Karthika Puranam Day4 Adhyayam Story
నాల్గవ రోజు పారాయణం-కార్తీక పురాణం 4వ అధ్యాయం
Karthika Puranam 4th Day Parayanam
ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు ‘మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు’ అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి ‘ పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?’ యని ప్రశ్ని౦చగా, ‘ ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను’ అని చెప్పెను. అంత మునిపున్గావుడు’ ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ‘ యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ‘ శత్రుజి’ యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ‘ చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,’ యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారున ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ – యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ‘ ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ‘ ఓ బాపడ!ఎ వరెంతటి నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు’ అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ‘ అల యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చ వలసినదే ‘ అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.