Karthika Puranam Day16 Adhyayam

Karthika Puranam 16th Day Parayanam Visit www.stotraveda.com
Karthika Puranam 16th Day Parayanam

Karthika Puranam Day16 Adhyayam Story

పద హరో రోజు పారాయణం-కార్తీక పురాణం 16వ అధ్యాయం

Karthika Puranam 16th Day Parayanam -Karthika Puranam Day16 Adhyayam

కార్తీకపురాణం – 16వ రోజు పారాయణము

స్తంభ దీపప్రశంస

వశిష్టుడు చెబుతున్నాడు-

“ఓ రాజా! కార్తిక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికర మైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన , వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు.

ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసికోట వద్ద గాని – భగవంతుని సన్నిధినగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నీధియందు ధూపదీపనైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల – చిరకాలమునుండి సంతతిలేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు . పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ద్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపముగాని, స్తంభదీపము గాని వుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశర్యములు కలిగి , వారి జీవితము ఆనందదాయకమగును . 

ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగును పోసిదీపముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీ పం పెట్టువారి పరిహసమడు వారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము.

దీపస్తంభము విప్రుడ గుట:

ఋషులలో అగ్రగణ్యుడన పేరొందిన మతంగ మహాముని ఒక చోట అశ్రమాన్నిఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణుమందిరాన్నికూడా నిర్మించుకొని, నిత్యమూ పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయద్వారాల పై దీపములు వెలిగించి, కడు భక్తీ తో శ్రీ హరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దుడు తక్కిన మునులని జూచి 

” ఓ సిద్దులారా! కార్తిక మాసములో హరి హరాదుల ప్రితికోరకు స్తంభదీపము నుంచిన చో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి . హరి హరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భము పాతి,దాని పై దీపమును పెట్టుదము. కావున మన మందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభ ము తోడ్కుని వత్తము, రండు ” అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవును నేతితి నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి . పిమ్మట వారందరూ కూర్చోండి పురాణ పఠనము చేయుచుండగా ఫళ ఫళ మును శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్క లై పడి, దీపము ఆరిపోయి చెల్లచెదురై పడి యుండెను . 

ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యము తో నిలబడి యుండిరి. అంతలో ఆ స్తంభమునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి ” ఓయీ నీవేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి” అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి ” పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను . ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీ హరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరి వారముతో కూర్చుండి యున్న సమయమున నే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించిన నేను అతనిచే నా కళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను.స్త్రీ లను , పసిపిల్లలను హీనముగా చూచుచుండడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నే వరును మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది.దాన ధర్మములుమెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై , పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్క నై, పది వేల జన్మలు కాకినై, ఐదు వేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొన లేక పోతిని. ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూప మెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్ని౦పు ” డని వేడుకొనెను.

ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్య మొంది ” ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది యునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళూ, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తినొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీప ముంచిన మునుజునకు వైకుంట ప్రాప్తి తప్పక సిద్ధించును. అందులననే యీ స్త౦భమునకు ముక్తి కలిగిన” దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి” ముని పుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నా యీ సంశయము బాపు”డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో ఒకడగు అంగీరసమునితో ” స్వామి! మీరే అతని సంశయమును తీర్చ గల సమర్ధులు గాన, వివరించు”డని కోరిరి. అంత నా౦గీర సుడిట్లు చెప్పు చున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

షోడ శా ధ్యాయము – పద హరో రోజు పారాయణము సమాప్తం.