Karthika Puranam
సంపూర్ణ కార్తీక మహాపురాణము
జనకుడు వశిష్ఠుని కార్తీక ప్రత ధర్మములడుగుట:
Tithi Tithi Devta and Puja Phalam (Benefits)
Karthika Suddha Padyami Lord Shiva Tejas (Glory)
Karthika Suddha Vidiya Lord Vishnu Santhi (Peace of mind)
Karthika suddha Tadiya Shakti Aishwarya Prapthi (Wealth)
Karthika Suddha Chavithi Naga devatas / Lord Subrahmanyeswara Ayush and Arogya Prapthi (Longevity and Health)
Karthika Suddha Panchami Lord Subrahmanyeswara Karya siddhi (Success in work)
Karthika Suddha Shasthi Lord Subrahmanyeswara Santhana prapthi (Children)
Karthika Suddha Sapthami Lord Surya (Sun) Tejas and Arogya (Glory and Health)
Karthika Suddha Ashtami Goddess Durga Sankata nivarana (Relief from Miseries)
Karthika Suddha Navami Pithru devatas Kutumba soukhyam (Happy family)
Karthika Suddha Dasami Lord Ganesh /
Gajendra moksha parayana for Lord Vishnu Relief from Obstacles
Karthika Suddha Ekadashi Lord Shiva Karya siddhi (Success in work)
Karthika Suddha Dwadashi Lord Vishnu Dhana Dhanya vriddhi
(Wealth and Good life)
Karthika Suddha Trayodashi Lord Vishnu Tejas (Glory)
Karthika Suddha Chaturdashi Lord Kala Bhairava Akala Mruthyu Haranam (Relief from sudden Deaths)
Karthika Suddha Pournami Lord Shiva / Lord Krishna Moksha
Karthika Bahula Pdyami Lord Agni (Fire) Tejas (Glory)
Karthika Bahula Vidiya Ashwani devatas (Two Doctors of Gods) Arogya (Health)
Karthika Bahula Tadiya Gauri (Parvathi) Soubhagya (Good for Husband and Children)
Karthika Bahula Chavithi Lord Ganesh Kutumba Saukhyam (Gives happy family life)
Karthika Bahula Panchami Lord Subrahmanyeswara Vijaya (Victory)
Karthika Bahula Shasthi Lord Subrahmanyeswara Santhana Vriddhi (Children)
Karthika Bahula Sapthami Lord Surya Ayush and Arogya (Longevity and Health)
Karthika Bahula Ashtami Ashta Lakshmi Santhi (Peace)
Karthika Bahula Navami Goddess Durga Karya siddhi (Success everywhere)
Karthika Bahula Dasami Ashta Dikpalakas (Indra, Agni, Yama, Nirruthi, Varuna, Vayu, Kubera, Eeshana[Shiva]) Keerthi (Fame)
Karthika Bahula Ekadashi Kubera Dhana Prapthi (Money)
Karthika Bahula Dwadashi Lord Vishnu Yoga Prapthi (Eternal unity)
Karthika Bahula Trayodashi Lord Yama Vyadhi Nivarana (Relief from severe diseases)
Karthika Bahula Chaturdashi Mruthyunjaya (A form of Lord Shiva) Arogya (Relief from diseases and Healthy body and mind)
Karthika Bahula Amavasya Pithru Devathas Mano Dhairyam (Mental stability)
కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు:
1వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , చద్ది , ఎంగిలి , చల్లని వస్తువులు
దానములు : నెయ్యి , బంగారం
పూజించాల్సిన దైవము : స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము : ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము : తేజోవర్ధనము
2వ రోజు:
నిషిద్ధములు : తరగబడిన వస్తువులు
దానములు :కలువపూలు , నూనె , ఉప్పు
పూజించాల్సిన దైవము : బ్రహ్మ
జపించాల్సిన మంత్రము : ఓం గీష్పతయే – విరించియే స్వాహా
ఫలితము : మనః స్థిమితము
3వ రోజు:
నిషిద్ధములు : ఉప్పు కలిసినవి , ఉసిరి
దానములు : ఉప్పు
పూజించాల్సిన దైవము : పార్వతి
జపించాల్సిన మంత్రము : ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా
ఫలితము : శక్తి, సౌభాగ్యము
4వ రోజు:
నిషిద్ధములు : వంకాయ , ఉసిరి
