Varahi Mantras and Stotras

Varahi Stotras , Mantras and Kavachas in English , Telugu, Hindi

Varahi Stotras , Mantras and Kavachas Visit stotraveda.com
Varahi Stotras , Mantras and Kavachas
Here you can find collection of Varahi Devi stotras and mantras, kavach, ashtottara shatanamavali. Sri Varahi is a prominent deity in the Sakteyam and is worshiped prominently in Southern India. She is associated with Earth and all material related possessions.
 
Varahi gives command and order to Ajnya Chkara. Ajnya or Agya Chakra is considered as a center of all other Chakras such as Muladhar, Svadhisthan etc.

She grants all wishes, removes our ego and punishes all evil afflicting us. She offers immense protection and shields us from misery. She is always ready to strike down and correct our path, whenever we go astray. She will pave the way towards all our goals and helps us achieve the highest levels of spirituality as well as material success. Her boar face indicates that She can dig deep into our karmas and will remove all the hurdles affecting our success in all matters. Her vehicle mahiṣa(buffalo), represents the ego and inertness in a person to change and reset to the same old behavior, like a buffalo bathing in the same murky waters. She riding the buffalo represents Her ability to bring about the change within us and take us forward to spiritual and material heights.

No one who seeks Her blessings and surrenders unto Her, will go empty handed. Such is Her greatness!

She is also seen as the consort of Varaha, an avatar of Lord Vishnu. In the Shaiva tradition, She is the consort of Unmatta Bhairava, A form of Siva intoxicated with bliss. A state that is experienced in the Sahasrara chakra. She is also one of seven/ eight matrkas governing the Western direction.

Temples dedicated to Goddess Varahi:

A 9th-century Varahi temple exists at Chaurasi about 14 km from Konark, Orissa, where Varahi is installed as Matysa Varahi and is worshipped by Tantric rites.In Varanasi, Varahi is worshipped as Patala Bhairavi. In Chennai, there is a Varahi temple in Mylapore, while a bigger temple is being built near Vedanthangal. Ashadha Navaratri, in the Hindu month of Ashadha (June/July), is celebrated as a nine-day festival in honour of Varahi at the Varahi shrine at Brihadeeswarar temple (a Shaiva temple), Thanjavur. The goddess is decorated with different types of alankarams (ornaments) every day. Full moon days are considered sacred to Varahi. An ancient temple of the goddess is also found at Uthirakosamangai.

Ashta-Varahi temple with eight forms of Varahi is situated in Salamedu near Villupuram.One more prominent temple of the Goddess is located in Coimbatore, Tamil Nadu. There is also a prominent temple of the Goddess in Gonda district of Gujarat. Several temples of the Goddess can be found in Nepal, and many other countries, including the United States and Malaysia.

A Barahi temple is situated in the middle of Phewa Lake, Nepal. Here, Goddess Varahi known as in Nepal as Barahi as she is worshipped in the Matysa Varahi form as an incarnation of Durga and an Ajima (“grandmother”) goddess. Devotees usually sacrifice male animals to the goddess on Saturdays. Jaya Barahi Mandir, Bhaktapur, is also dedicated to Barahi.

Benefits of worshiping Goddess Varahi:
The Goddess is revered by devotees as the granter of boons and destroyer of enemies.(She Destroys our inner enemies like kama (desire), krodha (anger), lobha (greed), Mada (arrogance), moha (delusion), and matsarya (jealousy) ) She is also a focal point of Tantric worship and people pray to her for leading a long and prosperous life.

 

శ్రీ వారాహీ దేవి స్తవము

శ్లో ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీమ్
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాళాకృతిం
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితామ్

శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్ 1

వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీమ్ 2

స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్ 3

పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీమ్ 4

విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే 5

దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే 6

ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వన్దే 7

సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దే 8

నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్ 9

సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్ 10

వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్ 11

చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమి 12

ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్ 13

వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యామ్ 14

బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్ 15

వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్ 16.

శ్రీ వారాహీ దేవి ధ్యానములు

శ్రీ వార్తాళి వారాహీ ధ్యానం
చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్
సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్

శ్రీ బృహద్వారాహీ ధ్యానం
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్

శ్రీ లఘు వారాహీ ధ్యానం
మహార్ణవే నిపతితా ముద్ధరంతాం వసుంధరాం
మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్త భైరవీమ్

శ్రీ స్వప్న వారాహీ ధ్యానం
ధ్యాయేద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రామున్నతస్తనీం
కాల్యాస్యామీ చంద్రఫాలాం చ దంష్ట్రోద్ధృత వసుంధరామ్
ఖడ్గాంకుశౌ దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ
అశ్వారూఢాం చ వారాహీం నానాలంకార భూషితామ్

శ్రీ ధూమ్ర వారాహీ ధ్యానం
నమస్తే ధూమ్రవారాహి వైరిప్రాణాపహారిణి
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథాహరిః
పిబరక్తం చ దేవేశి అశలమాంసం చ భక్షయ
పశూన్ దదామి తే శత్రూన్వందే త్వాం శత్రురూపిణి

శ్రీ కిరాత వారాహీ ధ్యానం
ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాంపరాం
ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం
క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం
ధ్యాయేత్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితామ్

ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం
శత్రుపత్నీ కంఠసూత్ర ఛేద క్షురికరూపిణీం
దేవీం జగత్త్రయే క్షోభకారక క్రోధ సంయుతాం
అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చితయేత్పరామ్

దేశం సుభిక్షంగా ఉండాలని,మనమంతా చల్లగా ఉండాలని,ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం

ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ

వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని.లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.అందుకే ఆవిడను దండనాథ అన్నారు.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి..ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది.వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే..రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు.అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది.నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం.అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి.శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు.దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు.ఈ తల్లి ప్రాణ సంరక్షిణి..ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.

ఈ అమ్మవారు శాక్తేయం లో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.

శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.

దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .

వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం. ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .

ప్రకృతి పరంగా చూసినట్లైతే..ఈ సమయంలో వర్షం కురుస్తుంది.రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.

అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి,బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి.ముఖ్య ప్రాణ రక్షిణి.హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి దేవి ద్వాదశ నామాలు 

  • పంచమి
  • దండనాథా
  • సంకేతా
  • సమయేశ్వరి
  • సమయ సంకేతా
  • వారాహి
  • పోత్రిణి
  • వార్తాళి
  • శివా
  • ఆజ్ఞా చక్రేశ్వరి
  • అరిఘ్ని
  • మహాసేనా

శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||

వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||

నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||

ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం