ప్రత్యేకత. జపానులో దీని ప్రాధాన్య మెక్కువ. ఇట్టి వైజ్ఞానిక విషయములను మన ప్రాచీనులు గ్రహించి బిల్వము, తులసి, వేప, ఉసిరిక మున్నగునవి దేవతార్చనకుపయుక్తములుగ నిలిపి మన దైనందిన స్వాస్థ్యజీవనమునకు, లోక కళ్యాణమునకు, సమాజాభివృద్ధికి తోడ్పడిరి.

తులసి ప్రార్థన:

శ్లో: యన్మూలే సర్వతీర్థాని
యన్మధ్యే సర్వదేవతాః |
యదగ్రే సర్వ వేదాశ్చ
తులసీ తాం నమామ్యహమ్ ||

శ్లో: బృందా బృందారణీం
విశ్వపూజితాం విశ్వపావనీమ్ |
పుష్పసారాం నందినీం చ
తులసీం కృష్ణ సేవితమ్ ||

వ్రేళ్లయందు సర్వతీర్థములను, మధ్యభాగమున సర్వ దేవతలును, కొసయందు సర్వ వేదములను గలిగిన తులసిని బృంద, బృందారణి, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార నందినీతులసి, కృష్ణ సేవిత యను ఎనిమిది నామములతో పూజించిన వారికి అశ్వమేధయాగ ఫలము లభించును. రుద్రయామళ తంత్రములో తులసిని సేవించుటకీ క్రింది మంత్రము చెప్పబడినది.

శ్లో: ఓం విష్ణుప్రియే మహామాయే
కాలజాల విదారిణీ |
తులసీ మాం సదా రక్షా
మా మేక మమరం కురు ||

పై మంత్రము నుచ్చరించుచు తులసిని సేవించిన దీర్ఘాయుష్యము కలుగును.

తులసి ప్రాశస్త్యము:

శ్లో: తులసీ కాననం యత్ర యత్ర పద్మ వనాని చ |
సాలగ్రామ శిలా యత్ర యత్ర సన్నిహితో హరిః ||

తా౹౹ తులసీవనమెచ్చటగలదో, పద్మవన మెచ్చట గలదో,
సాలగ్ రామశిల యెచ్చట గలదో శ్రీహరి యచ్చట సన్నిహితుడై
యుండును.

శ్లో: తులస్యమృత జన్మాసి సదా త్వం
కేశవప్రియే |
కేశవార్థం లునామి త్వాం
వరదాభవ శోభనే ||

శ్లో: మోక్షైక హేతోర్ధరణి ప్రసూతే
విష్ణోస్తమ స్తస్యగురోః ప్రియతే |
ఆరాధనార్థం పురుషోత్తమస్య
లునామిపత్రం తులసీ క్షమస్వ ||

శ్లో: ప్రసీద మమదేవేశి ప్రసీద
హరివల్లభే |
క్షీరోదమదనోద్భూతే
తులసీ త్వం ప్రసీదమ్ ||

తా౹౹ తులసిని నాటినను,నీరు పోసినను, తాకినను,పోషించినను, ధర్మార్థకామమోక్షములు గల్గును. తులసి యున్నచోటు పావనమైనది.తులసి తోటకు మూడామడల పరిసర ప్రాంతమంతయు పావనస్థలముగా భావించవలెను.

శ్లో: అనన్యదర్శనాః ప్రాతర్యేపశ్యంతి తపోధన |
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః ||

ఉదయము నిదురలేచిన వెంటనే తులసిని జూచినచో సమస్త తీర్థములు చూచిన ఫలము లభించును.
శ్లో: తులసీ సన్నిధౌ ప్రాణాన్యేత్యజంతి మునీశ్వర |
న తేషాం నిరయక్లేశః ప్రయాంతి పరమం పదమ్ ||

తా౹౹తులసి సమీపమున బ్రాణముల నెవరు విడుతురో వారికి నరకప్రాప్తిలేదు
వారు పరమపదమగు వైకుంఠంమునకుఁబోవుదురు.

తులసీ దళములను స్త్రీలు కోయతగదు.పురుషులు కోయవలెను. తులసిని కోయునపుడు క్రింది శ్లోకమును బఠించుచు కోయవలెను.

శ్లో: తులస్యమృత జన్మాసి సదా త్వం కేశవప్రియే |
కేశవార్థం లునామి త్వాం వరదాభవ శోభనే ||

శ్లో: మోక్షైక హేతోర్ధరణి ప్రసూతే
విష్ణోస్తమ స్తస్యగురోః ప్రియతే |
ఆరాధనార్థం పురుషోత్తమస్య
లునామిపత్రం తులసీ క్షమస్వ ||

శ్లో: ప్రసీద మమదేవేశి ప్రసీద హరివల్లభే |
క్షీరోదమదనోద్భూతే తులసీ త్వం ప్రసీదమ్ ||

తులసి ఒక దివ్యౌషధం:

తులసి మహౌషధి,సర్వవ్యాధి నివారిణి,విషఘ్ని, శ్వాస కాస,క్షయాపస్మారకుష్ఠ్వాది రోగ నివారణ శక్తి గలది. నిత్యము తులసి దళములను భక్షించువారికే రోగములు రావనుటలో నతిశయోక్తి లేదు.

తులసి కఫఛ్ఛేదిని,జఠరాగ్ని వివర్థని,సూక్ష్మరోగక్రిములను తులసి నాశనము చేయును.

  1. తులసి యాకులు,మిరియాలు నమిలిన ఎదురు గుక్కలు (Tonsils)
    బాధింపవు. తిరిగి పెరుగవు.
  2. తులసి పసరున నింగువనూరి తేలు కుట్టినచోట రాచిన నొప్పి యుపశమించును.
  3. చిగుళ్ల వాపు,నోటి దుర్వాసన,తులసియాకులను నమిలి నీటితో పుక్కిళించుటచే నివారించును.
  4. తులసి బీజములు భక్షించి,నీరు తాగిన కొన్ని దినములవరకు ఆకలి నరికట్టవచ్చును.
  5. తులసి బీజములు నీటిలో వేసి చక్కరగలిపి సేవించిన జల్లదన మిచ్చును.తులసీ లక్షణములుగల రుద్రజడ లేక కమ్మగగ్గెర బీజములను మహమ్మదీయులు షర్బత్తులందు చేర్తురు.
  6. తులసీ బీజములను తమలమునందు చేర్చి సేవించిన వీర్యము స్తంభించును.ఇది సిద్ధప్రక్రియ.

తులసి రకములు:

1.రామతులసి
2.లక్ష్మీ తులసి
3.కృష్ణ తులసి
4.నిమ్మ తులసి
5.కర్పూర తులసి(కుక్క తులసి, కంటకీ తులసి మొదలగునవి) ఇందు – కుక్క తులసి, కంటకీ తులసి పూజింప యోగ్యములుకావు.కర్పూర తులసిని కూడా పూజింపరు.అన్నిటికంటే
కృష్ణ తులసి శ్రేష్ఠమైనది.

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.