దానములు : నూనె , పెసరపప్పు
పూజించాల్సిన దైవము :-విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా
ఫలితము : సద్బుద్ధి , కార్యసిద్ధి
5వ రోజు:
నిషిద్ధములు : పులుపుతో కూడినవి
దానములు : స్వయంపాకం , విసనకర్ర
పూజించాల్సిన దైవము : ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము : (మంత్రం అలభ్యం , ప్రాణాయామం చేయాలి)
ఫలితము : కీర్తి
6వ రోజు:
నిషిద్ధములు : ఇష్టమైనవి , ఉసిరి
దానములు : చిమ్మిలి
పూజించాల్సిన దైవము : సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము : ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము : సర్వసిద్ధి, సత్సంతానం , జ్ఞానలబ్ధి
7వ రోజు:
నిషిద్ధములు : పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు : పట్టుబట్టలు , గోధుమలు , బంగారం
పూజించాల్సిన దైవము : సూర్యుడు
జపించాల్సిన మంత్రము : ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము : తేజస్సు, ఆరోగ్యం
8 వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , మద్యం , మాంసం
దానములు : తోచినవి – యథాశక్తి
పూజించాల్సిన దైవము : దుర్గ
జపించాల్సిన మంత్రము : ఓం – చాముండాయై విచ్చే – స్వాహా
ఫలితము : ధైర్యం, విజయం
నిషిద్ధములు : నూనెతో కూడిన వస్తువులు , ఉసిరి
దానములు : మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము : అష్టవసువులు – పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః
ఫలితము : ఆత్మరక్షణ, సంతాన రక్షణ
10వ రోజు:
నిషిద్ధములు : గుమ్మడికాయ , నూనె , ఉసిరి
దానములు : గుమ్మడికాయ , స్వయంపాకం , నూనె
పూజించాల్సిన దైవము : దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము : ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము : యశస్సు – ధనలబ్ధి
11వ రోజు:
నిషిద్ధములు : పులుపు , ఉసిరి
దానములు : వీభూదిపండ్లు , దక్షిణ
పూజించాల్సిన దైవము : శివుడు
జపించాల్సిన మంత్రము : ఓం రుద్రాయస్వాహా , ఓం నమశ్శివాయ
ఫలితము : ధనప్రాప్తి , పదవీలబ్ధి
12వ రోజు:
నిషిద్ధములు : ఉప్పు , పులుపు , కారం , ఉసిరి
దానములు : పరిమళద్రవ్యాలు , స్వయంపాకం , రాగి , దక్షిణ
పూజించాల్సిన దైవము : భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము : ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము : బంధవిముక్తి , జ్ఞానం , ధన ధాన్యాలు
13వ రోజు:
నిషిద్ధములు : రాత్రి భోజనం , ఉసిరి
దానములు : మల్లె , జాజి వగైరా పూవులు , వనభోజనం
పూజించాల్సిన దైవము : మన్మధుడు
జపించాల్సిన మంత్రము : ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము : వీర్యవృద్ధి, సౌదర్యం
14వ రోజు:
నిషిద్ధములు : ఇష్టమైన వస్తువులు , ఉసిరి
దానములు : నువ్వులు , ఇనుము , దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము : యముడు
జపించాల్సిన మంత్రము : ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము : అకాలమృత్యువులు తొలగుట
15వ రోజు:
నిషిద్ధములు : తరగబడిన వస్తువులు
దానములు : కలువపూలు , నూనె , ఉప్పు
జపించవలసిన మంత్రం : ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’
16వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , చద్ది ,ఎంగిలి , చల్ల
దానములు : నెయ్యి , సమిధలు , దక్షిణ , బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని జపించాల్సిన
మంత్రము : ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము : వర్చస్సు , తేజస్సు , పవిత్రత
17వ రోజు:
దానములు : ఔషధాలు , ధనం
పూజించాల్సిన దైవము : అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము : ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము : సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం
18వ రోజు:
నిషిద్ధములు : ఉసిరి
దానములు : పులిహార , అట్లు , బెల్లం
