Mathangi Navaratri Dates

మాతంగి నవరాత్రి శ్యామలా దేవి నవరాత్రులు

Mathangi Navratri Dates-Shyamala Navratri Dates మాతంగి నవరాత్రి శ్యామలా దేవి నవరాత్రులు www.stotraveda.com
మాతంగి నవరాత్రి శ్యామలా దేవి నవరాత్రులు

Mathangi Navaratri Pooja Vidhanam in Telugu:

దేవీనవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు.

ముఖ్యమైన నవరాత్రులు నాలుగు అవి
1..చైత్రమాసంలో వసంతనవరాత్రి
2.ఆషాడమాసంలో వారాహినవరాత్రి
3.అశ్వయుజమాసంలో దేవీనవరాత్రి
4.మాఘమాసంలో మాతంగి నవరాత్రి లేదా శ్యామలా దేవి నవరాత్రి

నవరాత్రి దీక్ష అనేది మొదటి రెండు సార్లు చైత్ర మరియు ఆశ్వీయజ మాసంలో జరుపుకుంటారు. దీనిని ప్రత్యక్ష నవరాత్రి అని పిలుస్తారు. మరో రెండు సార్లు నవరాత్రిని ఆషాడ మరియు మాఘ మాసములలో జరుపుకుంటారు. దీనిని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి లేదా ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారు.

ఇవి కేవలము కొంతమంది అంటే సాధకులు, ఉపాసనకు గురువులు మంత్ర పరిజ్ఞానం తెలిసిన వారు మాత్రమే చేసుకుంటారు.లోపం ఏమంటే నిస్స్వార్థంగా చెప్పేవారు లేకపోవడం వల్లనే.. మంచి గురువులు లేకపోవడం వల్లనే…

ప్రత్యక్ష మరియు గుప్త నవరాత్రి వేడుకల మధ్య తేడా ఏమిటి?:
ప్రత్యక్ష నవరాత్రులనేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సవంగా ప్రదర్శనంగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రని మాత్రం దేవి సాన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుతారు.కేవలం దేవతా ప్రీతికై తంత్ర, మంత్రాలు మరియు ఇతర రకాల పారాయణ హోమాదికాలను వైదికంగా కార్య నిర్వహిస్తుంటారు.

భారతదేశం అంతటా ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా గుప్తంగా అంటే ఆడంబరాలు, అట్టహాసాలు, పెద్ద పెద్ద హడావిడి లెకుండా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా కాకుండా అతి శీఘ్రముగా ధర్మ బద్ధమైన కోరికలు నెరవేర్చుకోనుటకు, ఎవరిని వారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యముగా వృద్ది కావుటకోరకు పంచపుజలు చేసి ఇంట్లో ఉండే నైవేద్యం చెల్లించి మంత్రజపం చేసుకుంటారు. వీటిని చాలా గొప్పలు చెప్పుకాకుండా రహస్యంగా చేసుకుంటారు.

శ్యామల దేవి అంటే ఎవరు?

మాతంగియే రాజ శ్యామల, శ్రీ లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు.

విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, ఎడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు.

శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కానివారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ తల్లిని దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు.

అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది?
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి.

Mathangi Navaratri పూజా విధానం:

ఈ దేవికి 9రోజులు పంచపూజలు చేసి నైవేద్యం చెల్లించి మంత్రజపం తప్పక చెయాలి. మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు, తెలుపు పూలతో అలంకరణ చేసుకోండి. ప్రసాదంగా తమలపాకు, చిన్న ఎండు కర్జూరం, తేనే, యాలక, లవంగ,చిన్న ఎండుకొబ్బరి ముక్క పెట్టాలి లేదా చిన్న పటిక బెల్లం ముక్క పెట్టాలి.
క్రింది షోడస నామాలుతో కూడా పూజ చేసుకోవచ్చు.

  1. సంగీత యోగిని
  2. శ్యామా
  3. శ్యామలా
  4. మంత్ర నాయిక
  5. మంత్రిని
  6. సచివేశి
  7. ప్రధానేశీ
  8. శుక ప్రియ
  9. వీణా వతి
  10. వైణికి
  11. ముద్రిని
  12. ప్రియక ప్రియా
  13. నీప ప్రియ
  14. కదంబెశి
  15. కాదంబ వనవాసిని
  16. సదామలా

రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి పఠించట వలన అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తుల భయం మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఈ మంత్రాన్ని కానీ స్తోత్రమును కానీ ఎక్కువ సార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమితమైన బుద్ధి శక్తిని, అపార మేధా సంపత్తును కల్గజేస్తుందని శాస్త్ర వచనం.

గుప్త నవరాత్రులలో నిర్దిష్టమైన జప, పారాయణాది అనుష్ఠానముచే మంత్రసిద్ధి కల్గి సాధకుని కోరికలను తీర్చుకోవచ్చు. నిజమైన భక్తులు తొమ్మిది రోజులు ఆచారాలను పాటిస్తారు శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిణి అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .

శ్యామలా ఉపాసన అనేది దసమహావిద్య లో ఒకవిద్య ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు..దసమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దసమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దసమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన వన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవారాత్రి ని విశేషంగా జరుపుకుంటారు

Mathangi Navaratri Dates 2023:

Navratri Day 1:
22nd January 2023 Sunday Pratipada
Ghatasthapana, Shailputri Puja

Navratri Day 2:
23rd January 2023 Monday Dwitiya
Brahmacharini Puja

Navratri Day 3:
24th January 2023 Tuesday Tritiya
Chandraghanta Puja

Navratri Day 4:
25th January 2023 Wednesday Chaturthi
Kushmanda Puja

Navratri Day 5:
26th January 2023Thursday Panchami
Skandamata Puja

Navratri Day 6:
27th January 2023 Friday Shashthi
Katyayani Puja

Navratri Day 7:
28th January 2023 Saturday Saptami
Kalaratri Puja

Navratri Day 8:
29th January 2023 Sunday Ashtami
Durga Ashtami, Mahagauri Puja

Sandhi Puja:
Sandhi Puja begins at 11:11 AM
Sandhi Puja ends at 11:59 AM

Navratri Day 9:
30th January 2023 Monday Navami
Siddhidatri Puja, Navratri Parana

శ్యామల నవరాత్రి తేదీలు/ Mathangi Navaratri 2022 :

2022 ఫిబ్రవరి 02 నుండి 2022 ఫిబ్రవరి 10వరకు..
మొదటి రోజు: లఘుశ్యామలదేవి (Lagu Shyamala Devi)
రెండవ రోజ: వాగ్వాధినిశ్యామలదేవీ (Vaagvadhini Shyamala Devi)
మూడవ రోజు: నకులశ్యామలదేవీ (Nakula Shyamala Devi)
నాలగవ రోజు: హసంతి శ్యామల (Hasanthi Shyamala Devi)
ఐదవ రోజు: సర్వసిద్ది మాతంగిదేవీ (Sarvasiddi Maatangi Devi)
ఆరవ రోజు: వాస్యమాతంగిదేవీ (Vyasa Maatangi Devi)
ఏడవ రోజు: సారిక శ్యామల దేవీ (Sarika Shyamala Devi)
ఎనిమిదవ రోజు: శుక శ్యామల దేవీ (Sukha Shyamala Devi)
తొమ్మిదవ రోజు: రాజమాతంగిదేవి మరియూ రాజశ్యామల దేవి (RajaMathangi Devi RajaShyamala Devi)

గుప్త నవరాత్రి ప్రయోజనాలు:

శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క మంత్రిణీ శక్తియైన శ్రీ శ్యామల దేవిని శాంతపరచటానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. దేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది.

ఈ నవరాత్రులలో ప్రతి రోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాసించటం వలన దేవతానుగ్రహం అతిశీఘ్రంగా ఆ ఉపాసకునికి లభించి ఆ ఉపాసకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామంలో ఉండే ఆస్తికులైన ప్రజలందరి దుఃఖం నుంచి విముక్తులవుతారు.

గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను మరియు ఆందోళనలను తగ్గిస్తుంది. తద్వారా భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు.

శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు, కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.

ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా”కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.

శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది, ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామల దండకం.

ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని క్రింది స్తోత్రంతో ఆరాధించుకుందాం.