Venkateshwara Swamy Suprabhatam in Telugu

Venkateshwara Swamy Suprabhatam lyrics in Telugu with Meaning Visit www.stotraveda.com
Venkateshwara Swamy Suprabhatam lyrics in Telugu

Venkateshwara Swamy Suprabhatam lyrics in Telugu with Meaning

॥ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ॥


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ ॥ 1 ॥

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ ॥ 3 ॥

తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే
వృషశైలనాద థయితే దయానిధే. ॥ 4 ॥

అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌ ॥ 5 ॥

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 6 ॥

ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాళికానాం
ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 7 ॥

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్ట కదలీఫల పాయసాని
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 8 ॥

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా
గాయన్త్యనంత చరితం తవ నారదో7పి
భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 9 ॥

భృంగావళీచ మకరంద రసానువిద్ధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ
నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 10 ॥

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 11 ॥

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 12 ॥

శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 13 ॥

శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః
శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 14 ॥

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 15 ॥

సేవాపరాః శివసురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 16 ॥

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 17 ॥

సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి
స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధిదాస దాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 18 ॥

త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా
కల్పాగమాకలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 19 ॥

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 20 ॥

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 21 ॥

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 22 ॥

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే
కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 23 ॥

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్‌
స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 24 ॥

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరసిహేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌ ॥ 25 ॥

భాస్వానుదేతి వికటాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్‌ ॥ 26 ॥

బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 27 ॥

లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 28 ॥

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్‌ (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్‌- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥

 

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం తాత్పర్యం/అర్థం:

తాత్పర్యం1:
కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

తాత్పర్యం2: 

 ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.

తాత్పర్యం3:

సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం4:

కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం5:

అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం6:

శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం7:

కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం8:

ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!

తాత్పర్యం9:

ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం10:

మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.

తాత్పర్యం11:

ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం12:

సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం13:

శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం14:

బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం15:

ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం16:

ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం17:

దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­ు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం18:

సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం19:

ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం20:

స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం21:

ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం22:

ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం23:

మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.

తాత్పర్యం24:

ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం25:

ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం26:

ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం27:

ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం28:

ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

తాత్పర్యం29:

వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.