పూజించాల్సిన దైవము : గౌరి
జపించాల్సిన మంత్రము : ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము : అఖండ సౌభాగ్య ప్రాప్తి
19వ రోజు:
నిషిద్ధములు : నెయ్యి , నూనె , మద్యం , మాంసం , మైధునం , ఉసిరి
దానములు : నువ్వులు , కుడుములు
పూజించాల్సిన దైవము : వినాయకుడు
జపించాల్సిన మంత్రము : ఓం గం గణపతయే స్వాహా
ఫలితము : విజయం , సర్వవిఘ్న నాశనం
20వ రోజు:
నిషిద్ధములు : పాలుతప్ప – తక్కినవి
దానములు : గో , భూ , సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము : నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము : ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము : గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి
21వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , ఉప్పు , పులుపు , కారం
దానములు : యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము : కుమారస్వామి
జపించాల్సిన మంత్రము : ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము : సత్సంతానసిద్ధి , జ్ఞానం , దిగ్విజయం
22వ రోజు:
నిషిద్ధములు : పంటికి పనిచెప్పే పదార్ధాలు , ఉసిరి
దానములు : బంగారం , గోధుమలు , పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము : సూర్యుడు
జపించాల్సిన మంత్రము : ఓం సూం – సౌరయే స్వాహా , ఓం భాం – భాస్కరాయ స్వాహా
ఫలితము : ఆయురారోగ్య తేజో బుద్ధులు.
23వ రోజు:
నిషిద్ధములు : ఉసిరి , తులసి
దానములు : మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము : అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము : ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము : మాతృరక్షణం , వశీకరణం
24వ రోజు:
నిషిద్ధములు : మద్యమాంస మైధునాలు , ఉసిరి
దానములు : ఎర్రచీర , ఎర్ర రవికెలగుడ్డ , ఎర్రగాజులు , ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము : శ్రీ దుర్గ
ఫలితము : శక్తిసామర్ధ్యాలు , ధైర్యం , కార్య విజయం
25వ రోజు:
నిషిద్ధములు : పులుపు , చారు – వగయిరా ద్రవపదార్ధాలు
దానములు : యథాశక్తి
పూజించాల్సిన దైవము : దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము : ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము : అఖండకీర్తి , పదవీప్రాప్తి
26వ రోజు:
నిషిద్ధములు : సమస్త పదార్ధాలు
దానములు : నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము : కుబేరుడు
జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము : ధనలబ్ది , లాటరీవిజయం , సిరిసంపదలభివృద్ధి
27వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , వంకాయ
దానములు : ఉసిరి , వెండి , బంగారం , ధనం , దీపాలు
పూజించాల్సిన దైవము : కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము : ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము : మహాయోగం , రాజభోగం , మోక్షసిద్ధి
28వ రోజు:
నిషిద్ధములు : ఉల్లి , ఉసిరి , సొర , గుమ్మడి , వంకాయ
దానములు : నువ్వులు , ఉసిరి
పూజించాల్సిన దైవము : ధర్ముడు
జపించాల్సిన మంత్రము : ఓం ధర్మాయ , కర్మనాశాయ స్వాహా
ఫలితము : దీర్ఘకాల వ్యాధీహరణం
29వ రోజు:
నిషిద్ధములు : పగటి ఆహారం , ఉసిరి
దానములు : శివలింగం , వీభూది పండు , దక్షిణ , బంగారం
పూజించాల్సిన దైవము : శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము : ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము : అకాలమృత్యుహరణం , ఆయుర్వృద్ధి , ఆరోగ్యం , ఐశ్వర్యం
30వ రోజు:
నిషిద్ధములు : పగటి ఆహారం , ఉసిరి
దానములు : నువ్వులు , తర్పణలు , ఉసిరి
పూజించాల్సిన దైవము : సర్వదేవతలు , పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము : ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము : ఆత్మస్థయిర్యం , కుటుంబక్షేమం.